అభిసారిక

అక్షర కొరకు
అంశం – ప్రేమ లేఖ పోటీ
రచన – ఉమాదేవి ఎర్రం

ఓ ప్రియతమా!
నా ప్రేమ లేఖ నీకు అందిందా? అందే ఉంటుంది కానీ
నీ నుంచి నాకింకా లేఖ రాదే!
ఈ ప్రకృతి సోయగాలతో చెప్తూనే ఉంటా! నా ప్రేమ లేఖ
చూసి నీవు నాకు రాసి ఉంటావని అది చేరడానికి సమయం పడుతుందని..
ఆ చందమామ తో చెప్పా! నా ఊసుల్లోనే నువ్వు గడుపుతుంటావని..
ఈ లేడి పిల్లలతో చెప్తూనే ఉంటా! నా అందాలను నీవు తలుచుకోని క్షణముండదని..
పచ్చని గడ్డి తో పైకెగిరే పావురం తో అన్నీ నీ ఊసులే!
నీ ధ్యానమే!
ఒక్క రోజే పూసి వాడే పూలతో కూడా నీ కబుర్లే!
అవి ఒక్క రోజు బ్రతికినా రాణుల్లా దర్జాగా అందంగా
ఎలా ఉంటాయెా!
నేనూ నీతో ఎక్కువ కాలం గడపక పోయినా ఆ కొంత కాలమైనా అలా ఉండాలని వాటితో వాపోతుంటా!
మరి నా కోసం వస్తావు కదూ!
నీతో నన్ను తీసుకు పోతుంటే నా ప్రియ నేస్తాలన్నీ నా
కోసం బాధ పడుతూ నా సంతోషం కోసం అవి సంతోష పడుతూ చూస్తుంటే చూడాలని ఉంది..

నీ కోసం ఎదురు చూసే నీ అభిసారిక..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *