Month: December 2025

ఆ!!వె!!💐💐💐

ఆ!!వె!!💐💐💐

వార్డు వార్డు దిరిగి వరుసలు గలుపుచుఓట్లు గోరి నేత నోట్లు బంచు!నోట్ల కాశపడిన నోటమట్టిని గొట్టుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! పంటపొలములమ్మి పదవుల వేటనప్రాణమిడువ బోకు పదవి రాక!పదవి కన్న భువిని భార్యబిడ్డలు మేలుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! ఊరివారి కొరకు పోరుజేయుట కన్నదారసుతుల కొరకు దారిజూపు!గుణము యొక్కటున్న గొప్పగా బ్రతికేవుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
అక్షరం ఆయుధం కన్నా వాడియైన జ్ఞాన పుత్రిక

అక్షరం ఆయుధం కన్నా వాడియైన జ్ఞాన పుత్రిక

అక్షరం ఆయుధం కన్నా వాడియైన జ్ఞాన పుత్రిక,,,,,, సుఖభోగాలలో క్రీడించే విలాసవంతుల రాక్షసానందం కన్నా,,,,,,,,,జనజీవితాల హృదయాలను అలరించే కళాకారులు దివ్యస్వరూపులు,,,,,,,,,అక్షరాలు తెలియని ఓ బోయవాడు ఎన్నెన్నో కఠిన శ్రమలకోర్చిన దీక్షలో సరస్వతీ తనయుడైన తీరు అద్బుతం అపూర్వం,,,,,,,,,ఆయనే యుగయుగాలుగా కొనియాడబడుతున్న రామాయణం లిఖించిన వాల్మికి అక్షరాల మహాతపోధనుడు,,,,,,,,,,,ఏ విద్యయైనా నేర్చుకోవాలనే తపన,మంట గుండెల్లో రగులుతుంటే ఏదీ అడ్డంకి కాదు,,,,,,,,,అక్షరం ఆయుధం కన్నా వాడియైనది మనస్సు లోని మకిలిని కడిగివేసే జ్ఞాన పుత్రిక మనిషిని సంస్కరిస్తూ మూర్తీమత్వం తీర్చిదిద్దే విజ్ఞాన స్వరూపిణి,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
కవితా సుమాహారం

కవితా సుమాహారం

అక్షరలిపి అంశంజాణ,బాణం, గజాణ, నినణా అనే పదాలపైకవిత శీర్షికకవితా సుమాహారం నెరజాణ విసిరిందిఒక చిరునవ్వు.ఆ చిరునవ్వు తగిలేనుఒక సుమ బాణం లాగా.ఇగ జాణ బాణం తగిలితీయని గాయం అయింది.నినణా నాదాలు నాహృదిని ముద్దాడాయి. వెంకట భాను ప్రసాద్ చలసాని
Read More
ఆ!!వె!!👍👍👍

ఆ!!వె!!👍👍👍

అన్నదాతలార ఆదమరవ కండిఓటు వేయరండి పాటునెరిగి!చాటుమాటుగాను నోటును గోరకనేతనెన్నుకొనుము నేర్పుతోడ!! పార్టివారలనక పగవారలనకనుకులము వారలనక బలముననకసేవజేయు వార్కి చేయూత నీయంగతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
పదాల పదనిస

పదాల పదనిస

అక్షర కొరకుఅంశం - జాణ, బాణ, గజాణ, నినణా అనే పదాలపైరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - పదాల పదనిస ఆకర్షించింది నన్ను జాణవెంటనే వెళ్లి ప్రపోజ్ చేసానిరాకరించింది ఉన్నానని బాణ లాతగ్గాలని ప్రయత్నించా గజాణఅయినా ఆమెాదించ లేదు నన్ను ఏ క్షణాననేనేమై పోవాలో నిణనా!! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా
Read More
హరిచందన రూపశి సౌందర్యరాశి

హరిచందన రూపశి సౌందర్యరాశి

అక్షర సమూహంఅంశం : జాణ, బాణ, గజాన,నినణా పదాలతో కవితశీర్షిక: హరిచందన రూపశి సౌందర్యరాశి,,,,,,పేరు : అపరాజిత్ రెడ్డి ఓహో హరిచందన వన్నె జాబిలి కన్నుకుట్టే నెరజాణ,,,,,,,నీ అందాల సిరులలో నా కనులు మరులుగొన్నవే మరుమల్లియల తారక,,,,,,,,,,,నా హృదయం తోడేసే మన్మథ బాణాలు వేసి నీమానాన నీవు తప్పుకోకే గజానన సౌందర్య రూపసి జాబిలి వెర్రి నగవులు పోతున్నాడదిగో,,,,,,,,,నీ దివ్యరూపం నా మనస్సు గూడు రగులుతున్న మొగలిపూవులా తలవూపుతోందే చిన్నదాన,,,,,,,,,నీవు హృదయంలో నర్తించే నాగువై నిన్ను వీడనంటోంది నా తనువులోని అణువణువు,,,,,,,,,నీమానాన నీవు తప్పుకుంటే నీ కనుల బాసల మూగస్వప్నాలు నా నరనరాలు వెర్రినిచేసి లాగుతున్నవే నినణా కన్నెచూడామణి,,,,,,,,,నాలోని లక్షల జ్ఞానతంత్రులు ఇంద్రియ భోగముకై అర్రులు చాస్తున్నవే నినణా ముగ్దమోహిణి,,,,,,,,,,,రాగాల సరాగాల మనోహరీ నీవు నన్ను వీడి వెళ్ళమాకే నా చంద్రిక వదనీ, సింగారీ సిరిసిరిమువ్వల నర్తినీ మయూరి,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
చతుర్విధ శక్తులు

చతుర్విధ శక్తులు

అక్షర కొరకుఅంశం :⁠- జాణ,బాణ,గజాన,నినణా ఈ పదాలను ఉపయోగించి కవిత రాయండి..తేది:⁠- 30/11/2025శీర్షిక:⁠- చతుర్విధ శక్తులు నా మదిలో మెదిలే జాణతెలివైన చూపుతో నడిపించేటి దిశానఆమె మాటలే నా జీవితానికి వేదానప్రతి సమస్యకూ చూపించేటి విధానజాణ అందించగా ధైర్యమనేటి ఆ బాణ లక్ష్యాల వేటలో నా వజ్రాయుధానవెనుతిరగని పట్టుదలకు ఆ బాణమే కతవిజయాన్ని చేధించే ప్రతి అడుగులో బ్రతుకుఆటంకాలు ఎదురైనా రక్షించే గజానవిఘ్నాలను తొలగించే తొలి పూజల దీక్షాన గజాన అనుగ్రహం నాపైన వర్షించగాశుభాల పరంపర నా దరికి చేరగాత్రికాలమూ మారుమోగేటి ఆ నినణానా విజయం ప్రతిధ్వనే లోకానికి చాటెనాఆ నినణాలోనే వినబడే మనసు లయ ధర్మాన్ని నిలిపేటి పవిత్ర జయజాణ నేర్పుతుంది ఈ లోకపు పోకడబాణం పంపుతుంది గమ్యం చేరే చూపుడుగజాన అందిస్తాడు ఆశీస్సుల సారంనినణా ప్రకటిస్తుంది ఈ యాత్ర ముగింపురం తెలివి పట్టుదల రక్షణల విజయంఈ నాలుగు శక్తులే నా జీవిత నిత్యంవీటితో ముడిపడి ఉంది నా ప్రతి…
Read More
చమత్కారం అంటే ఏమిటి?

చమత్కారం అంటే ఏమిటి?

చమత్కారం అంటే ఏమిటి? ఓ విషయం చెబితే" ఇదేమిటి, అదెలా, అలా ఎలా "అని ఉత్సుకత కలిగించాలి. దీనిలో ఏదైనా మతలబు ఉందా అనిపించాలి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగించాలి. విషయం అలా చెప్పడం చమత్కారం అంటారు. ఓ గ్రామం లో సర్వమంగళశాస్త్రి గారని ఓ వేదపండితుడు ఉండేవారు. వారి మనుమడికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో " మా మనుమడి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను.భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " అని వ్రాసారు; అందరికీ ఆశ్చర్యం వేసింది --మనుమడికి వడుగువరకు సరే,ఈయనకు మళ్ళీవడుగు ఏమిటీ అని. సరే ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు, అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు. శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన…
Read More
శిక్ష అనుభవించాల్సిందే

శిక్ష అనుభవించాల్సిందే

శిక్ష అనుభవించాల్సిందే! కర్మఫలం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు… కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెత్రాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. "కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు… వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా/ వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే… అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది…" అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. "వారు చేసిన పాపం ఏమిటి" రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు."నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు." ఏం తప్పు చేశారు? "పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్ర అపకర్షము…
Read More
పదాలకవిత

పదాలకవిత

అక్షరకొరకు🌷అంశం- పదాలకవితతేదీ- 30/11/25శీర్షిక-డా.భరద్వాజ రావినూతల🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸బాణ దూసుకెళ్లే ఉద్రేకం,జాణ వెలిగించే జ్ఞానశిఖరం,గజాన మ్రోగించే గంభీర ధైర్యం,నినణా తాకే నిశ్శబ్ద పరిమళం,మనసు వీటి మధ్య ఊగిసలాడే లోకం. బాణలా సూటిగా సాగిన మాట,జాణలా వెలిగిన చైతన్య జ్యోతి,గజానలా పలికిన శౌర్య స్పందన,నినణా వంటి సుగంధ గాలి,హృదయంలోకి చేరి హోరెత్తిస్తుంది. బాణ ఉన్నత పోరాట జ్వాల,జాణ చూపులో పుట్టిన నిజస్ఫూర్తి,గజాన నాదంలో దాగిన ధ్వని శక్తి,నినణా మౌనంలో మెదిలే శాంతి,జీవితం ఇవన్నీ కలిసిన రంగు. బాణ దారి చూపే నిశ్చయం,జాణ ఇచ్చే వెలుగు భావం,గజాన పోషించే ధైర్య స్వరం,నినణా నింపే ఉదయం నెమ్మది,హృదయానికి అవే వేడుక. బాణ లేని లోకంలో వెలుగు మసకబారుతుంది,జాణ మాటలతోనే దారి కనిపిస్తుంది,గజాన గర్జనలో జీవితం నడక తీరుగడుతుంది,నినణా గాలిలో నెమ్మదే నిలుస్తుంది,మనసు వీటితోనే తన స్వరాన్ని కనుగొంటుంది.🔰🌷🔰🔰🔰🔰🔰🔰🔰🔰ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం
Read More