కోగంటి విజయలక్ష్మి(రచయిత్రి)

కోగంటి విజయలక్ష్మి ప్రముఖ నవలా రచయిత్రి. ఈమె 1946లో జూలై 29న జన్మించారు. ఈమె తండ్రి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోగంటి రాజబాపయ్య, తల్లి శకుంతలాదేవి. 40 ఏళ్లకు పైగా సాహితీవ్యాసంగాన్ని కొనసాగించిన ఈమె ఎన్నో నవలలు రాశారు. ఈమె ఆయుర్వేద వైద్యురాలు. ఈమె వివాహం చేసుకోలేదు. ఈమె వ్రాసిన కథలు వసుధ, పుస్తకం, కోకిల, వనిత, ఆంధ్రజ్యోతి, అంతరంగాలు తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె తన 70వ యేట కృష్ణాజిల్లా గుడివాడలో 2016, మార్చి 10వ తేదీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

రచనలు
జ్వలిత నా కవిత
మన్నించు ప్రియా (కథల సంపుటి)
చక్రతీర్థం
చక్రవ్యూహం
నిక్షిప్త.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *