ప్రేమ లేఖ పోటి కొరకు రాస్తున్న లేఖ:
హాయ్ అమ్మాయ్.,
సాధారణంగా నిన్ను పేరు పెట్టి పిలవాలి కాని.. నేను ఇలా అమ్మాయ్ అని పిలుస్తానని, నువ్వు అలవాటు పడాలి., “ఏంటి ఆర్డర్ వేస్తున్నావు?” అనాలని ఉంది కదా నీకు., మరి రాబోయే రోజుల్లో నీ ఆర్డర్ల ముందు ఇది చక్కెర సైజుకి సగమే కదా!! సర్లే విషయానికి వస్తే, నువ్వు నాకు నచ్చావ్., కాని వెంకటేష్ పైన ఆర్తి అగర్వాల్ సాంబార్ పోసినట్టు, నువ్వు ప్లాన్ చేయకు., ఇది ప్రేమో, సినిమాల ఆశీస్సులో తెలియదు కాని నా జీవితాంతం, నువ్వే నా హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను., ఎందుకంటే ఉత్తరం రాసే ధైర్యాన్ని ఇచ్చిన నీ మాటలు, అప్పుడప్పుడు నువ్వు హం చేసే పాటలు, చప్పుడు చేయకుండా వేసే నీ అడుగులు, కపటం తెలియని నీ చూపులు – నాకు ఈ ఫీలింగ్ ని కలిగించాయి!! ఇంతకంటే గొప్పగా చెప్పినా, “బాగా ఓవర్ కదా” అని అంటావు. నువ్వు పరిచయం అయిన తర్వాత, నేను ఇలా తయారయ్యా, కాస్త పెద్ద మనసుతో ఒప్పుకో. చిన్న విషయాల్లో తీసుకున్నంత టైం తీసుకో, ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ సేపు నన్ను వేచి ఉంచాలని ఉంటే చెప్పు మరికొన్ని లెటర్లు జిరాక్స్ తీసుకుంటాను.. ఎక్కువ సేపు మొబైల్ చూడడం వల్ల బ్యాటరీ అయిపోతే, అమ్మ రాసిన కిరాణా కొట్టు లిస్టు వెనక ఈ లెటర్ రాసే అవకాశం వస్తుందని ఊహించలేదు. కాని థ్రిల్లింగ్ విషయమే., లెటర్ చదివాక ఇష్టం అని చెప్పేసేయ్, కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయిస్తే వరలక్ష్మీ వ్రతం రోజు నీకు ఇష్టమైన డ్రెస్సు పైన ఉప్మా దాడి జరుగుతుంది., వెంటనే ఒప్పేసుకో, మా మామ గారితో సిట్టింగ్స్ పెట్టుకుంటాను. మీ అన్నకు ఈ లెటర్ సంగతి చెప్పి, మీ అన్నను హీరోని చేయకు, పాపం ఉద్యోగం లేదని సిగరెట్టుతో ఊపిరి పోసుకుంటున్నాడు.
నిన్ను, నేను బాగా చూసుకుంటా, లేదా నువ్వైనా, నన్ను బాగా చూసుకో!!
ఇట్లు
ప్రేమికుడు.,
నోట్: రోజా పూలు కంటే నీకోసం మల్లెపూలు తీసుకుని వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ☺️