ఆండ్ర శేషగిరిరావు (ఫిబ్రవరి 8, 1903 – 2001) సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు.
వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతాలూకా కొడమంచిలి గ్రామంలో 1903 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.
వీరు కొంతకాలంఆనందవాణి వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్నారు. ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు 2001 ప్రాంతంలో పరమపదించారు. అతను కుమార్తె కోలవెన్ను మలయవాసిని తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు.
రచించిన నాటకాలు
భక్త నందనార్,
దుర్గావతి లేదా గడామండల వినాశము,
చిత్తూరు ముట్టడి
సాయిబాబా
త్యాగరాజు
భారతిపుత్రి
వధిన.
రచించిన కావ్యాలు
రామలింగేశ్వర శతకము
శంకరస్తవము (శివానందలహరి అనువాదము)
లలితా సుప్రభాతము
ఆత్మపుష్పాంజలి.
ఇతర గ్రంధాలు
సేవాసదనము
రెడ్డిరాజులు
తెలుగు బిడ్డలు
వాణిజ్య పూజ్యులు
వీర వనితలు
ఆంధ్ర విదుషీమణులు
వేమన పద్యాలకు వేదాంతార్ధాలు
పండుగలు – పరమార్థములు
కేయూరబాహుచరిత్ర – వచనానువాదము.
ఆంధ్ర కవుల అధ్భుత మహిమల కథలు.
మాధవి కాళ్ల
సేకరణ