Year: 2025

అగ్నిపూవు

అగ్నిపూవు

అగ్నిపూవు! అపజయాల జీవితంకళ్ళు కాయలు కాసేలా చదివిఅనారోగ్యం పీడించి పీడించిమనస్సు దహించుకు పోగాఉదయ కిరణాలు కనురెప్పల్లో కరిగిపోగారోజులకు రోజులు వృధా ప్రయాసలైకళ్ళు తెరిస్తే కారుచీకట్ల కౌగిలింతలైవేళాకోళమాడే పెదరాయుల్లుకళ్ళల్లోంచి మరిగిన కన్నీటి దారలు!పోకిరీ వెధవలు పొంచి పొంచికాటు వేసే కాలనాగులుచదివిన చదువు బూడిదలో పోసిన పన్నీరైదరిదాపుల్లో ఎవరూ లేని ఏకాకినైహిమవన్నగం కరిగి కరిగి నీరైసముద్రంలో కలిసి కనుమరుగైనట్లు!దూరాలు సుదూరాలు నడచి నడచికాళ్ళ నొప్పులే గాని ఫలితం శూన్యం!ఆకలి దప్పికలు మరచి నరకం కళ్ళ చూసిరగిలి పగిలిన మనసు మూగ బాధఎండి బీటలు వారిన చెరువులాకన్నీళ్ళు ఇంకి కలలు కూడ రాని కళ్ళుపగిలి బీటలు బడ్డ అద్దంలో అగుపడే వికృత ప్రతిబింబాలుమనసు కయిన గాయంతో పాకుడు రాయిలా పాక్కుంటూ,,,,,,,!అంధకార బంధుర చీకట్లు ముసిరిపెనంపై మాడుతున్న రొట్టెలామండువేసవిలొ ముళ్ల కిరీటం తలపై పెట్టుకున్నట్లుగుంపులో గోవిందయ్యనైచావు తప్పి కన్ను లొట్టబోయినట్లుఒక చిన్న సర్కారీ కొలువులోగానుగెద్దులా పనిచేస్తూ పదవీవిరమణదగ్గర దగ్గర దైవం చేత పూయించిన అగ్నిపూవును! అపరాజిత్సూర్యాపేట
Read More
కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం

కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం

కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం,,,,,,!! జీవితంలో మన్వంతరాల దాకాఅగ్నిసముద్రం కెరటాలలో ఈదుతూనా అక్షరాల పూవులన్నీ నా చుట్టూర సీతాకోకచిలుకల్లా ఎగురుతూ,,,,,,,,,కారుచీకట్ల జీవితంలో మెరుపు తీగల్లా జయజయ ద్వానాలు వింటూ,,,,,,,,,నా ఎదురీత జీవితంలో పూసిన అగ్నిపూవులే నన్ను అందళాలెక్కిస్తున్న బ్రమల్లో ఊగిపోతూ,,,,,,చేసే బడిపంతులు ఉద్యోగం ఈ వయస్సులో భయానకమవుతూ,,,,,,,తీయని కలలన్నీ అగ్ని కీలలవుతూ హృదయ సౌందర్యం అవిసిపోయిన శిలాజమవుతూ,,,,,,,చదివిన చదువులు ప్రయోజనం కోల్పోయిన ఎడారి నాగజెముడు పూవులై వెక్కిరిస్తూ,,,,,,ఉద్యోగం ఉరిశిక్షకు ముందు గుండెల్ని తోడేసే ఉధృతిలా మరణమృదంగం పాడే దినదిన గండమై,,,,అలలు అలలుగా పొంగుతూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థుల ముఖాల్లో నవ్వులు పూయిస్తూ సాగే జీవిత పోరాటం విధి లిఖితం,,,,,,,,,,అక్షరాలు రాయడానికి అలవాటు పడ్డ చేయి ఉరుకోక నా కన్నీళ్ళ జీవితం కవితలై కలలై కళలై కవితా సుధలై నీతో పాలుపంచుకుంటూ,,,,ఈ చివరి దినం ఈ సంవత్సరం ఇంతకన్నా ఏం రంగుల హరివిల్లులు కోరుకుంటుంది నూతన సంవత్సరం,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
డిసెంబర్ 31 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 31 ప్రత్యేకతలు :⁠-

✒ 1600: ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ✒1738: బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ కారన్ వాలీసు జననం (మ.1805). ✒1926: భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త ఎస్.జడ్. ఖాసిమ్ జననం (మ.2015). ✒1928: కళావాచస్పతి, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు కొంగర జగ్గయ్య జననం.(మ.2004). ✒1953: విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది ఆర్.నారాయణమూర్తి జననం. ✒1964: వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు విన్‌స్టన్ బెంజిమన్ జననం. ✒1965: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ జననం. ✒1984: ప్రముఖ భారతీయ సినిమా నటి, జంతుబలుల ఉద్యమకారిణి కవితా రాధేష్యం జననం. మాధవి కాళ్లసేకరణ
Read More
పుస్తక అధ్యయనం మౌన విప్లవం

పుస్తక అధ్యయనం మౌన విప్లవం

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :పుస్తక అధ్యయనం మౌన విప్లవం,,,,,,!!రచయిత అపరాజిత్ రెడ్డి చదువు మేధాసంపత్తికి నిలయంమనస్సు లోని చిందరవందర ఆలోచనలను ఏకీకృతం చేసి ఆలోచనా దృక్పథాన్ని జీవన శైలిని మహోన్నత దిశలోకి మార్చేది పుస్తక అధ్యయనం,,,,,,,,,అధ్యయనం చేసే మనస్సు పూర్వ జ్ఞానాన్ని సమృద్ధి చేయడమో లేదా లోపాలను సరిదిద్దుకోవడమో చేస్తూ గుండెల్లో జ్ఞాన బాండాగారం నెలకొని నూతన ఒరవడిని వ్యక్తిత్వములో రూపుదిద్దుకుంటుంది ,,,,,,,,,,,,,,పుస్తక అధ్యయనం జీవిత సాఫల్యంతో అంధకార ఆత్మలో వెలిగే జ్యోతి ప్రకాశం జ్వాలలు జీవిత గతులనే మార్చేస్తాయి,,,,,,,జీవితంలో తోటివారితో వ్యవహరించే దృష్టిలో వాక్కులో గ్రాహ్యంలో ముఖకవళికల్లో పెనుమార్పులు సంభవిస్తాయి వినూత్న రీతిలో జీవితం సాగిపోతుంది,,,,,,,,,చదువు సంస్కారం ఇవ్వడమే కాకుండా తన ముందున్న విద్యుక్తధర్మాన్ని నెరవేర్చేందుకు కావలసిన మెళకువలను నేర్పిస్తుంది,,,,,,,,,,అధ్యయనం నీ లక్ష్యం వైపు దూసుకెళ్లేందుకు కావలసిన విషయ పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అందిస్తూ ఇతరులకు మహోన్నత శిఖరాలు అనబడేవి నీకు సర్వసాధారణంగా అగుపిస్తాయి నీ పరిధిలోని…
Read More
మానవత్వం

మానవత్వం

నీ బ్రతుకు బొడ్డేరై నీవు నిలువునా కొట్టుకుపోతుంటే, నీలో మానవాతీత శక్తి ( cosmic power ) గూడుకట్టుకుని ఉంటే నీవు తప్పక ఆ విపత్తునుండి బయటపడతావు.దైవానుగ్రహం పక్కనబెడితే అస్తికులైనా, నాస్తికులైనా నీపిల్లలు, నీస్తితిగతులే కాకుండా పరుల హితం కోరి చేసే మేలు నీలో దివ్యశక్తి మేల్కొని సహాయపడుతుంది. ఊరికే జపమాల తిప్పుతూ ఇష్టదైవాన్ని జపం చేస్తే కుదరదు.నీలో మానవత్వం ఉండాలి, నీవు నీతోపాటు పదిమందికి సహాయపడాలి.అపరాజిత్సూర్యాపేట
Read More
మరో చరిత్ర మనచేతుల్లో చేతల్లో

మరో చరిత్ర మనచేతుల్లో చేతల్లో

అక్షర లిపి కొరకు రచనరచన: రాజ్యలక్ష్మి శశిధర్.kఊరు: విజయవాడఅంశం:అంశం: నేటి పిల్లలు – సామాజిక బాధ్యతశీర్షిక: మరో చరిత్ర మనచేతుల్లో చేతల్లో††††నేటి పిల్లల చేతుల్లో రేపటి దారి,వారి ఆలోచనలలోనే దేశం భవిష్యత్తు !పుస్తకంతో పాటు విలువలు నేర్చుకుంటే,సమాజం మార్పు దిశగా అడుగులు వేస్తే. తల్లిదండ్రుల మాటల్లో గౌరవం దాగి,గురువుల బోధలో జీవన జ్ఞానం సాగి.స్వార్థం కాదు సేవే లక్ష్యమై ఉండాలి,అదే నిజమైన విజ్ఞానం అని తెలుసుకోవాలి. పరిశుభ్రతలో బాధ్యత చూపే మనసు,చిన్నచిన్న పనుల్లో పెద్దదైన శక్తి దాచు.చెట్లను కాపాడి భూమిని ప్రేమిస్తే,రేపటి శ్వాసకే వారు కాపలాదారులే. సామాజిక మాధ్యమంలో సత్యం నిలబెట్టి,ద్వేషం కాదు దయనే మాటగా పలికించి.బలహీనుల పక్షాన నిలబడే ధైర్యం పెంచి,అన్యాయాన్ని ప్రశ్నించే స్వరం వినిపించి. పేదరికం, ఆకలి చూడగానే కదిలే హృదయం,పంచుకోవడంలోనే ఉందని తెలుసుకునే నిజం.సమయం, శ్రమ రెండూ దేశానికి అర్పిస్తే,పిల్లలే రేపటి నాయకులై వెలుగుతారు నిస్సందేహమే.
Read More
కాలానికి ఎదురీదితేనే జీవం ఉనికి

కాలానికి ఎదురీదితేనే జీవం ఉనికి

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :కాలానికి ఎదురీదితేనే జీవం ఉనికి,,,,!!రచయిత అపరాజిత్ రెడ్డి చుట్టూ అలల సముద్రం జీవానికి పనికిరాని ఉప్పనీరుఎవరో మహానుభావుడు తీరాన్నే ఎత్తైన బండపై నాటిన పెనుసవాళ్ల పెనుగాయాల తాకిడి తట్టుకుని నిలిచి బండబారిన చిన్న వృక్షం,,,,,,,చూపరుల కళ్ళు అచ్చెరువొందేలా అల్పపీడనాలు తుఫానులలో ఎగిసిపడుతూ అతి వేగంగా వీచే గాలులతో ముంచెత్తే కెరటాల హోరు సముద్రంలో సుడిగుండాలు సునామీలను తట్టుకుని తనదైన శైలిలో జీవిస్తూ జనం హృదయాలలో జీవితంపై తీపి ఉపిరులూదుతున్న చెట్టు ఓ సందేశం ఇస్తోంది,,,,,,నిజంగా నీవు అపజయాల పాలై అవమానాలు ఆక్రందనలే జీవితమైతే కృంగి కృశించి జీవితాన్ని నరకతుల్యం చేసుకుని అభాసుపాలై బ్రతుకు చాలించడమే జీవితమా,,,,,ఎన్ని సవాళ్ళు ఆటుపోట్ల మధ్య బ్రతుకులు బండలవుతున్నా ఉన్నచోటి నుండి ఉద్యమంలా చెలరేగిపోయి పిడికిలి బిగించి పోరాడి విజయ శిఖరాలపైకి ఎదిగి నీవేంటో నిరూపించుకో,,,,చావు పరిష్కారం కాదు సుమీ,,,,,,అవును అందరూ పెద్ద పెద్ద కీర్తి మంతులు కాలేరు…
Read More
ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున…
Read More
ఆదిమానవుడు

ఆదిమానవుడు

ఆదిమానవుడు ఎప్పుడైతే అగ్నిని కనిపెట్టి తను తినే పదార్థాలను వేడివేడిగా తింటున్నప్పుడు ఆ ఉష్ణం తగులుతున్నప్పుడు, అది ఒక లేహ్యంలా పనిచేసింది. గొంతులోని స్వరతంత్రులు వికసించాయి. వాటితో పాటు వినికిడి నాడులు పనిచేసి తన చుట్టూర వస్తున్న శబ్దాలను వినగలిగాడు.ఆ వినికిడితో పాటు కాలక్రమంలో మాట అనేది ఉద్బవించింది.నెమ్మది నెమ్మదిగా తన అవసరాల కనుగుణంగా మాట్లాడటం మొదలయ్యింది. ఆది మానవుని మొదటి దైవాలు సూర్యచంద్రులు. ఆలోచనలు ఉద్బవిస్తూ తినే తిండి మార్పిడి, చరించే ప్రదేశాలను బట్టి ,వాళ్ళ మధ్య ఘర్షణలు,వాతావరణంలో భీకర స్థితిగతులను బట్టి రకరకాల దేవుళ్ళు ,దయ్యాలు, సైతాన్ లు ఉద్బవించారు. తాను దైవాన్ని నమ్మడం దగ్గర నుంచే కట్టుబాట్లు ,నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. మానవ అస్తిత్వం పురోగతి సాధ్యపడింది. అపరాజిత్సూర్యాపేట
Read More
రిజాల్ డే (ఫిలిప్పీన్స్)

రిజాల్ డే (ఫిలిప్పీన్స్)

రిజాల్ డే ( స్పానిష్ : డియా డి రిజాల్ , ఫిలిపినో : అరావ్ ని రిజాల్ ; తగలోగ్: [riˈsal] ) అనేది ఫిలిప్పీన్స్ జాతీయ హీరో అయిన జోస్ రిజాల్ జీవితం మరియు పనిని స్మరించుకునే ఫిలిప్పీన్ జాతీయ సెలవుదినం . మనీలాలోని బాగుంబయాన్ (ప్రస్తుత రిజాల్ పార్క్ ) లో 1896లో రిజాల్‌ను ఉరితీసిన వార్షికోత్సవాన్ని ప్రతి డిసెంబర్ 30న జరుపుకుంటారు. రిజాల్ దినోత్సవాన్ని మొదట డిసెంబర్ 20, 1898 నాటి డిక్రీతో ప్రారంభించారు, బులాకాన్‌లోని మలోలోస్‌లో అధ్యక్షుడు ఎమిలియో అగ్యునాల్డో సంతకం చేశారు , డిసెంబర్ 30, 1898ని రిజాల్ మరియు ఫిలిప్పీన్స్‌లోని స్పానిష్ వలస పాలన బాధితులందరికీ జాతీయ సంతాప దినంగా జరుపుకుంటారు. డేట్ , కామరైన్స్ నోర్టే ఈ డిక్రీని అనుసరించిన మొదటి పట్టణం, సాన్జ్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ ఆంటోనియో సాన్జ్ రూపొందించిన స్మారక చిహ్నాన్ని నిర్మించారు, దీనికి సాన్జ్…
Read More