నువ్వు నా జీవిత భాగస్వామి

అక్షర ప్రేమలేఖల కొరకు

అంశం :⁠- చిత్రం

తేది:⁠- 04/02/2026

శీర్షిక:⁠- నువ్వు నా జీవిత భాగస్వామి

నా ప్రియమైనవాడా…!

రెండు చేతులు ఒకదానిని మరొకటి గట్టిగా పట్టుకున్న ఈ దృశ్యం నాకు మనిద్దరి బంధాన్ని గుర్తు చేస్తోంది. మాటలు లేకపోయినా ప్రేమ ఎంత బలంగా ఉంటుందో ఈ ఒక్క ఫోటోనే చెప్పేస్తోంది. నీ చేతిలో నా చేయి ఉంటే చాలు , ఈ ప్రపంచమంతా నాకేమీ అవసరం లేదన్న ధైర్యం నాకు వస్తుంది.

నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కొత్త వెలుగులా మారింది. ఇంతకుముందు సాధారణంగా కనిపించిన రోజులు ఇప్పుడు ప్రత్యేకమైనవిగా అనిపిస్తున్నాయి. నీతో మాట్లాడిన ప్రతి క్షణం, నీతో గడిపిన ప్రతి నిమిషం నా గుండెల్లో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ప్రేమ అంటే ఏమిటో నువ్వు నేర్పావు. నమ్మకం అంటే ఏమిటో నీ ప్రవర్తనతో చూపించావు?

నిజ జీవితంలో కూడా మన మనసులు ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను? నీ స్పర్శలో నాకు అపారమైన భరోసా ఉంటుంది. నీ చేయి పట్టుకున్నప్పుడు ప్రపంచంలోని భయాలన్నీ మాయమైపోతాయి. నాకు తోడుగా నువ్వున్నావన్న ఆలోచనే నా బలంగా మారుతుంది.

నిజం చెప్పాలంటే… కొన్ని సార్లు మాటల్లో చెప్పలేని భావాలను ఈ చిన్న స్పర్శ చెప్పేస్తుంది. నీ ప్రేమను నేను కళ్లతో కాదు! గుండెతో అనుభవిస్తాను. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నాకు ప్రత్యేకంగా ఏ ఆనందం కావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వే నా ఆనందం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా ప్రపంచం.

మన బంధం ఇలా ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని దూరాలు వచ్చినా, మన చేతులు ఇలా కలిసే ఉండాలని ఆశిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే మనిషిగా, నన్ను నమ్మే హృదయంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం.

నీతో గడిపిన చిన్న క్షణాలే నాకు గొప్ప జ్ఞాపకాలు. నీ నవ్వు వినగానే నా అలసట తీరిపోతుంది. నీ మాటలు వినగానే నా మనసు ప్రశాంతమవుతుంది. నీ ప్రేమ నాకు ఒక భరోసా ఎప్పటికీ ఒంటరిగా ఉండనని చెప్పే అందమైన హామీ?

జీవితం ఎంత అందంగా ఉందో! ఎందుకంటే ఆ జీవితంలో నువ్వున్నావు. మనిద్దరి మధ్య మాటలు అవసరం లేకుండా, కేవలం చేతుల కలయికతోనే ఎన్నో భావాలు పంచుకోవచ్చు అని ఈ ఫోటో గుర్తు చేస్తోంది.

నువ్వు నా జీవిత భాగస్వామిగా, నా ప్రయాణ సహచరుడిగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నీతో కలిసి నవ్వాలి, నీతో కలిసి జీవితం ఎదుర్కోవాలి, నీతో కలిసి భవిష్యత్తు నిర్మించాలి. ఇదే నా కల. ఆ కల నెరవేరుతుందన్న నమ్మకం నాకు ఉంది.

ఈ ప్రపంచంలో నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి నువ్వే. నా చేయి ఎప్పటికీ వదలకూ. నేను కూడా నీ చేయిని ఎప్పటికీ విడిచిపెట్టను. మన ప్రేమ ఇలాగే శాశ్వతంగా, స్వచ్ఛంగా నిలిచిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…
ఎప్పటికీ నీదైన…

నీ ప్రేమతో…

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ లేఖ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *