కె. రామలక్ష్మి (1930, డిసెంబరు 31 – 2023, మార్చి 3) ప్రముఖ రచయిత్రి.
రామలక్ష్మి 1930, డిసెంబరు 31న తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు.
1951 నుండి రచనలు చేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. అనువాదాలు కూడా చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేశారు.
1954లో కవి, సాహిత్యవిమర్శకుడు ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు.
నవలలు
విడదీసే రైలుబళ్ళు (1954)
అవతలిగట్టు
మెరుపుతీగె
తొణికిన స్వర్గం (1961)
మానని గాయం
అణిముత్యం.
కథాసంకలనాలు
నీదే నాహృదయం
అద్దం
ఒక జీవికి స్వేచ్ఛ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న (హంస) పురస్కారం (2016, ఏప్రిల్ 8).
గృహలక్ష్మి స్వర్ణకంకణం.
రామలక్ష్మి 2023, మార్చి 3న హైదరాబాద్‌లోని మలక్‌పేటలో మరణించారు.
మాధవి కాళ్ల
సేకరణ