నిలకడ లేని ప్రేమ

అక్షర కొరకు

అంశం – బ్రేకప్ కథ

రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – నిలకడ లేని ప్రేమ

తీక్షణ వారం రోజుల నుండి అదో లోకం లో ఉంటుంది
ఏమైందని అమ్మ అడిగితే తీక్షణం గా చూస్తుంది కానీ
మాటా పలుకూ లేదు..

అన్నం నీళ్లూ సహించడం లేదు తనకిష్టమైన ఆలు ఫ్రై
చేసినా తినడం లేదు..
ఏమైందబ్బా దీనికని తల్లి స్మిత ఒకటే కంగారు పడుతుంది భర్తకు చెప్పాలా? అ

ని ఆలోచిస్తుంది కూడా!

ఇదంతా మనీష్ మహిమ అని ఇంట్లో ఎవరికీ తెలియదు..

తీక్షణ తొందర తొందరగా తయారై ముందుగానే కాలేజ్
కి వెళ్తుంది లేట్ గా వస్తుంది..
ఎందుకని అడిగితే స్పెషల్ క్లాస్ అంటుంది.
కానీ నిజమది కాదు కదా!
ఎందుకంటే మనీష్ని కలవడం కోసమే!
రోజూ కలుస్తూ చాలా ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు
ఇద్దరూ ఒకరి నొకరు ఆకర్షించారు చాలా!
మూడేళ్లుగా సాగుతుంది ప్రేమాయాణం
ఒక రోజు వాల్లు కలుసుకున్న సమయంలో..
తీక్షణా… రోజూ నీ కోసం ఎంత సేపు వెయిట్ చేస్తున్నానో తెలుసా?

నాకు చాలా కష్టంగా ఉంది తెలుసా? అన్నాడు మనీష్..

నీకందుకే అంత కష్టంగా ఉంటే ఇంట్లో తెలియకుండా
నేనెంత మెయిన్ టేన్ చేస్తున్నానో నీకు తెలుసా?
అంది తీక్షణ..
మనిద్దరి సమస్య తీరాలంటే మనం తొందరగా పెళ్లి
చేసుకోవాలంతే! అన్నాడు మనీష్
హా… చేసుకోవాలి కానీ చేసుకున్నాక ఎక్కడ ఉంటాం?
ఏం తింటాం? అంది తీక్షణ

అవునదీ పాయింటే! నువ్వు నీ పెళ్లి కోసం దాచిన డబ్బు తీసుకొచ్చేయ్ అన్నాడు మనీష్..

ఏంటీ? నా పెళ్లి కోసం దాచిందా? వాళ్ళు దాచారో లేదో!
నాకు తెలియదు అయినా నేనెలా తెస్తాను? నువ్వు కదా నన్ను పోషించాల్సింది..
అలాని రూలేం లేదు ఎవరు ఎవరినైనా పోషించ వచ్చు

ఆ…ఏంటి? తీక్షణం గా చూసింది తీక్షణ..

అంతే అన్నాడు మనీ లేని మనీష్..
అయితే నీకు నాకు బ్రేకప్ అంది తీక్షణ..

ఇంట్లో ఏ విషయం తెలియకుండానే బ్రేకప్ అయి పోయి ఎప్పటిలా అయ్యింది తీక్షణ..

అప్పటికి అక్కడితో కథ సుఖాంతమైంది లేకపోతే
మారుతీ రావులా తీక్షణ తండ్రి మారే పరిస్థితి వచ్చేదేమెా!

ఇది నా స్వీయ రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *