ఈ మనస్సు సంక్లిష్టమైన నివురు గప్పిన సంవేదనల పుట్ట,,,
పరుగెత్తే గోదావరి నిట్టనిలువునా చీలికలవుతూ లోతైన లోయల్లోకి దూకుతూ సుడిగుండాలతో చివరి గమ్యం మహాసముద్రం,,,,,
మనస్సు కన్ను పడే హింసాత్మక ఆలోచనల సంవేదనలు అనుభవించిన వారికెరుక,,,,
చుట్టూర విషనాగుల ఆలోచనలు చుట్టుముట్టి చెదిరిపోయే నిశ్చలమైన నీటిలో వేసిన రాయిలా ఆలోచనలు యమపాశాలు,,,,,
కటిక దరిద్రుని మనస్సు రోదనలు మిన్నంటే అగ్నిశిఖలు రక్తకన్నీళ్ళు,,,,,,
ఈ భూమినంతా ఖండఖండాలు చేసుకుని ఏనాడో అందినంత కబ్జాచేసుకున్న బడాబాబులకు వెట్టిచాకిరి చేసే కూలీలు అంగడిబొమ్మలు అడ్డపై,,,,,
మనస్సు పూసిన అగ్నిపూవులు లిఖించి పోరుబాటకు జీవంపోస్తే చదువురాని నిరుపేదలు ఆకలి పొట్ట పట్టుకుని సుదూర ప్రాంతాలకు శ్రమల సేద్యంకై వలసలు పోతున్న బానిసలు,,,,,
అక్షరాలు నేర్చుకునే పిల్లలకు వెలకట్టలేని చదువుల జ్ఞానం అబ్బక మధ్యలోనే మానేసి తల్లిదండ్రుల వెంట దినసరి కూలీలు ఏడంతస్తుల మేడలు కట్టడానికి,,,,,,
నీవు తినేతిండి ,కట్టేబట్టలు నిరుపేదల శ్రమలలో రాలిన చమట చుక్కలు కన్నీళ్ళతో తడిసిన రెక్కల కష్టం,,,,,
సుఖానికి మరిగిన శరీరాల అజమాయిషీ అక్షరాలతో ఉద్యోగాలు ఉన్మత్త గీతాలలో జోగులాటల ఆనందాల సంబ్రమాలు ఆగిపోయే ఆఖరిఘట్టం,,,,,,,,,
ఉరికొచ్చి మీదపడే సునామీల్లా అనాకారి అలగాజనం తోసుకొచ్చే తిరుగుబాటులో ఆహాకారాలతో కొట్టుకుపోక తప్పదు,,,,,
అపరాజిత్
సూర్యాపేట