Blog

Your blog category

మోల్ డే

మోల్ డే

మోల్ డే అనేది రసాయన శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్ర విద్యార్థులు మరియు రసాయన శాస్త్ర ఔత్సాహికులు అక్టోబర్ 23న ఉదయం 6:02 నుండి సాయంత్రం 6:02 గంటల మధ్య జరుపుకునే అనధికారిక సెలవుదినం , దీని వలన తేదీ MDY లేదా YMD తేదీ ఫార్మాట్లలో 6:02 10/23 అవుతుంది . సమయం మరియు తేదీ అవోగాడ్రో స్థిరాంకం నుండి తీసుకోబడ్డాయి , ఇది సుమారుగా6.02 × 10 23 , ఏడు బేస్ SI యూనిట్లలో ఒకటైన పదార్ధం యొక్క ఒక మోల్ (మోల్) లోని కణాల (అణువులు లేదా అణువులు) సంఖ్యను నిర్వచిస్తుంది. మోల్ డే విద్యావేత్త మార్గరెట్ క్రిస్టోఫ్ నిర్వహించిన వేడుక నుండి ఉద్భవించింది. ఆమె 1980లలో ది సైన్స్ టీచర్‌లో తన అనుభవాల గురించి ఒక వ్యాసం రాసింది. ఈ వ్యాసం నుండి ప్రేరణ పొందిన మారిస్ ఓహ్లర్, ప్రైరీ డు చియెన్, విస్కాన్సిన్ నుండి…
Read More
అక్టోబర్ 23 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 23 ప్రత్యేకతలు :⁠-

1623 : హిందీ భాషలో రామాయణాన్ని రచించిన తులసీదాసు మరణించాడు (జ.1532). 1924 : భారతీయ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ జననం (మ.2015). 1924 : తెలుగు నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు కె.ఎల్. నరసింహారావు జననం (మ.2003). 1940 : బ్రెజిల్‌ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జననం. 1969 : అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు సంజయ్ గుప్తా జననం. 1977 : దూరదర్శన్ సప్తగిరి టీవి ఛానల్ ప్రారంభం. 2007 : తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఉత్పల సత్యనారాయణాచార్య మరణం (జ.1927). మాధవి కాళ్లసేకరణ
Read More
నీకేల ఈ నిరాశ!?

నీకేల ఈ నిరాశ!?

నీకేల ఈ నిరాశ!?ఎండాకాలం ఎండలకుపగుళ్లుదేలిన బీడుభూములుతొలకరి చినుకుల చల్లదనంతోపచ్చని పచ్చికతో పూల పరిమళాలతోలే లేత చిగుళ్లతో ఓ వినూత్న భూమికఅందాల ప్రకృతి కన్యక! నీకేల ఈ నిరాశ!?కొండలు బండలు పగిలే మండుటెండల వడగాలులుదిగులుపడే సహోదరా చూడు!జోరువానలో ప్రకృతి పరవశించిపోగావాగులు వంకలు ఆ కొండలు బండల్లోంచేపొంగిపొర్లడం నీవెప్పుడూ చూళ్ళేదా!? నీకేల ఈ నిరాశ!?గుండెలు పగిలి అగ్గిపిడుగులు పెఠేల్మని పేలినానిప్పులు కురిసే ఎడారి మంటలైనాకాలం గతించినాకొద్ది ఆ సంఘర్షణల ఉదృతి తగ్గిమనస్సు నెమ్మదిగా నెమ్మదించి మొగ్గలు తొడుగుతుందికాలం హృదయంలో పట్టుతేనె తీయదనాలు నింపుతుంది!మురికి నీళ్ళ కొలను కొంతకాలానికి తేరుకునిమంచినీళ్ళు అయినట్లు!వెలుగుల ఇంద్రధనస్సులోకే నీ సుదూర ప్రయాణం!!నీకేల ఈ నిరాశ! అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!వె!!💐💐💐

ఆ!వె!!💐💐💐

మందిసొమ్ము గోరి మంచాలు వేయుచుభార్య బిడ్డలకును పంచ బోకు!పడుపుకూటికన్న పస్తులుండుట మేలుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
అరణ్య రోదన ================చిత్ర కవిత

అరణ్య రోదన ================చిత్ర కవిత

మహమ్మద్ రవూఫోద్దీన్ ఆసరకై అరులు చాచినసృష్టికి మూలమూర్తినికల్లబొల్లి కబుర్లు చెప్పిఅగాధంలో నెట్టివేసేహస్తాలు ఎన్నో నీ అందముఅందిన చందమామనీ నవ్వే నా చీకటి బతుకులవెన్నెల అంటూ ఊరించినేడుమాటలతోనేవలువలు ఒలిచేనోళ్లు ఎన్నో అర్థం చేసుకునే నాథుడు లేకరోజుకు ఎన్ని ఆర్తనాదాలునాలుగు గోడల మధ్యశిధిలమవుతున్నయో కదా ఇది నా స్వీయ రచన
Read More
శీర్షిక : స్నేహంస్నేహమా

శీర్షిక : స్నేహంస్నేహమా

శీర్షిక : స్నేహంస్నేహమా .. అక్షరామృతదారలు వొలుకుతు తాకింది మనసు..మన హృదయాల్లో తేనె చిలుకుతూ పల్లవించే కవితగా.అంజలి గట్టించి ఆస్వాదిస్తున్న మనసులో ఆ సాంత్వన ..ప్రతి క్షణం గీతమై మధుర భావమై సాగాలి సామీప్యంనీ నవనీతమైన మాటలు,నా హృదయ రాగములు,ఆ రాగమాలికలే సుమగంధ మధుర భావలు…బృందావనంలో తరువుల పూ పరిమళాలు ఊసులు …ప్రజ్వలించే పరిభ్రమించే ప్రియసఖి దివ్య కాంతులు…ఈ ఉత్సాహం, ఊహ, అనుభూతితో,మన స్నేహ పల్లకీపై ఊరేగుతున్నా ఆనందరాగమై..ఎంతెంత దూరాలైన మనస్సుకు సమీప్యాలే భావం.సహచరి ఈ బంధం మన స్నేహం బంధం..హృదయ వేదికపై ప్రతిధ్వనిస్తాయి కోయిలలై…నేస్తమా, నీ స్నేహం నా జీవిత గీతం,జ్ఞానామృతం, శాంతి శ్వాసల మధురానుభూతులకే కైవసం.ప్రతి క్షణం, ప్రతి పలుకు, మన స్నేహం గీతమై !హృదయ వేదికపై ఆశయపు వెలుగుల చైతన్య రాగం… ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి నా స్వీయ రచన నాహామీ..
Read More
కం!!💐💐💐

కం!!💐💐💐

విజ్ఞానులు విద్వత్తునువిజ్ఞతతో పంచిపెట్ట వృద్ధిని జెందున్అజ్ఞానుల వెంట దిరుగవిజ్ఞత విలువలును బోవు వేగమె కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
ఆ!!వె!!💐💐💐

ఆ!!వె!!💐💐💐

నిద్ర లోని కలలు నీకేమి లాభమ్ముపగటి కలలు గనుట పనికి రాదు!కల్పనలను గనిన గట్టెక్క వచ్చనితెలుసుకోర కృష్ణ తెలివితోడ గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
అక్షరలిపి చిత్రానికి కథ

అక్షరలిపి చిత్రానికి కథ

రమా ప్రభా ప్లీజ్ రమా ప్రభా! నిన్ను ఇంకో సారి ఏమనను లేవే!నువ్వు చేసిన బంగాళ భౌ భౌ తింటానేఈ రోజుకు నన్ను వదిలేయవే! తింటాలేవే! అన్నాడు రాజబాబు..రెండు చేతులు అడ్డం పెట్టుకుని తల అడ్డంగా ఊపిందిప్రభ..ఈ మాత్రానికే ఇంతగా అలగాలా? తిననన్నాననే గానీ కంత కోపం?రాజబాబు బ్రతిమాలుతూనే ఉన్నాడుఅయినా చలనం లేదు రమాప్రభలో! మరే నీ వంటలకు పక్కింటి పద్మనాభం కూడా ఆశ పడుతున్నాడే!మనమెా పని చేద్దాం! ప్రభ గారి వంటిల్ల ని హోమ్ ఫుడ్పెడదామె భలే ఆర్డర్స్ వస్తాయి చూడు.అప్పటి వరకు అలిగి కూచున్న రమాప్రభ హుషారుగాలేచి ఉత్సాహంగా అడిగింది..నిజంగానా? అంటూ.. హా…మరేమనుకున్నావ్? పద్మనాభం ఎదురు చూస్తున్నాడు వాల్లావిడ ఊరెల్లింది కదా! హమ్మయ్య అతను తింటాడో! తినడో ! కానీ దీని అలకైతే తీరింది అనుకున్నాడు రాజబాబు.. అదేదో అనుకుంటే ఇంకేదో అయింది..రాజబాబు ఇలా ప్రచారం చేసాడో లేదో అలా ఆర్డర్లు వచ్చి రమాప్రభ వంటిల్లు ఫేమస్ అయింది..…
Read More
ఈ చేదు జీవితం పండిన ఫలాలు బహుమధురం మీకు. లక్షల అక్షరాలలో సుందర కుసుమాల రచనల సృష్టి వెనుక ,మనిషి అనేవాడు ఎన్నెన్ని గాయాల హృదయ వేదనలు యుగయుగాలుగా అనుభవించిన ధరిత్రి పై కవి ఉద్బవం నుండి ప్రపంచ వేదనను ,సౌందర్యాన్ని హృదయంలో నింపుకుని చేసిన రచనల పర్యవసానమే నీవనుకుంటున్న సంస్కృతి ,సంప్రదాయాలకు మార్గదర్శనాలు. కళలకు కొంగ్రొత్త ఆషాకిరణాలు. మహోజ్వల చైతన్య దీపాలు.అపరాజిత్

ఈ చేదు జీవితం పండిన ఫలాలు బహుమధురం మీకు. లక్షల అక్షరాలలో సుందర కుసుమాల రచనల సృష్టి వెనుక ,మనిషి అనేవాడు ఎన్నెన్ని గాయాల హృదయ వేదనలు యుగయుగాలుగా అనుభవించిన ధరిత్రి పై కవి ఉద్బవం నుండి ప్రపంచ వేదనను ,సౌందర్యాన్ని హృదయంలో నింపుకుని చేసిన రచనల పర్యవసానమే నీవనుకుంటున్న సంస్కృతి ,సంప్రదాయాలకు మార్గదర్శనాలు. కళలకు కొంగ్రొత్త ఆషాకిరణాలు. మహోజ్వల చైతన్య దీపాలు.అపరాజిత్

Read More