అంశం- సమాజంలో జరుగుతున్న అకృత్యాలు వాటి పరిష్కారాలు శీ
ర్షిక-చెయ్యాలి నిర్మూలనకి కృషిడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻సమాజపు గోడలపై, రక్తపు మరకలు,న్యాయం నిద్రపోతే, నిశ్శబ్దం దోపిడీ. అన్యాయం జెండాలు, ఎగురుతున్న గల్లీ,బలహీన హృదయాలు, విలవిలలాడుతూనే. లోభపు కొండలు, మానవతను మింగుతూనే,సత్యపు గాలి, మూలుగుతూ అడుగుతుంది. బాలల కన్నీరు, రాత్రిని తడుపుతుంటే,వృద్ధుల విలాపం, గోడలపై ప్రతిధ్వని. దురాశ దహనం, హృదయాలు కాల్చేసే,మానవ విలువలు, బూడిదైపోతూ కూలిపోతున్న. పరిష్కారం అన్వేషణ, అగ్నికి జలధార,సత్యం వెలుగై, చీకటిని తొలగించాలి. విద్య గింజలు, నేలపై చల్లినపుడు,అవగాహన మొక్కలు, అరణ్యమై పెరగాలి. సమానత విత్తనం, ప్రతి గుండెలో నాటితే,న్యాయ పువ్వులు, శాశ్వతం విరియాలి. స్వప్నాల సమాజం, నిజాల వేదికపై,మనుష్యత్వం శాసనం, సత్యం పాలన కావాలి…👑👑👑👑👑👑👑👑👑👑ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం