సుప్రభాత దివ్య ఉషస్సు

అవనికి వెలుగుల దివ్వె, సుప్రభాత దివ్య ఉషస్సు. ఈ లోకానికి సన్నని మేల్కొలుపు రాగాలలో శ్రామికులు, కర్షకులు ,తపోధనులు,గృహిణులు సుందరమైన వెలుగులలో ప్రశాంత చిత్తంతో ,అవనిపై రోజువారి పనుల జీవనయానం మొదలవుతూ నవ్య తేజస్సు హృదయంలో నింపుకునే వేళ.సూరీడు లేత కిరణాల తాకిడికి పక్షులు, జీవజాలములు ఉత్తేజితమై తమ రెక్కలు విప్పుకునే వేళ. ఈ జగత్తు శోభిళ్ళు నవజీవన రాగాలలో. దేవాలయాలలో సుప్రభాత గీతాలు, ఘంటసాల భగవద్గీత స్పీకర్లలో ఖంగున మ్రోగుతూ ఊరంతా భక్తి ముక్తావళి.సమస్త లోకానికి శుభారంభం. శోభిళ్ళు సప్తస్వరాలు.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *