•తల్లాప్రగడ విశ్వసుందరమ్మ(స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి)*
తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, (1899 మార్చి 6, - 1949 ఆగష్టు 30) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి.ఈమె 1899, మార్చి 6 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు 9వ ఏట తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహం జరిగింది. పండితులైన తన తండ్రి వద్దనే ఉండి ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి పరీక్షలు చదివింది. 16 సంవత్సరాల వయసులో భర్త దగ్గరకు కాకినాడ వచ్చింది. ఆ కాలంలో నరసింహశర్మ పిఠాపురం రాజావారు నడిపే అనాథ శరణాలయానికి సూపరింటెండెంటుగా ఉన్నారు. 1921లో దంపతులిద్దరూ రాజకీయాల వైపు ఆకర్షితులై విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత, శాసనోల్లంఘన, విదేశీ వస్త్ర దహనాలు, వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాదు కాంగ్రెస్కు వెళ్లి అక్కడ సబర్మతీ ఆశ్రమానికి వెల్లి, గాంధీజీని దర్శించుకున్నారు. తిరిగివచ్చిన పిమ్మట…