నలుపెక్కిన అక్షరాల రాత్రి

సూర్యుడు ఆస్తమిస్తూ
ఇక సెలవంటూ
నెమ్మది నెమ్మదిగా వెలుగుల
ఆకాశాన్నంతా చుట్టేసుకుపోతూ
అలలు అలలుగా చీకట్ల
దిగులు సముద్రం ముచ్చెత్తుతూ
రాత్రి అడుక్కుతినే వాళ్ళు
కప్పుకునేందుకు బట్టలు కరువై
రోడ్లపక్కన బస్టాండ్ లలో
ముడుచుకుని ఆదమరచి నిద్రపోతూ
కొందరు ఆకలి డొక్కపీకుతూ
నిద్ర ఎరుగక నింగిలోని నక్షత్రాలను అదేపనిగా లెక్కిస్తూ,,,,
కళ్ళు తేలగిల పడుతూ
చంద్రుడు కురిసే వెన్నెల తాగుతూ
తోచిన రోదనా గీతాలు పాడుతూ
ఇంకెన్ని రోజులు బ్రతుకుతానని
ప్రాణంలేని వేళ్ళు లెక్కపెడుతూ
సోలిపోయి ఆకలి ఆఖరి నిద్ర మింగేస్తూ కొందరు,,,
పొద్దస్తమానం గోడలు కట్టిన కూలీలు
చీఫ్ లిక్కర్ లో ఆడమగ అంబలి తాగి
తమకంటూ రూపాయి మిగుల్చుకోని అభాగ్యులు
తమ యెదమాటు చీకట్లో
ఎప్పుడో ఒకప్పుడు తమ పిల్లలను
లోకాన్ని విడిచి ఖల్ ఖల్ మంటూ
గుండెలు ఆగి మూర్ఛిళ్ళి ఆఖరి శ్వాస విడిచేవారే,,,
ఈ చీకట్ల రేరాణులు శరీరాలను ఫణంగా పెట్టి
ఆకలి దప్పికలకు అమ్ముడవుతూ
కాళీమాత ముందు కళ్ళు మూస్తూ
కుటిల సమాజం పెచ్చులూడి కూలిపడేలా
సూక్ష్మక్రిములై కరోనా కంటే భయంకర అవతారమెత్తి,,,,,
తుడిచిపెట్టుకుపోయే రుద్రకాళికలు
మబ్బులు కూలి వరదలై పారుతూ
హాహాకారాలు మిన్నుముట్టేలా
లోకం కేకలతో తుదితీర్పు పలికేది
తిరుగబడకున్నా ప్రకృతి తీర్పునిచ్చేది ఈ అలగాజనం కోసమే,,,,,

-అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *