నేదునూరి గంగాధరం(తెలుగు రచయిత)

నేదునూరి గంగాధరం (జూలై 4, 1904 – మార్చి 11, 1970) జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.
వీరు జూలై 4, 1904 సంవత్సరంలో రాజమండ్రి మండలం కొంతమూరు లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.1930లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా రాజమండ్రి కి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు – లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి.

రచనలు
మేలుకొలుపులు (1949)
మంగళహారతులు (1951)
సెలయేరు (1955)
వ్యవసాయ సామెతలు (1956)
పసిడి పలుకులు (1960).

బిరుదులు
కవి కోకిల
వాస్తువిశారద
వాఙ్మయోద్ధారక
జానపదబ్రహ్మ.

వీరు 1970, మార్చి 11వ తేదీన పరమపదించారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *