బంగరు రంగుల పూవులెన్నో విరబూసిన ఆకర్షణ. రంగుల జీవన చిత్రాలెన్నో ఒకటొకటిగా ఊసరవెల్లిలా మారుతున్నాయి. రంగు రంగుల హొయలొలికే సౌందర్య కన్యలు నర్తిస్తన్నారు.సుమధుర గీతాలెన్నో వీణుల విందుగా వినపడుతున్నాయి.కానీ జీవితంలో ఏదో కోల్పోయిన బాధ.హృదయం లేని కృత్రిమ అందాల సొగసులు మనిషి అనేవాడు ఒంటరిగా కుమిలిపోయే లయ తప్పిన గీతాలు.కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడలేని రంగు రంగుల ప్లాస్టిక్ బొమ్మలు మనుష్యులు.
అపరాజిత్
సూర్యాపేట