ప్రేమ నింపుకున్న పూవు

కూలి వడలి కమిలిపోయిన కలల వసంతాలు
ప్రేమ రత్నాల వెన్నెలలు తెగిపడిన గాలిపటాలు
ఊహలు మదినిండా దాచుకున్నవి ఫలించక విరిగిపడిన ప్రయత్నాలు,,,,,
కొట్టుకుంటున్న వలలో చిక్కిన చేపను చూసి నల్లబల్లపై రాసే అక్షరాలు నగుబాట్ల నర్తనలు,,,,,,,
నీ విఫలమై మోసపోయిన ప్రేమ కోర్కెలు రాక్షసుని వికృతానందానికి బలి,,,,,,
అల్పుడు నయవంచన ఆనందంతో వాడుకున్న గూడుపుఠాని,,,,,,
మూర్ఖత్వం గాలి కబుర్లలో లోకం విసిరే రాళ్ళలో పెనుగాయాలైన మనస్సు,,,,,,,
కన్నీళ్ల జలపాతాలు ఇంకిపోయి నాగజెముళ్లు మొలిచిన జీవితం,,,,,,
మనస్సు గూడు అగ్నిపర్వతం విరజిమ్మే లావా,,,,,
అయినా అక్షరాల తొలిపొద్దులో మళ్లీ వికసించిన మల్లియవు,,,,
పూసే పూవులు, వీచే మలయమారుతాలలో కాలం వర్షించి జీవితం నేర్పిన గుణపాఠాలలో గృహిణివి,,,,,,
ప్రేమలల్లుకున్న గృహంలో భర్త పిల్లాపాపలతో సంసార సరిగమలు,,,,,
వెల్లువెత్తిన ఆటుపోట్ల సుడిగుండాలు దాటి రహదారిలో బహుదూరపు బాటసారివి,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *