ప్రేమలూరే హృదయం

ప్రేమ నిండిన హృదయం
భారీ కొండ పక్కన
పాతాళం నుండి ఉబికివచ్చి
ఎగిసేపడే తీయని నీరులాంటిది
పౌర్ణమి పండువెన్నెలలు గుప్పించినట్లు
తన తోటివారిలో
ఎనలేని ప్రేమ సౌందర్యం
సృజియించే అపురూప శిల్పి
దివ్య పరిమళాల పారిజాత పుష్పము హృదయం,,,,
కమ్మని సంగీతం వింటున్నట్లు
హృదయం పాలసముద్రమై
పల్లవించే ప్రేమ రసరాగాల గీతాలు
మార్ధవం మధురమైన గళం నుండి
అమృతం కురిపించినట్లు
ప్రేమలు పంచియిచ్చే హృదయం
జీవనం అతి సాధారణం
హృదయం వికసించిన కుసుమం
బయట లోపల ఒకేరీతిలో ప్రకాశించే
హృదయ సౌందర్యం
తొలిసంధ్య అందాల సూరీడు
కాంతులు చిందే మోములో
ఆహ్లాదకరమైన పరివర్తనం జీవనం
ఆలోచనల ప్రేమల సంకేతాలు
చూట్టూర ప్రసరిస్తూ
ప్రపంచాన్ని మేల్కొలుపుతూ
లోకం నిండా ద్విగుణీకృత
అందాల ప్రేమల పూవులు జల్లుతూ
సుందర మేఘశ్యాముని బృందావనంలో
తేలియాడజేసే జీవనజ్యోతి
ప్రేమపక్వమైన హృదయం సత్యాన్వేషి
ప్రగాఢ ఘాటుప్రేమ హృదయం
నిండు పాలకడవ సజీవ శిల్పం,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *