aksharalipi

3275 Posts
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ధర్మాగ్నిలో ధైర్యముతో నిలిచిన నారి  దాశరథి సీత…అవమాన సభలో ఆత్మగౌరవం గాచిన అజేయ పాంచాలి..కాకతీయ సింహాసనమున కత్తి గర్జించిన  వీర రుద్రమదేవి శక్తివిజ్ఞాన గగనమున విహరించిన వనిత  కల్పన చావ్లా కీర్తిసమర రంగమున సాహసమై నిలిచిన  రాణి లక్ష్మీబాయి శౌర్యంసమాన హక్కుల సింహాసనమెక్కిన  జాగృతి భారత నారి జాతి…. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. -శివ రామ్
Read More
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో…..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో…..

💐🇮🇳💐 ఆటవెలదులు 💐🇮🇳💐 1) వనిత చేతగాని పనిలేదు వసుధలోనేర్పు , ఓర్పు గలిగి నెలత జేయుఅలసటెరుగకుండు, ఆలనా పాలనాకన్నసంతు సమము కరుణ జూపు2)అంతరిక్ష మంత అవలీలగా తిరిగిక్షిపణులను విడిచిన చిన్న "లేమ"నింగి నీకు హద్దు,నీ గుండె నీబలం"వారి "గావు " వింటి నారి " వమ్ము !3)సానియా,కరణము,సాక్షి, మేరీకోముహంపి,సింధు,ఉష,అంజు,జార్జిఎందరో మహిళలు ఎదుగుట కూతముఇచ్చి ప్రోత్సహించు,హితము గూర్చు !4)కష్టకార్యములను "కోమలి"చేయదు"స్త్రీలు" "సున్నితు"లని చీత్కరింపఅట్టి పనులజేసి "అబలలం కామ"నినిలిచి గెలిచి తెలిపె " నేటి మహిళ" !5)కదనరంగమందు,కడలి యంచులయందుపారిశుధ్య మందు, పాడి యందుసైన్యమందు,వైద్య సేవలందే గాకఇంటిపనులు ,పెక్కు వంట " వనితె" !6)కాళ్ళతో గురినిడి, కరములు లేకున్న" విల్లు" ఎక్కుపెట్టి విజయమందెస్వర్ణ ,రజతములను సాధించె " శీతల"జమ్ము కాశ్మిరమ్ము నిజమ్ము గాను!7)అంతరిక్ష మంత " అవలీల " గా తిరిగిరణము గెలిచి " రమణి" రాజ్యమేలెరాజకీయమందు రాణించె " లేమలు "రాష్ట్రపతిగ " ముర్ము " రాణకెక్కె !8)నేటి మహిళలంత మేటిగా పోటీకిపురుషుల…
Read More
శక్తికి ప్రతిరూపం మహిళ

శక్తికి ప్రతిరూపం మహిళ

శక్తికి ప్రతిరూపం మహిళ ప్రకృతి పర్యాయపదం ఆడది. సముద్రమంతా లోతు ,ఆకాశం అంత మనసు …సృష్టిలో ప్రతి జీవి చూసేది తొలుత స్త్రీ మూర్తినే… అటువంటి స్త్రీ మూర్తికి సమాజంలో అడుగడుగున అవరోధాలే…పురుషాధిపత్య సమాజంలో స్త్రీ అడుగనుగునా అణచివేతకు గురవుతూ వస్తుంది. గత కాలపు అణిచివేతలతో ఆనాటి స్త్రీ తనలో తనని పరికించడంలో ఎక్కడో వెనుకబడింది. నేటి తరం స్త్రీ తనకేమి కావాలో తనను తాను తెలుసుకొని ముందుకు వెళ్లడానికి కొత్తదారులు వెతుకుతుంది.నేటితరం మహిళలు పురుషులతో దీటుగా అన్ని రంగాలలో పోటీ పడుతూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ పోటీ తత్వంలోనే కొందరు తమని తాము మర్చిపోతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు లేదా మేము పురుషులకంటే అదములము కాము అనే భావనతో పాతాళానికి జారుకుంటున్నారు. ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం, ఒక తరమే కాకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని నానుడి ఉంది. అటువంటి కీలకమైన…
Read More
సకల కళలలో ధీశాలి మహిళ

సకల కళలలో ధీశాలి మహిళ

మహిళా జీవనజ్యోతిజగత్తుకు మాతృమూర్తిచదువుల తల్లి సరస్వతిమగాడి హృదయంలో నెలవైన ఇల్లాలువిఅఖండ జ్ఞానజ్యోతులు పుత్రికలు,సుపుత్రులుసంసార జంజాటకంలో సతమతమవుతూఉద్యోగం ఇతర వ్యాపకాలలోఆరితేరిన శారీరక మానసిక శ్రమలతోకుటుంబానికి, సామాజిక చైతన్యంలోనీవు బ్రతుకుబండికి ఇంధనమైమగవాడి సుఖమయ జీవనయానంలోఅర్దనారీశ్వరీ తత్వంగాసాలోచనల అక్షరాలలో ఉద్గ్రంథాలు లిఖించిసామాజిక దిశానిర్దేశం చేస్తున్న కవయిత్రివిపల్లెటూళ్ళలో మగాళ్లతో సమానంగావ్యవసాయంలో కాయకష్టం చేస్తూసకల విద్యలలో మేటివని కీర్తింపబడుతూశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంఉపయోగించే నైపుణ్యంలో మేటివికర్మాగారాలలో కార్మికురాలివైసైనికురాలివై దేశానికి భద్రత నీవైవినీల గగనంలో వ్యోమగామివైక్రీడలలో దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేసిన ధీశాలివినీకు నీవే సాటివని నిరూపించుకుంటున్నబహుదూరపు జీవనరాగాలను మీటుతున్నవెలుగుల సూరీడువు,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
అమర్ సింగ్ చంకీలా(పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు)

అమర్ సింగ్ చంకీలా(పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు)

అమర్ సింగ్ చమ్కిలా (21 జూలై 1960 - 8 మార్చి 1988) ఒక భారతీయ పంజాబీ సంగీత గాయకుడు మరియు సంగీతకారుడు . చమ్కిలా యొక్క స్పష్టమైన భాష, ఎత్తైన గాత్రాలు మరియు టంబితో కూడిన నవల కూర్పులు అతన్ని ప్రజాదరణ పొందాయి. అతను పెరిగిన పంజాబీ గ్రామీణ జీవితం అతని సంగీతాన్ని ప్రభావితం చేసింది. 8 మార్చి 1988న, భారతదేశంలోని పంజాబ్‌లో తిరుగుబాటు సమయంలో అతని ప్రజాదరణ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు , చమ్కిలా మరియు అతని రెండవ భార్య అమర్‌జోత్ వారి బృందంలోని ఇద్దరు సభ్యులతో సహా హత్యకు గురయ్యారు, ఇది పరిష్కారం కాలేదు. చమ్కిలా ఒక ప్రభావవంతమైన పంజాబీ కళాకారిణి మరియు లైవ్ స్టేజ్ పెర్ఫార్మర్, దీనిని తరచుగా " ఎల్విస్ ఆఫ్ పంజాబ్" అని పిలుస్తారు. అతని మొదటి రికార్డ్ చేసిన పాట "తకూ తే టకువా", మరియు అతని హిట్‌లలో "పెహ్లే లాల్కరే నాల్"…
Read More
నేటి విజ్ఞానం,,,, జ్ఞానులు ఎవరు ?

నేటి విజ్ఞానం,,,, జ్ఞానులు ఎవరు ?

నేటి విజ్ఞానం,,,, జ్ఞానులు ఎవరు !!??!! గొంతు సవరించుకుని జీవనరాగాలను గానం చేద్దామంటే,,,,వయస్సు ముదిరి అపశ్రుతి రాగాలే పలుకుతున్నాయి,,,,ఈ వయస్సులో గతితప్పిన జీవనస్థితిగతులు ఆవేదనలలో కొట్టుమిట్టాడే దుఃఖిత సంఘర్షణలలో మనస్సు గూడు,,,,,నా చుట్టూర నిస్తేజంగా యువతరం కుళ్ళిన సమాజం గొడుగు కింద జీవనం సాగించే అపశ్రుతి క్రీనీడలు,,,,,నిద్రాహారాలు మాని విలువలు కోల్పోయిన చదువులు ఆత్మ కోల్పోయిన ఆకులు రాలిన అడవి మోడు మాను,,,,,నేటి విజ్ఞానం అధ్యయనం ఏమిటికీ కొరగాని వెర్రిమొర్రి థియరీలను బట్టీయం వేస్తూ ర్యాంకుల కోసం ఆకలి దప్పికలు మాని అహరహం శ్రమలు,,,,,,కోరుకున్న సీటు కోసం, ఉద్యోగం కోసం నిలువునా తెగిపడుతూ ఇంటి పరిస్థితులు గుర్తెరిగి తీతువు తీసే రాగాలలో అగ్ని మింగే సిగరెట్లలో ఆకాశం కూలిపడేలా హృదయంలేని సంజ్ఞల గారడీ గణితం ఏ మేధావో కనిపెట్టిన సిద్ధాంతాల మూలాలు లాబ్ టాప్ లలో నిక్షిప్తమైన అనవసరమైన జ్ఞానమనుకునే మూర్ఖత్వానికి నేటి యువతరం బలి,,,,,,,మానవత్వం ప్రబోధాలు లేని, తాను జీవించే…
Read More
మహిళామూర్తి,,,,,,,!

మహిళామూర్తి,,,,,,,!

మహిళ సృష్టి స్థితి లయల్లోమాతృమూర్తియై ఇల్లాలైజీవన్ముక్తి ప్రధాతయైనా,,,,,,ఆధునిక జీవన పోరాటంలోతీవ్ర సంఘర్షణకు లోనైతరాల నాటి బానిస సంకెళ్ళను తెంచుకుందిపురుషులతో సమవుజ్జీలుగానేనా నువ్వా అంటూ పోటీపడుతున్నారుఅయినా అడపాదడపా దుస్సంఘటనలు జరుగుతూమహిళను హీనాతిహీనంగా చిత్రీకరణ ఘోరం,,,,,,నేటి మహిళ రోజు రోజుకు రాటుదేలుతోందివిశ్వం కుదేలయ్యేలా,,,,,,,శారీరకంగా మానసికంగా దారుఢ్యమైధైర్యం కూడదీసుకునితను ఎక్కని అందల మంటూ లేదువివాహమైనా తను స్వేచ్ఛాయుతంగాభర్తతో పాటు కష్టపడుతూస్వేచ్ఛాయుత సామ్రాజ్యానికి బాటలు వేస్తోంది,,,,,,,ఎవరూ ఎవరికీ సంకెళ్ళు వేయలేరు,,,,,,! అపరాజిత్సూర్యాపేట
Read More
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు… 💐🙏

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు… 💐🙏

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు… 💐🙏 ఎవరి చూపుల్లోస్త్రీని చూసే తీరులోఆసక్తి కాదు…ఆదరణ కనిపిస్తుందో…ఎవరి మాటల్లోఆమెను తగ్గించే స్వరం కాదు…గౌరవం వినిపిస్తుందో…ఎవరి హృదయంలోఆమె బాధకు ఓదార్పు,ఆమె ఆనందానికి ప్రోత్సాహం ఉంటుందో…ఎవరు స్త్రీనిబలహీనతగా కాదు…ప్రపంచాన్ని మలిచే శక్తిగా చూస్తారో…ఎవరు ఆమె కలలనునవ్వులలో ముంచే వారు కాదు…ఆ కలలకు దారి చూపే వారో…ఎవరి దగ్గర ఆమె నిలబడితేభయం తగ్గి…భరోసా పెరుగుతుందో…ఎవరు స్త్రీ కూడాకలలు ఉన్న మనిషే అనిఒక్క క్షణం కూడా మర్చిపోరో…అలాంటి మనసున్న వాడి వద్దస్త్రీకి గౌరవం ఉంటుంది,జీవితానికి అర్థం ఉంటుంది.అందుకే…మగాడిని బలం చూసి కాదు,స్త్రీని ఎలా గౌరవిస్తాడో చూసిఅతని విలువ తెలుస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే…అతడే నిజమైన మగాడు…. ShivaRam…✍️
Read More
మహిళా ఓ మహిళా

మహిళా ఓ మహిళా

అంశం - మహిళా దినోత్సవం రచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - మహిళా ఓ మహిళా మహిళా ఓ మహిళాఅన్నింటా ముందుంటావుఓపికతో భరిస్తావు అయినానీకే ఎందుకు కన్నీటి కష్టాలు! ముందు సీటు నీదే అంటారుమహిళలను గౌరవించాలంటారుచెప్పేవన్నీ శ్రీరంగ నీతులుచేసేవేమెా మహిళా ద్రోహాలు! నమ్మిస్తారు వంచన చేస్తారుపసి ఆడపిల్లలని కూడాచూడకుండా అన్యాయాలుచేస్తారు ఎక్కడుంది మహిళకు న్యాయం! మహిళ లేనిదే సృష్టి లేదుఅమ్మ తనం వమ్ము చేయకండిఅమ్మను కాపాడితేనే సృష్టి కిఅందం! నీ జన్నకు సార్థకథ! అమ్మేరా అన్నిటికీ మూలంఅమ్మ విలువ తెలుసు కొనుటమానవ ధర్మం! దేవుడు అంతటాఉండలేక సృష్టించాడు అమ్మ ను! ఇది నా స్వీయ రచన..
Read More
కం!!💐💐💐💐💐

కం!!💐💐💐💐💐

నీతికి పాతర వేసియుజాతికి ద్రోహమ్ము జేసి సైసైయంచున్నేతలు సొమ్ములు మ్రింగుచుగోతులలో దాయుచుంద్రు గుట్టుగ, కృష్ణా!!! తగలేస్తున్నరు విందుకుతగలేస్తున్నారు మందు తాగుడు కొరకైతగలేయరు వైద్యమునకుతగలేయరు విద్య కొరకు ధనమును కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
Read More