ఇదేనా ప్రేమంటే …????

ఎంటి నీకోసం ఎంత సేపు ఎదురు చూడాలి అసహనంగా అన్నడు సహన్ ,
అబ్బా ఏంటి నీ గోల ఇంట్లో వాళ్లని తప్పించుకుని రావాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా?
అంది సుహాని, ఏంటీ కష్టం , ఎదో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి రావాలి,అని అన్నాడు సహన్, హ చెప్పడం చాలా తేలిక ,నువ్వు నా స్థానంలో ఉండి చూడు నీకు అర్థం అవుతుంది.అసహనంగా అంది సుహాని….

హ చాల్లే ఇక పద ,ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, సినిమా కూడా స్టార్ట్ అయ్యి ,ఉంటుంది అంటూ బైక్ స్టార్ట్ చేసి,కూర్చున్నాడు సహన్, సుహాని ఎక్కి ,కూర్చింది. ఇద్దరూ సినిమా కి వెళ్లి, కూర్చున్నారు.
ఇద్దరూ సినిమా చూస్తున్నారు కానీ , ఇద్దరి మనసులో మాత్రం ఆలోచనలు తిరుగుతున్నాయి.

గత నాలుగేళ్ళ తమ ప్రేమలో రెండేళ్లు ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారు.కానీ సుహానీ ఇంట్లో కాస్త అనుమానాలు వచ్చి, ఆమెని కొంచెం కట్టడి చేసి, ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్ళమని, టైమ్ కి రమ్మని ఆంక్షలు పెట్టడంతో, అంతకు ముందులా ఫ్రీ గా రాలేకపోతుంది. కానీ సహన్ మాత్రం తాను చెప్పిన టైమ్ కి రాకపోవడంతో విసుగు వస్తుంది.

అంతకు ముందులా గంటలు గంటలు కబుర్లు చెప్తూ ,తనతో టైం గడిపేది, సినిమాలకు, షికార్ల కు తిరిగారు.షాపింగ్ లు చేయించాడు. వేలకు వేలు తాను ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో తనకి కూడా తల్లిదండ్రులు సరిగ్గా చదువుకోవడం లేదని , పాకెట్ మని ఇవ్వడం లేదు.

సుహాని ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్దాం అంటే తానే వద్దు అని ,ఆపేస్తున్నాడు. అందువల్లే సుహాని కి తనమీద ప్రేమ తగ్గింది ఏమో అని, అనుమానం పెంచుకుని,వేరే ఎవరినో చూసుకుని ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడు. సుహాని కి కూడా అదే అనుమానం పెరిగిపోతోంది, అరె తనని అర్థం చేసుకోకుండా, ఆ టైం కి రా,ఈ టైమ్ కి రా అని అంటూ ,ఆర్డర్ వేస్తున్నాడు. తాను తానింట్లో పరిస్థితి చెప్పినా , వినడం లేదు.తాను ఇంకో వేరే అమ్మాయి తో క్లోజ్ గా ఉంటున్నట్టు గా తన ఫ్రెండ్స్ చెప్పారు..

అదే విషయం తేల్చుకోవాలని ఈ రోజు ఇలా సినిమా కి వచ్చింది. సినిమా తర్వాత తన విషయం ఏమిటో తేల్చుకోవాలని అనుకుంది.సహన్ కూడా అదే విధంగా అనుకున్నాడు.సినిమా అయిపోయింది.ఇద్దరూ బయటకు వచ్చారు. ఎవరూ ముందు మాట్లాడాలో అర్థం కావడం లేదు. అక్కడ దగ్గర్లో ఉన్న కాఫి షాప్ లోకి దారి తీసాడు సహాన్, సుహాని అతన్ని మౌనంగా అనుసరించింది…

వెళ్లి కాఫి కి ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటి అని అడిగాడు సహన్, దానికి సుహాని చూడు సహన్ ఇప్పటి వరకు చాలా సంతోషంగా తిరిగాము. కానీ మా ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది. దాంతో నాకు బయటకు రావడానికి కష్టం గా ఉంది . అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు అని అంది సుహాని, హే అపు నువ్వు ,ని అబద్ధాలు, వాడు ఆ శేఖర్ గాడి తో నువ్వు మాట్లాడ్తున్నావ్,క్లోజ్ గా ఉంటున్నావ్ అని నాకు తెలుసు, నువ్వు నాకేమి కథలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అర్థం అయ్యింది సుహాని నీకు నా మీద మోజు తీరిపోయింది,నాతో షాపింగ్లు చేయించావు. నీ అవసరాలన్ని తీర్చుకున్నావ్,ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదని, వాడిని పట్టుకున్నావ్ , కదా, ఇక నీకు నాకు ఏ సంభందం లేదు,అని అన్నాడు..

హ అబ్బా నువో శ్రీరామ చంద్రుడివి మరి ,నువ్వు కూడా ఆ లత తో తిరుగుతుంది నిజం కాదా? నేను రానప్పుడు దానితో సినిమాలకి వెళ్లడం నిజం కాదా, నాకు నీ సంగతంతా తెలుసు,నన్ను వదిలించుకోవాలి అని ఇలా నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావ్, నేను ఎవరితో తిరగడం లేదు, వాడు శేఖర్ నోట్స్ గురించి అడిగితే ఎదో చెప్పా అంతే, అయినా మా ఇంట్లో ఆంక్షలు పెట్టారు. చీ నీకు చెప్పినా అర్థం కాదు అంది సుహాని, హ అవునే నేను తిరుగుతా లతనే కాదు నాకు చాలా మంది ఉన్నారు. పోవే పో,ఇప్పుడే నీకు బ్రేకప్ చెప్తున్నా, పో గుడ్ బై అన్నాడు సహన్.అతను అంత గట్టిగా అనేసరికి షాప్ లోని వారంతా తమ వైపు చూడడం వల్ల, సుహాని కి తల కొట్టేసినట్టు అయ్యింది. చీ నీలాంటి అనుమానం వాడితో ఉండడం వెస్ట్, నువ్వు కాదు,నేనే నీకు చెప్తున్నా గుడ్ బై అని అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుహాని…

ఇది ఈ నాటి లవ్ బ్రేకప్… చిన్న విషయాలకే అపార్ధాల వల్ల వారి నాలుగేళ్ళ ప్రేమని బ్రేకప్ చేసుకున్నారు. ఇదేనా ప్రేమంటే …????

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *