కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం....!!

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం…..!!

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం…..!!

తెలిసీ తెలియక నాకై నేనే,నాపై నేనే దుష్ట కర్మలతో కూలిపోయాను,,,,,
ఎవ్వరూ తొక్కని మార్గంలో పయనించి విసిగిపోయాను,,,,,
ఒక్కళ్లంటే ఒక్కళ్ళు నేను వెళ్ళే మార్గం క్షేమకరం కాదని అనలేదు తల్లిదండ్రులతో సహా,,,,,,,,
ఎందుకంటె ఒకానొకప్పుడు విజయ శిఖరాలపై ఉర్రూతలూగుతున్నాను కనుక,,,,,,,,
వీటిదేముందిలే చిన్న చిన్న పొరపాట్లు అనుకున్నారు,,,,,,
ఆ చిన్నవే అగాధలోయల్లోకి తోసేసి దినదిన గండమై కుదేలయ్యాను,,,,,,
మొదటి నుండి చదవటం అలవాటు కనుక ఎవ్వరూ అనుమానించలేదు,,,,,,,
ఆ దోషాలే పూసిన యవ్వనంలో కాలం కోరలు తెరుచుకున్న విషనాగై కాటేసింది,,,,,,,,
నా అన్నవాళ్ళంతా నన్ను వెర్రినా పిచ్చికొడుకు అంటూ ఎగతాళి చేసినవాళ్ళే చుట్టూర,,,,,,,,
నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ అపకారం చేయని రాముడు మంచి బాలుడు లా పెరిగాను,,,,,,,
ఆ వేటకారాల్లో లేనిపోని నిందల్లో చదువుకున్న మూర్ఖున్నని తీసిపడేశారు,,,,,,,,
గాఢాంధకారంలో నా చదువులన్నీ నీటిమీది రాతలయ్యాయి అని బ్రమపడ్డాను,,,,,,,
ఆ భ్రమ విభ్రమల్లో నా కూలిపోయిన ఆశల శిఖరాల శిథిలాల్లో రోధించాను,,,,,,,,,
లోకం నన్ను కుళ్లబోడిచి నేను ఒకడు ఉన్నాడు అన్నది పట్టించుకోకుండా నా చుట్టూర జీవసమాధి పేర్చారు,,,,,,,,,,,
అయిపోయింది వీడి పని అని పళ్ళు పటపట కొరుకుతూ పొగరు అణిగింది వెర్రిపీనుగ అంటూ వికటాట్టహాసం చేశారు,,,,,,,,,
ఆ మహాతల్లి చదువుల సరస్వతి ఆశీస్సులతో బడిపంతులు ఉద్యోగిగా పిల్లలతో ఆడుతూ పాడుతూ నన్ను నేను మైమరచి ఆశల జీవితంలోకి అడుగుపెట్టాను,,,,,,,,,
ఎవరెన్ని కుయుక్తులు పన్నినా నా బిడ్డలు సరస్వతులు ఉన్నత విద్యలు అభ్యసించి గొప్ప కీర్తిమంతులైన ఉన్నత ఉద్యోగులు,,,,,,,
లోకం నాపై అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించినా వాటిల్లోని వాస్తవాలను గ్రహించి ఆత్మస్థైర్యంతో అధ్యయనం పోరాటంలా నిర్మలంగా నా చుట్టూరవున్న జగతిని జయించాను,,,,,,,!!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *