ఆతుకూరి మొల్లమాంబ

రామాయణ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ నెల్లూరుజిల్లా రాపూరు పూర్వపు తాలూకా,ప్రస్తుత కలువాయి మండలం గోపవరం గ్రామవాసి!
నెల్లూరుజిల్లా,కలువాయి మండలం గోపవరం శివారు గ్రామ శ్రీ కంఠ మల్లేశ్వర ఆలయంలో ప్రతిష్టింపబడిన మొల్లమాంబ విగ్రహం!!
ఈ అంశం చారిత్రికంగా రుజువయింది.కందుకూరి ఆరుద్ర,ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ,పింగళి,కాటూరి వంటి దిగ్ధంతులు గ్రంథ రూపేణా నిర్ధారించారు.
నేను 1973 నుంచి పరిశోధనలు చేసి ఆమె స్వస్థలం,జీవించిన కాలం,ఆమె తన రామాయణాన్ని ఉదయగిరిలో వినిపించిన ప్రతాపరుద్ర గజపతి వివరాలు
పత్రికా ముఖంగా.ప్రకటించడం జరిగింది.
ఈ నేపథ్యంలో రచయితలు,సాహితీ వేత్తలు వాస్తవ సాహిత్య చరిత్రను తెలుసుకోండి.ఆ. ప్రయత్నం చేయండి.
ఇతర జిల్లాలకు మొల్ల విషయమై ఎట్లాంటి ఆధారాలు లేవు.ఉంటే పత్రిక ముఖంగా.ప్రకటించండి.
ఊరకే ప్రకటనలు గుప్పించి అపహాస్యం పాలుకాకండి!
మొల్ల,శ్రీనాథుడు,తిక్కన నెల్లూరు జిల్లా ప్రాచీనాంధ్ర కవులు.
యూనివర్సిటీ ప్రముఖులకు ఈ చారిత్రక అంశాలు బాగాతెలుసు. వారు నాతో కూడా ఈ అంశాల్ని చర్చించి సంతృప్తి పడ్డారు.
ఆతుకూరి మొల్ల గాక ఇతర సుప్రసిద్ధు లేవరైనా జాతీయ కవులే . అయితే పరిశోధన విషయంలోకి వచ్చే సరికి వారి ప్రాంతీయత చెప్పాలి తప్పదు.మొల్ల తండ్రి ఆతుకూరి కేశనశెట్టిది కలువాయి మండలం గోపవరం ప్రక్క గ్రామము చింతల ఆతుకూరు గ్రామం.
గోపవరం శివారులలో మొల్ల క్రి శ 1501-10 ప్రాంతాలలో నిర్మించిన శ్రీరామ ఆలయం నేటికీ శిధిలావస్థలో ఉంది.దీనికి వెనుక వైపే ఆమె రామాయణం రాసిన శ్రీ కంట మల్లేశ్వర ఆలయం నిత్య పూజా నైవేద్యాలతో పూజ లందు కుంటోంది!!!
🩷
🩷. ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *