ప్రేమ లేఖ రాసా నీ కంది ఉంటది
నా గుండె విప్పి చూపా నీకు తెలిసి ఉంటది..
నా గుండెలో ప్రతి శ్వాస నిన్నే కలవరిస్తుందని
నీ పేరే తలుస్తుందని
ప్రతి అణువులో నీ రూపం నిండి ఉందని
ప్రతి ఉదయం లో నీ పేరే తలుస్తానని నా గుండె గూటి లో ప్రతి కణానికి తెలుసు
నీ ఊసులో నీ యాది లో బ్రతుకంతా ఈడుస్తానని గుండెల్లో ప్రతి జ్ఞాపకం దాస్తానని
ఏం చెప్తావో? ఎలా చెప్తావో?
నీ వాల్లందరికీ చెప్పి నన్ను నీతో తీసుకు పో!
నీ కోసం ఎదురు చూసే నీ హృదయం…
-ఉమాదేవి ఎర్రం