మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!!
మనస్సులో నిగూఢంగా గూడుకట్టుకున్న భావనలు రకరకాల ఆలోచనలకు పురిగొల్పుతాయి.ఆ ఆలోచనలు మంచివి, చెడువి,దుర్మార్గమైనవి ఉంటాయి. ఆ ఆలోచనలే మనను చేతలుగా ఉసిగొల్పుతాయి.మనం వాటిని సామాజిక కట్టుబాట్లకు లోబడి సామాన్యంగా అమలుచేస్తాం.కొందరు విపరీత ధోరణులలో పెడత్రోవ బడుతూ సామాజిక విద్రోహులవుతారు.
అందుకే నీవెంత జ్ఞానివైనా సమాజోద్దరణకు దారులువేసే ఆలోచనలు చేయాలి, తప్ప నీ జ్ఞానాన్ని దుర్మార్గం పట్టనీయకుండా జాగ్రత్తపడాలి. ధైర్యం,బలం కలిగిన వ్యక్తివైతే పది మందికి సహాయపడుతూ, నీ జీవితం సాఫీగా సాగిపోయే ఆలోచనలు సమాజం అల్లకల్లోలం కాకుండా ఉంటుంది. నీవు బ్రతుకు బ్రతికించు.
అపరాజిత్