స్మార్ట్ ఫోన్,,,,,,,,!

అతి సామాన్యుల ఆకలి దప్పికలు మరిపించి
కళ్ళకు మనస్సుకు చిత్ర విచిత్రాల కొంగ్రొత్త ఆశలు రేకిత్తించే దర్శిని,,,,,,,
యావత్ ప్రపంచాన్ని మరిపించి సుదీర్ఘ తీరాల్లోకి తీసుకెళ్ళే వైకుంఠ దర్శిని స్మార్ట్ఫోన్,,,,,,,
విద్యార్థులకు పాఠాలు ప్రసారం చేస్తున్నాం చూడండి అని ప్రభుత్వమే ఆదేశిస్తోంది,,,,,,,,,
కళ్ళకు వేళ్ళకు కబుర్లు చెబుతూ కవులు కళాకారుల హస్తభూషిణి నేటి చరవాణి,,,,,,,,
ఉద్యోగులు ఉపాద్యాయులకు అధికారుల ఆదేశాలను అందిస్తూ తమ విధుల్లో స్మార్ట్ఫోన్ ఒక భాగమైంది,,,,,,,,
ప్రపంచాన్ని అరచేతిలో చూపించే విజ్ఞాన గని,,,,,,,,
మనిషికి మనస్సులో రంగు రంగుల ఇంద్రధనుస్సు స్మార్ట్ఫోన్,,,,,,,
నగ్న మయూరిల నీలిచిత్రాలతో యువత మనస్సు పొరల్లో అశ్లీల భావోద్వేగాల సందర్షిణి,,,,,,,,,,
ఆలోచనలు వక్రమార్గం తొక్కించేందుకు మూలాలకు నిలయం స్మార్ట్ఫోన్,,,,,,,,
పిన్నలు పెద్దలు తమ కర్తవ్యం మరిచి సోమరులను చేస్తూ విద్యుక్తధర్మాన్ని దూరం చేసేది కూడా స్మార్ట్ఫోన్,,,,,,,,,
సుదూర ప్రాంతాల్లో తమవాళ్ళు ఎలావున్నారో కనిపించి వినిపింపచేస్తూ యోగక్షేమాలను చేరవేసేది స్మార్ట్ఫోన్,,,,,,,,,
ప్రపంచ దర్శిని కావచ్చునేమో కాని యువతను పెడతోవ తొక్కించే విశృంఖల శృంగార దృశ్యాలు కనుల ముందుంచి కళ్ళులేని కబోదులను చేసేది కూడా స్మార్ట్ఫోన్,,,,,,,,,,,
ప్రభత్వమే ఇలాంటి చిత్రాలను సెన్సార్ చేస్తూ సందేశాత్మక విలువల విజ్ఞాన వేదికగా స్మార్ట్ఫోన్ ను చేయాలి,,,,,,,,
పనులు మానుకుని ఊరికే చరవాని గెలుకుతూ కాలం వెళ్లబుస్తూ సోమరులయ్యే బదులు భవిష్యత్తు పురోగతికి మూలం నీ విద్యుక్తధర్మాన్ని నీవు నిర్వర్తించడం అని గుర్తించాలి లేనిచో నిండు జీవితాలు కూలిపోతాయ్ తస్మాత్ జాగ్రత్త,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *