ఆత్మ జ్యోతిలా వెలగాలి

ఆత్మ జ్యోతిలా వెలగాలి

నీకేల ఈ నిరాశ!?!
ఆత్మ జ్యోతిలా వెలగనిమ్ము
నిరాశ నీడలా మిగలనీ!
బ్రతుకుపై ఆశ ఎల్లవేళల వెలగాలి
నిరాశకెప్పుడూ తావివ్వనీకు!

సాయం సంధ్య వేళల్లో
చల్లని పిల్లగాలిలో తేలియాడుతూ
మనస్సు కయిన గాయాలు
ఆర విరిసిన మందార మకరందాలలో
దూది పింజలై తేలిపోనీ!

పిడికెడు హృదయంలో
ఎన్నో ఆరాటాలు పోరాటాలు
ఆ అలజడులన్నీ పీల్చి పిప్పిచేస్తాయి
ఒకింత ఓరిమితో వాస్తవంలో జీవించు
బ్రమల నుండి మేల్కొని భవిష్యత్ ఏమిటి !?!
జీవన శైలిని ఉల్లాసంగా మార్చుకుంటేనే
జీవితం హృద్యం అవుతుంది,,,,,,!

అనంతానంత మహాసముద్రానికే
ఆటు పోట్లు తప్పలేదు మనమెంత!?!
ఆలోచనల నిరాశ నిస్ప్రుహలే జీవితం కాదు గదా
పోగొట్టుకున్న జీవితం తిరిగి రానిది
జీవితమనే పరుగు పందెంలో
మనస్సు వికసించిన పూదోట చేసుకుని
ముందుకు సాగితేనే జీవిత సాఫల్యత!

పౌర్ణమి రోజు తప్ప ఆ జాబిలి
ఎన్ని అవస్తల కళలు సంభవిస్తున్నాయ్
అలా అయితేనే జాబిలికి అందం నిభిడీకృతం!
కనుకనే మిత్రమా రంగు రంగుల సీతాకోకచిలుకల్లా
ఆకాశపుటంచుల దాకా వెలుగులు చిమ్ము
లే లేచి ఒకసారి నిలువుటద్దంలో చూసుకో
సిరి వెన్నెలలు దోబూచులాడుతున్నాయ్ నీలో!!
నీవు నీకోసం జీవించడమే నేడు పరమోన్నతం అని గ్రహించు!!

ఈ కవిత నా కలం సేత అని నా హామీ

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *