నీ చూపుకై తపించే నేను

అక్షర లిపి…

అంశం: ప్రేమ లేఖల పోటీ కొరకు…

శీర్షిక: నీ చూపుకై తపించే నేను…

ప్రియతి ప్రియమైన నీకు ప్రేమతో రాస్తున్న ప్రేమ లేఖ కానీ లేఖ…

ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడగను ఎందుకంటే నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు అని నాకు తెలుసు…

ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషమే కదా…

నీకు నేను గుర్తు ఉన్నానో లేదో తెలియదు కానీ నీ నవ్వు,నీ మాట అన్ని నాకు జ్ఞాపకమే…

నీ ఒక్క చూకై ఎదురు చూసి చూసి నిరీక్షణతో మిగిలిపోతున్నాను..

ఎప్పటికైనా నా గుండె సవ్వడి నిన్ను చేరకపోదా…

నా కన్నీటి పొర నీ కనుపాపలకు కనిపించకపోదా అని ఎదురు చూస్తూ ఉన్నాను…

దూరం నుంచి నిన్ను ఆరాధిస్తూ బ్రతికేయడమే తప్ప దగ్గరకు చేరే అంత సాహసం చేయలేను కదా…

నీ మాటల మాధుర్యం నిత్యం నా చెవులకి తాకాలని…

నీ కనుల కవ్విపులు నా హృదయాన్ని పులకరింప చేయాలని…

నీ ఊపిరి నా ఊపిరిలో కలిసిపోవాలి అని పిచ్చి ఆశతో రోజు కలలు కంటూ బ్రతికేస్తున్నాను…

మనసులోని భావాలను పెదవి విప్పి చెప్పలేక ఇలా లేఖ రాసి పంపిద్దామనుకున్నాను కానీ నీ జాడ కనుమరుగైపోయిందే…

ఈ లేఖ నిన్ను చేరదు అని తెలిసినా పిచ్చి మనసు మాట వింటే కదా….

నా చెంతన నీవు లేకున్న ఈ అక్షరాల ద్వారా నీవు నా
ఆలోచనలోనూ,చేతి రాతలోను,ఊహ లోకంలోను నిత్యం నా చెంతనే ఉంటావు సుమా…

ఇలలో ఎప్పటికీ నిన్ను లేరలేని నేను, నా లేఖ…

          ఇట్లు….
నిన్ను చేరుకోలేని నీ ప్రేయదాసి…

హామీ పత్రం: ఇది నా స్వయం రచన…

మీ క్రాంతి సుధా ✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *