బెళ్లూరి శ్రీనివాసమూర్తి రాయలసీమ కవికోకిలగా ప్రసిద్ధి చెందిన కవి. బెళ్లూరి శ్రీనివాసమూర్తి తండ్రి బెళ్లూరి హనుమంతరావు కూడా సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు. శ్రీనివాసమూర్తి పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం ఇతని బాల్యమిత్రులు. ఈ ముగ్గురూ కొన్నాళ్ళు రాయలసీమలో ‘కవిత్రయంగా’ వాసికెక్కారు. ఇతని కవితలు భారతి సాహిత్య మాసపత్రికలో అచ్చయ్యాయి. 30 యేండ్లు అనంతపురం జిల్లా బోర్డు హైస్కూలులో ఆంధ్రపండితునిగా పనిచేసి అనేకమంది విద్యార్థులను సాహితీ ప్రియులుగా తీర్చినాడు. ప్రముఖ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ ఇతని శిష్యుడే. గీతావాణి పత్రికకు గౌరవ సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. ఇతని కావ్యగంగను మైసూరు యూనివర్సిటీ వారు డిగ్రీ పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు.
రచనలు
తపోవనము (ఖండకావ్యము)
కావ్యగంగ (ఖండకావ్యము)
అమృతాభిషేకము (ఖండకావ్యము)
విశ్వవైణికుడు (ఖండకావ్యము)
జాముకోడి (ఖండకావ్యము)
శిల్పవాణి (కావ్యము).
బిరుదులు
మధురకవి
రాయలసీమ కవికోకిల
అభినవకాళిదాసు
కవితా తపస్వి.
మాధవి కాళ్ల
సేకరణ