అక్టోబర్ 31 ప్రత్యేకతలు :-
✒ 2014 : జాతీయ ఐక్యతా దినోత్సవం. ✒1875 : భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జననం (మ.1950). ✒1895 : భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సి.కె.నాయుడు జననం (మ.1967). ✒1925 : తెలుగు సినిమా దర్శకుడు కొల్లి ప్రత్యగాత్మ జననం (మ.2001). ✒1937 : ప్రముఖ రచయిత నరిశెట్టి ఇన్నయ్య జననం. ✒1975 : భారతీయ సంగీత కారుడు, ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ మరణం (జ.1906). ✒1984 : భారత ప్రధాని ఇందిరా గాంధీ మరణం (జ.1917). ✒1990 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి మరణం (జ.1928). ✒2004 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు మరణం (జ.1935). ✒2008 : అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో…