పద్మారావు

ఓ పనిమీద 2010 హైదరాబాద్ బంజారాహిల్స్ లోవున్నప్పుడు పద్మారావు ఫోన్ చేశారు………అదీ మాపరిచయం.
కృష్ణదేవరాయాల మీద నా వ్యాసాలు బాగున్నాయని చెప్పేవారు.
ఆ తర్వాత కృష్ణరాయలు మొదలుకొని చాళుక్యులు,కాకతీయులు,నాయకరాజులు,మహారాష్ట్రులు,కాపు కులస్తులన్న ధీమాతో ఆవిషయాన్ని ప్రస్తావిస్తూ.పుస్తకాలు రాశారు.
చదువులో డిగ్రీలులేవు. పరిశోధనలలో పరిశోధకుడిగా గుర్తింపబడ లేదు.
అయినా ఆయన మేధ అద్వితీయం ఎక్కడెక్కడి నుంచో చరిత్ర సంగ్రహణలు.
మా చరిత్ర కారులకె ఆయన పుస్తకాలు ఆశ్చర్యంగా ఉండేవి.
రాయడం నాపని! వాటికెంతవరకూ పేరొస్తుందో అది కాలం పని అనేవాడు.
నిగర్వి,కాపు కులాభిమాని.కాపుల చరిత్ర అథారిటీ!
అయినా ఆయనకు రావలసిన పేరు రాలేదు కారణం ఆయన గ్రంధాలు కుల ప్రస్తావన గ్రంధాలు!చరిత్రకారులు నాతో అనేవారు కులం జోలికి పోకుండా ఇతనెందుకు పుస్తకాలు రాయలేడు.!?
అయితే ఆయన నిర్ధారణలు ఆషామాషావి కాదు.అది అందరికీ తెలుసు.
అయినా ఆయన నిర్ధారణలకు వ్యాప్తి రాలేదు.
మా పద్మారావు నిరాడంబంరం గానే జనవరి 28 న వెళ్ళిపోయాడు.
అయితే ఆయన కృషికి,కీర్తికి డో ఖాలేదు.
ఆయన పుస్తకాలే ఆయనకు కీర్తి కిరీటాలు!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125868
సలహాదారు
అఖిల భారత చరిత్ర పురావస్తు రచయితల సంఘం
కొత్తదిల్లి_11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *