నీతిగా బ్రతుకులో
జ్యోతిలా వెలగాలి
ఖ్యాతిని గడించాలి
ప్రీతిని చూపించాలి
తోటలో పూలలా
ఊటలో నీరులా
పూట పూట ఉండాలి
కోటలా మారాలి
అన్నదాత మాదిరి
ఉన్న ఊరు కీర్తిని
మిన్నగా చాటాలి
కన్నోళ్లను చూడాలి
శ్రద్ధగా చదవాలి
బుద్దిగా మసలాలి
వృద్ధుల సేవ చేసి
వృద్ధిలోకి రావాలి
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల