శక్తికి ప్రతిరూపం
శక్తికి ప్రతిరూపం మహిళ ప్రకృతి పర్యాయపదం ఆడది. సముద్రమంతా లోతు ,ఆకాశం అంత మనసు …సృష్టిలో ప్రతి జీవి చూసేది తొలుత స్త్రీ మూర్తినే… అటువంటి స్త్రీ మూర్తికి సమాజంలో అడుగడుగున అవరోధాలే…పురుషాధిపత్య సమాజంలో స్త్రీ అడుగనుగునా అణచివేతకు గురవుతూ వస్తుంది. గత కాలపు అణిచివేతలతో ఆనాటి స్త్రీ తనలో తనని పరికించడంలో ఎక్కడో వెనుకబడింది. నేటి తరం స్త్రీ తనకేమి కావాలో తనను తాను తెలుసుకొని ముందుకు వెళ్లడానికి కొత్తదారులు వెతుకుతుంది. నేటితరం మహిళలు పురుషులతో దీటుగా అన్ని రంగాలలో పోటీ పడుతూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ పోటీ తత్వంలోనే కొందరు తమని తాము మర్చిపోతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు లేదా మేము పురుషులకంటే అదములము కాము అనే భావనతో పాతాళానికి జారుకుంటున్నారు. ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం, ఒక తరమే కాకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని నానుడి ఉంది. అటువంటి…