అక్షర కోసం
ప్రేమలేఖల పోటీ
రచన – ఉమాదేవి ఎర్రం
ప్రియా! ప్రియా!
నీ కోసం ప్రేమ లేఖలు రాసీ రాసీ విసుగొచ్చింది
ఎందుకనుకుంటున్నావా?
ఎందుకో ఊహించు…
ఇంకెందుకనుకుంటావు?
అయినా నువ్వెలా ఊహిస్తావు లే? రిప్లై ఇవ్వవు కదా!
నీకు రిప్లై ఇవ్వాలని ఉంటే కదా!
ఈసారి ఇది ప్రేమలేఖ కాదు కోపం లేఖ..
రిప్లై ఇస్తేనే ఈ సారి లేఖ రాస్తానంతే!
నీ అవునో కాదో తెలియని నీ రియా..