క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

నేటి పిల్లల మనసులు
స్క్రీన్‌ల వెలుగులో మునిగి…
ఆకాశం కన్నా చిన్నదైపోతున్న కలలు!
వేలు కదలికల్లో ప్రపంచం తిరుగుతోంది,
కానీ పక్కింటి బాధ వినిపించడం లేదు;
ఇది కాలపు వ్యథా కాదా?
పుస్తకపు వాసన మరిచిపోయిన గదుల్లో
జ్ఞానం డౌన్‌లోడ్ అవుతోంది,
అనుభవం మాత్రం దూరమవుతోంది…
ప్రశ్నలు గూగుల్ అడుగుతున్నాయి,
కానీ మనసు మాత్రం ఎవ్వరినీ అడగడం లేదు;
అది ప్రమాదం కాదా?
సామాజిక బాధ్యత అంటే సెల్ఫీ కాదు,
సాయం చేయడమే నిజమైన షేర్;
ఇది ఎవరు చెప్పాలి పిల్లలకు?
వృద్ధుడి చేతిని పట్టుకోవడం ఒక పాఠం,
రోడ్డు దాటించడం ఒక విలువ,
ఆకలికి అన్నం పెట్టడం ఒక మానవత్వం!
పిల్లలారా…
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే కాదు,
ఈ సమాజపు హృదయంలోనూ ఉంది!

డా. భరద్వాజ రావినూతల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *