Year: 2025

దాసోహపు విశ్వమంత్రం

దాసోహపు విశ్వమంత్రం

దాసోహపు విశ్వమంత్రం…!!! తోడు నడిచేదనుకొంటే పొరబాటేవీడి నడువాలను కొంటే అగుచాటే…ఎవరిని అడుగను ఏమని చెప్పుకోనుప్రపంచాన్ని పలికించే ముందు మాటది…!!డబ్బుకు లోకం దాసోహపు విశ్వమంత్రందర్పణంకాని దౌర్భాగ్యాన్ని వరించాలంటే…పేదోడు తనబొందిలో రోజుకొక ఎముకనివిరుచుకొని కషాయంగా తాగవలసిందే… అందని ద్రాక్షగా పుల్లనై చిటారుకొమ్మన మిఠాయి పొట్లంగా దొరకకా…అమ్మబోతే అడివై కొనబోతే కొరివై కాలుతుపెరిగిన ధరలతో గొంతును తడుపుకోలేక…నీరుగారిన నిరాశలతో పెచ్చులూడిపోయిమనస్సు క్షణాలను బరువుగా కలగంటు…వేకువలేని ఊహాలోకంలో బతకడమేనా… కరువో కాలమో కనువిప్పు కానినిరంతర నైవేద్యం చిలిన ఆకైపోయి…శ్రమలకు ఫలితం ఆశించనిదై కూటినికలిపే చేయికి పేదోడు నేరమైపోయి…వినియోగంకాని సమయం చీలిపోయి…బోధపడని వ్యవస్థలో సగటు మనుషులురాసుకొన్న పేజీలు చెదబట్టిపోతున్నాయి… అడిగేవారంటే మీకు కోపమైనాతీరని వేదనగా అదిమాకు శాపమైనా…ఎదన మడుగులను నెర్రెలు పోనీయకశాశ్వతం పూరించిన సూర్యోదయంలో…డబ్బుతో కొనలేనివి ఎన్నో వున్నాయని…అమ్ముడుపోని బతుకు మనిషి ధర్మమై…మానవతా విలువల మధ్యన ఆశయాలనుబతికించడం కోసం నిత్యాన్ని నేర్చుకోవాలి… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
కం!!🌺🌺🌺

కం!!🌺🌺🌺

సలహాలనడుగ పదుగురుపలువిధముల నొసగుచుంద్రు పసలేకున్నన్విలువగు సాయంబడిగినసులభమ్ముగ తప్పుకొంద్రు చూడగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ని జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు, దీనిని జాతీయ వినియోగదారుల దినోత్సవం అని కూడా పిలుస్తారు, డిసెంబర్ 24, 1986న వినియోగదారుల రక్షణ చట్టం భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన రోజును గుర్తుచేసుకునేందుకు దీనిని నిర్వహిస్తారు. వినియోగదారులకు వారి హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం. వినియోగదారులకు వారి హక్కుల గురించి మరింత అవగాహన కల్పించడానికి ఈ చట్టం అమలు చేయబడింది. వినియోగదారుల హక్కులను కాపాడటం మరియు వినియోగదారులు మార్కెట్ దుర్వినియోగానికి గురికాకుండా చూసుకోవడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. వినియోగదారుల రక్షణ చట్టం అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నియంత్రిస్తుంది మరియు ఈ పద్ధతుల నుండి వినియోగదారులకు రక్షణను కూడా అందిస్తుంది. ఈ చట్టం వినియోగదారులకు పరిష్కార వేదికల ప్రభావవంతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వారి వివాదాలను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. అప్పీలేట్ కోర్టులు వినియోగదారులకు…
Read More
డిసెంబర్ 24 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 24 ప్రత్యేకతలు :⁠-

✒ 1865: శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు. ✒1914: మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా జర్మనీ-బ్రిటన్‌ల మధ్య పోరు జరుగుతోంది. డిసెంబర్‌ 24 రాత్రి జర్మన్‌ సైనికులు తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొవ్వొత్తులతో అలంకరించి పాటలు పాడటం ప్రారంభించారు. ఇంగ్లిష్‌ సైనికులు కూడా వారితో గొంతు కలిపారు. ఇరుపక్షాల సైనికులూ సిగార్లూ మద్యంసీసాలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకున్నారు. క్రిస్‌మస్‌ ట్రూస్‌గా పేరొందిన ఇలాంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మరెప్పుడూ జరగలేదు. ✒1968: నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. ✒1986:పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా…
Read More
అనాధలు

అనాధలు

అంశం: నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :అనాధలు,,,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి వరదల్లో తల్లిదండ్రులు పోయిన అక్కాతమ్ముళ్ళుఅక్క తాను చదువు మధ్యలో మానేసిబ్రతుకు తెరువుకు తన అయ్య తొక్కిన రిక్షాయే ఆసరా అయ్యింది,,,,,,,,తన తమ్ముడు బడి మొహం ఎరుగని చిన్ని పిల్లాడురోజు ధనికులను రోగగ్రస్తులను వాళ్ళ చిరునామాకు రిక్షా ఎక్కించుకుని తొక్కుతుంటే,,,,,,,తన వళ్ళు గుల్లగుల్లయై ఆకలికి అల్లల్లాడే తను తమ్ముడు ఇంతముద్ద తిని పడుకుంటే, అమ్మా అయ్యా కళ్ళల్లో మెదిలి తను తమ్ముడు పలవరింతల నిద్ర,,,,,,,,,తమ జీవితాల అగ్నిగుండాల్లో నిలువెత్తు సాక్ష్యం ఆ రిక్షా,,,,,,నా అనే వాళ్లంతా అయ్యో అనడం తప్ప ఏ సహకారం అందించరు,,,,,,,,తన తమ్మున్ని సర్కారు బడిలో చేర్పించేందుకు రిక్షా ఎక్కించుకుని తీసుకెళ్తుంది,,,,,,,,,అయ్య అమ్మ కూలీ చేసైనా తనను ప్రయివేటు బడిలో చదివించేవారు,,,,,,,,రిక్షా తొక్కుతూ తన ఎదురుగా దాటేసి వెళ్తున్న పెద్ద రిక్షాలో తనతో చదువుకున్న స్నేహితులు తనను చూసిచూడనట్లు బడికి వెళ్తుంటే గుండెల్లో గెలికినట్లయ్యింది,,,,,,,,ఏం చేస్తాం విధి రాసిన…
Read More
కం!!🚩🚩🚩

కం!!🚩🚩🚩

వస్త్రము తనువుకు నొప్పునుదస్త్రము చదువరికి నొప్పు ధారుణి యందున్శస్త్రము ధీరునికొప్పున్శాస్త్రము నడిపించు మనల సరగున కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
ఓ నాట్య మయూరమా,,,,, నీవెవరు?

ఓ నాట్య మయూరమా,,,,, నీవెవరు?

ఓ నాట్య మయూరమా,,,,, నీవెవరు,,,,,!? నీలి సముద్రం అలలపై తేలియాడుతూ నర్తించే మయూరివా,,,,,,,,,,,కోయిల సన్నని పాటలలో లయబద్దంగా అడుగులు వేస్తూ తూరుపు హిమశిఖరం ఆశీర్వచనాలలో సౌందర్య రూపసీ,,,,,,,,,ఇలాతలంపైనే నయనానందకర కరముల కదళికల నైపుణ్యంతో మేఘాలను వర్షింపజేసే అద్భుత కళాకారిణి,,,,,,,,,,,సప్తస్వరాలు గింగిరాలు పోయే నాట్యశిఖామణీ హృదయాలు దోచుకొను రతీమన్మధుల కలబోసిన నర్తనం మనస్సు కోరికల సెలయేరవును నిను కాంచినంతనే,,,,,,,,,,,దివినుండి దిగివచ్చిన పారిజాతపుష్పానివా అవనిపై గంగాప్రవాహానివా హిమశిఖరాలలో మానససరోవరానివా సెలయేటి నురగల్లో తేలియాడుతూ జలకాలాడే కోమల లతాంగివా ఏమి ఆ సౌందర్యం,,,,,,,,,,,నీ కళా ముఖచంద్రిక లోని నయనాలు ఒలికే భావాలు రంగరించిపోసిన అభినయాల భాష్యాలు బహుసుందర కమలాలు తీయు తేనియల రాగాలు ప్రియుని బ్రోవు సంకేతాల గేయాలు,,,,,,,,,,,,,హృదయేశ్వరీ నీచెంత ఉండగా నా ప్రాణాలు తేలిపోతూ అక్షరాలు రాసేందుకు వేళ్ళు వణుకుతూ మత్తిలి తూలిపోతున్నాయి ఇప్పుడు నేను నేనుగాను,,,,,,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
యువతులు ఎగిరే గాలిపటాలు

యువతులు ఎగిరే గాలిపటాలు

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :యువతులు ఎగిరే గాలిపటాలు,,,,,,,!!రచయిత అపరాజిత్ రెడ్డి యవ్వన ప్రాంగణంలో ఉన్న యువతులుకలల పూతోటలో విహరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారుయువతులు తమకున్న ప్రతిభ జ్ఞానాన్ని తమకున్న కుటుంబ సమస్యల రీత్యా స్వేచ్ఛను కోల్పోయి అమలుకు నోచుకోక తమలో తామే ఎవరికి తెలియకుండా కుమిలిపోతారు,,,,,,,,ప్రతి విషయానికి తెచ్చిపెట్టుకున్న నవ్వు నటనలతో జీవన మాధుర్యాన్ని కోల్పోతారు,,,,,,,ఒకవేళ పెళ్ళైన యువుతులైతే తమ భాగస్వాములతో తెచ్చిపెట్టుకున్న హావభావాలు ప్రదర్శిస్తూ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు,,,,,,,,,ఉద్యోగులైన యువుతులైతే జీవనం కంటకభూయిష్టమే కాన్పులనీ పిల్లల పెంపకం వాళ్ళ చదువులు బాధరాబందీ అంతా తమ భుజస్కంధాలపై నుండి కదలిపోవడమే,,,,,,,,,భర్త అనేవాడు ఎలావున్నా ఏంచేసినా భార్య అనే మహిళ సర్దుకుపోతూ కుటుంబం బాగోగులు చూసుకునే అజ్ఞాత యజమాని,,,,,,,తప్పంటూ జరిగితే సమాజానికి మొదట మహిళే కళ్ళ ముందు అగుపడే ముద్దాయి,,,,,,మగాడు పనికిమాలిన వెధవైనా మహిళను తన చెప్పుచేతుల్లో ఉంచుకుని వినకపోతే చిత్రహింసలు పెట్టె పిచ్చివేదవ,,,,,,మహిళకు గర్భధారణ అనేది ఉండడం వల్ల…
Read More
కం!!🌺🌺🚩

కం!!🌺🌺🚩

పురవీధులెంట తిరుగుచునరకాసురుల వలె తోటి నరులను జంపన్తరలుచు మోదీ బహు తీవరమున తలలను నరికెను వరుస తెగిపడన్! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
పిల్లల ఆలోచనా తీరు

పిల్లల ఆలోచనా తీరు

అక్షర కొరకుఅంశం - నేటి పిల్లల ప్రవర్తనరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - పిల్లల ఆలోచనా తీరు ఈ రోజుల్లో పిల్లలుఅన్నీ కావాలంటారుఅంటే అవ్వా,బువ్వాఅవెలా వస్తాయెా తెలీదు! తల్లి తండ్రుల తాహతుకుమించిన చదువు కావాలిఉన్నతమైన స్థితిలో ఉండాలివారి కష్టంతో తమకు పని లేదు! తోటి పిల్లల కంటే తమే గొప్పగా ఉండాలి మంచి బట్టలుమంచి ఫోన్లు మంచి బండ్లులేదా కార్లుఅన్నింట్లోనూ గొప్ప! ఆకాశాన్నంటే ఊహలుఆశలకైతే అంతే లేని కోరికలుఆశయాలు లేనే లేవసలుమర్యాద మన్ననలు మరిచారు! పెద్దల మాట చద్దన్నం మూటఅనే నానుడి ఎప్పుడో పోయిందిపెద్దలుంటే మాకు హద్దులుపెడతారని భయం మెుదలైంది! ఇది నా స్వంత రచన..
Read More