Year: 2025

అక్టోబర్ 03 ప్రత్యేకతలు :⁠-

1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861). 1957 : ఆకాశవాణి విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం. 1990 : బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది. 1992 : చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దిగవల్లి వేంకటశివరావు మరణం.(జ.1898). 2006 : తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి ఇ.వి.సరోజ మరణం (జ.1935). మాధవి కాళ్లసేకరణ
Read More

అక్షర లిపికి “చతుర్థ వార్షికోత్సవ” శుభాకాంక్షలు

అక్షరలిపికి శుభములు అందుగాకవార్షికోత్సవ శుభవేళ వందనములుగాంధితాతకు,శాస్త్రికి వందనములుసంతసించాలి సాహితీ సభ్యులంతఆరుగాలము సేవలందమరు గాకవిజయదశమితో మొదలిడి విజయమందతెగువజూపుము దుర్గమ్మ తెలుగు వెలుగఆదుకొనుమమ్మ శారదా అండనుండిమరల వచ్చెడి వార్షిక వత్సరముకుసభ్యులందరు సౌభాగ్య శుభము లందిసత్కవితలను వినిపించు శక్తి నిమ్ము!! మరొక్క మారు మననము చేస్తూ… ............ కోట.
Read More

ఉ!!💐💐💐💐💐

అమ్మయె చేయిజార పర యమ్మని యమ్మగ బిల్వ సాధ్యమేకొమ్మయె కూలిపోవగను కూర్చగ పూలను కష్టమవ్వునేనమ్మిన నాన్నగారు నిల నమ్మక ద్రోహము చేయుటేలనోకమ్మని వంటకమ్ములను కాదని పోయిన కాలుచుండురో!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More

ఉ!!💐💐💐

పాఠకులైన నేమి గుణ పాఠము నేర్పిరి విద్య నేర్వగన్!పీఠములెక్కి నేతలిల భేదము జూపిరి ఓటరన్నపై!పాఠము నేర్చి శిష్యులిల పంతము బట్టుచు గేలిచేయగన్!శోఠము వోలె వేగిరమె చొచ్చుకు పోవలె కానలోపలన్!! శోఠము/ పావురము. గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More

ఉ!!మా!!💐💐💐💐💐

మీసము దిప్పినంత మన మేలును గాంచరు చూడరోదొరాగ్రాసము గోరినంత ఘన కాసుల నీయక బంధువుల్మరీకూసములెల్ల యూడినను కూర్చరు గూడును మిత్రులెల్లరున్రాసుల కొద్దిగాను ధన రాసులు జూసియు నవ్విరందరున్!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More

ప్రపంచంలో గాంధీజీ విగ్రహం లేని దేశం లేదు.

'నా జీవితమే ఒక సందేశం' అన్న మాట చాలు ఆయన విశ్వ మానవుడని చెప్పడానికి. ఆ మాట చెప్పడానికి ఒక వ్యక్తికి ఎంత ధైర్యం, సాహసం కావాలో కదా..! ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం నిజాల కోసం వెతికిండు. గాంధీని పొగడడం తేలిక. కానీ, ఆయన్ను అనుసరించడం కత్తిమీద సాము లాంటిది. అందుకే గాంధీయిజం ఎవర్స్! గాంధీజీ మనసులో కొన్ని విలువలు ఉండేవి. ఏ విలువల్ని, ఏ సిద్ధాంతాల్ని ఆయన నమ్మేవాడో… వాటిని ఖచ్చితంగా ఆచరించేవాడు. ఇతరులకు ఏదైనా ఉపదేశించాలంటే ముందు దాన్ని ఆయన సాధన చేసేవాడు. 'చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది కాదు" అని ఒక పిల్లవాడికి చెప్పడానికి.. అంతకు రెండు వారాల ముందే ఆయన చక్కెర తినడం మానేశాడు. ఇలా ఏ పని చేసినా సాధన చేశాకే.. ఇతరులకు చెప్పేవారు. ఒక మనిషి తన విలువలకు కట్టుబడి జీవించాలనుకున్నప్పుడు.. కాలం, ప్రదేశం, పరిస్థితులు ఆ విలువలకు పరీక్షలు పెడుతుంటాయి. ఆ…
Read More

అక్షరాల అగ్నిపూవులు

బ్రతుకు పుటలలోదుఃఖిత లోగిళ్ళనులిఖించుకున్న అక్షరాలనుఎన్నిమార్లు మళ్ళీమళ్ళీ చదువుకున్నానోకన్నీళ్ళను కళ్ళ బావిలోంచితోడుకుని నాలోనేను కుమిలి కుమిలిలౌక్యం తెలియని అమాయకత్వంలోఎన్నెన్ని మార్లు మోసపోయానోఎన్నిమార్లు చావు తలంపులతోపిశాచి కళ్ళల్లో తేలియాడానోబాల్యం నుండి మనో సంఘర్షణలలోఎడారి మంటల ఇసుకలోజీవితమంతా ఎండమావుల్లో నీటికై పరుగులుఎక్కడా ఆసరాగా ఒయాసిస్సు అగుపించలేదుఓటముల మీద ఓటములతోజీవితమంతా గుండె మంటలేస్నేహితులే నా ప్రతిభకు సవాళ్ళైనారునేను అనేవాన్ని చిరునామా లేకుండానా ప్రగతి పడగొట్టి నాపైనుండి అందలాలెక్కారుఅగమ్యగోచరంగా ప్రయాణం సాగించానుమనస్సు నిండా అగ్గిపుష్పించితిమిరాల నుండి సన్నని కాంతి కిరణాలుఎక్కడినుండో చిన్నిచిన్ని ఆశలుజీవితంలో చిగుళ్ళు తొడిగాయిచిన్న బడిపంతులు ఉద్యోగంఅక్షరాలు రాసుకునేందుకు కలంఅగుపించిన కాగితాల నిండా సిరా మరకలేఅక్షరాల తొలిపొద్దు ఆరాధ్యందైవ కృపవల్ల మీ ముందుకుమీ అనుంగు సోదరుడు అక్షరాలలోనా జీవుతానుభవాలే నా కవితలునాకు కళ్ళల్లోని అక్షరాలు ఆ దైవం,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More

నీ గొంతు పిల్లికూతలు,,,,,!!

నీ గానం పిశాచాల గోలనీ రాతలు నిప్పుల సెగలునీ ఆలోచనలు అగ్ని శ్వాసాలునీ పాటలు కర్ణకఠోరంనీ భాష బూతు పురాణంనీ మాటలు గుండెల్లో గుబులునీ నాట్యం కోతి గెంతులునీ హృదయం రక్తపుటేరులునీ మనస్సు దయ్యాల కొంపనీ ఊహలు బూతు చిత్రాలునీ ఆశలు ఆశ్చర్యంవేసే అడియాశలునీ ముఖం పగిలిన గాజుబొమ్మనీ కలలు పట్టపగలు వెన్నెలలునీ కళలు ఆత్మహత్యకై పోరునీ నటన మూగసైగల అడవిమనుషుల జీవనంనీ రచనలు మూర్ఖుల భావాలునీ ప్రేమలు మితిమీరిన బెల్లం ముద్దలునీ శ్రమల వెల దొంగనోట్లతో చెరసాలనీ తిండి గేదెలు మేసే గడ్డినీ తాగుడు పేగులు తెగుతున్న చప్పుడునీ సోమరి చమట లిక్కర్ దుర్వాసననీ ఆకలికి చీల్చుకుతినే పచ్చిమాసంనీ జీవితం ఎండమావుల్లో ఈదటం అపరాజిత్సూర్యాపేట
Read More

విజయదశమి

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటదసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు…
Read More

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటారు. 15 జూన్ 2007 వ తేదీన ఐక్య రాజ్య సమితి జనరల్ శాసనసభ అక్టోబరు 2 రోజును అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా జరుపుకోడానికి నిర్ణయించింది. ఈ రోజున సభ్యదేశాలను తగురీతిగా సత్యాగ్రహం నినాదాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా చెప్పింది." సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. మహాత్మా గాంధీ సెప్టెంబరు 11, 1906 న దక్షిణ ఆఫ్రికా లో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్ లూథర్ కింగ్ ను కూడా ఈ ఉద్యమం…
Read More