బ్రతుకుటెడారి,,,,,,,!
చల్లారుతున్న భగభగల ఇసుక తిన్నెల ఎడారి
గుప్పుమని చల్లారి పొగలు సెగలవుతూ
జాబిలి కాచే వెన్నెలలు వెలవెలబోతూ
కళ్ళల్లో ఇనుప మేకులు గుచ్చినట్లు చంద్రుడు పొగులుతున్న వేడి వేడి కన్నీళ్ళ కుతకుత ఉడికే రక్తం ఎడారి నిండా కుమ్మరిస్తున్న చందం,,,,,,,,,,,
ఎన్నటికీ ఆరని నిప్పుల గుండెలు ఆలోచనలు రగిలి రగిలి భస్మమవుతూ నిలువ నీడలేక కడదాకా వల్లకాటి దిబ్బలు ఎర్రని ఆరని మంటలు కళ్ళల్లో పూచిన అగ్నిపూలు,,,,,,,,,,,
నేనుతప్ప మానవ మాత్రుడు చరియించని భస్మ భూతలం నిండా సుడిగాలుల ఎండమావులు నిదురిస్తున్న రేయి ఎరుపెక్కిన వెన్నెల కిరణాలు పాడే అంతిమ క్షణాల గీతం నేనైతే ,,,,,ఒహ్,,,,,,ఇదే కదా నిజమైన జీవితం రక్తంలేని మరకల ఎర్రని లేత గులాబీ,,,,,,,,,,,,
నిజంగా ఆత్మహత్య ఇంత భయంకరమా ఏ ప్రేమకు జాలి కరుణకు నోచుకోని మండే ఇసుక కప్పుకున్న బండరాతిపై నిప్పుల వర్షం కురిస్తే అదేపనిగా కొట్టుకునే గుండె ఆగిపోదు కదా ఏం లాభం,,,,,,,,,,,
కళ్ళు కార్చిచ్చుళ్ళా రగిలి రగిలి ఫటేల్మని పగిలిపోవేమీ,,,,!? నా కళ్ళల్లోంచి నిప్పులు తోడుకుని త్రాగడం తప్ప ఏ తోడు నీడ ఎందుకు అంటోంది అనుభవం,,,,,,,,,,
ఏ దిశగా వెళ్ళినా కాళ్ళు ఎర్రగా బండలైన ఇసుక తుఫానుల దిబ్బలే మునిగిపోయే మంటల ఉబ్బలులే అయితే ఇంకేం చనిపోరాదా అంటావని తెలుసు తెలియాలి కదా,,,,,,ఆ అంకుశ పోట్లు తెలియాలి కదా లేఖిని,,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట