సుశోభిత రమ్యమైన గీతాలలో నర్తిస్తూ ,సురభామిణులు రస సాగరసంగమంలో దివ్యశోభినులు అలరారు కోన,,,,,,,,,,,,,,,
తన సుకుమార దేహం ప్రదర్శించకుండానే నిండైన వస్త్రాల్లో సొగసరి ,నయాగరా వలె నేర్పైన సౌందర్య ప్రదర్శన,,,,,,,,,,,,
తీరైన మోహినీలలామ ఎర్ర గులాబీ పూసినట్లు గులాబీ కొప్పులో తురుముకున్న ముగ్దమనోహరీ ,గుంభనంగా గోపురం కదులుతున్న చందం ,,,,,,,,,,,,,,,,,,,
ఆకుపచ్చని సముద్రంలో వెలుగులు చిందించే సమ్మోహిణివి ,స్త్వైరవిహారంలో విరహిణివి ,మరులుగొల్పు మన్మథ రూపిణీ ,మోహినీలాస్య లలిత లలిత రాగాలలో ఊయల లూగేందుకు ,హృదయం నిండుగా ప్రేమోపాసన చేసుకునేందుకు తరలివెళ్ళే తపోనిష్టురాలా స్వాగతం పలుకుతున్నది ప్రకృతి దేవత,,,,,,,,,,,,,,,,,,,
యువకుల ఆరాధ్య దివ్యకన్యక ,అందాలొలికే సూర్యకాంత పుష్పంలా ,ఎర్రచందనం ఒళ్ళంతా పులుముకున్నట్లు నా కళ్ళు మరిచిపోని మనస్సులో తిష్టవేసిన మనసైన మన్మథరూపిణీ ,కలల పూజితా,కళారూపిణి అగ్నిపర్వతాల నుండి ప్రవహించే ఎర్రని లావా హిమపాతమవును నీ పాదములు సోకి, కవుల కలముల నుండి పూవులు రాలు నీ మోహములో,,,,,,,,,,,,,,,,,,
కళారూపిణీ గుండెల్లో గుబులురేపు గుభాళించిన గులాబీ నిన్ను మరువ మరువ,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట