లక్ష్యసిద్ది

కౌరవ, పాండవులకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువు ద్రోణాచార్యుడు.విలువిద్య, అస్త్రశస్త్ర ,గదా విద్యలను వాళ్ళకు కూలంకషంగా బోధించాడు.
ఒకరోజు వాళ్లకు విలువిద్య పరీక్ష పెట్టాడు. మొదట అందరికన్నా పెద్దవాడైన దుర్యోధనుని పిలిచి ఎదురుగా ఉన్న మామిడి చెట్టుపై పిచ్చుకను చూపించి అతనిని బానం ఎక్కుపెట్టి ఆ చెట్టుపై ఏమి అగుపిస్తుందో చెప్పమన్నాడు. అతడు కొమ్మలు, ఆకులు, పూవులు మధ్యన పిచ్చుక అగుపిస్తున్నదని చెప్పాడు. గురువుగారు వెంటనే బానం దించమన్నాడు.భీముడుని పిలిచి బానం ఎక్కుపెట్టు సరిగ్గా చూడు భీమా ఆ చెట్టుపై నీ లక్ష్యం పిచ్చుక ఎలా అగుపిస్తుందో చెప్పమన్నాడు. గురువుగారు దోరగా పండిన మామిడిపండ్లు ,పెద్దపెద్ద కొమ్మలలో పక్షి అగుపిస్తోంది గురువుగారు అనంగానే వెంటనే విల్లును దించమన్నాడు. మిగతా అందరినీ అదేరీతిగా ప్రశ్నిస్తే సమాధానాలతో సంతృప్తి చెందక విసుక్కున్నాడు. చివరిగా అర్జునా విల్లుతో బానం ఎక్కుపెట్టి సరిగ్గ లక్ష్యం వైపు చూడు. గురువర్యా నాకు ఆ చెట్టుపై పిచ్చుకే అగుపిస్తోంది అన్నాడు. ఇంకా సరిగ్గా చూడు లక్ష్యం వైపు అన్నాడు గురువుగారు. ఇప్పుడు పిచ్చుక తల అగుపిస్తోంది గురువుగారు అన్నాడు. అర్జునా ఇంకా సరిగ్గా నిశితంగా చూడు అన్నాడు గురువుగారు. గురువుగారు నాకు పక్షి తలలోని కన్ను మాత్రమే అగుపిస్తోంది గురువుగారు వేయమంటారా బానం అన్నాడు. ద్రోణాచార్యుడు సంతృప్తిచెంది శభాష్ అర్జునా వెంటనే బానం దించు నీవు లక్ష్యం ఛేదించగలవు. ఇదే నాకు కావలసింది.
అందుకే అన్నారు లక్ష్యం The bird eye లాగా కుశాగ్రబుద్ది అలవరచుకోవాలని.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *