Blog

Your blog category

ఆ!వె!!💐💐💐💐🤦🏻

ఆ!వె!!💐💐💐💐🤦🏻

కటిక పేదలైన కడు ధనికులకున్నుమొదట బట్ట లేదు, తుదనులేదునట్టనడుమయేల పట్టుబట్టలు గట్టివిర్రవీగుచుండ్రి వెర్రివారు! బ్రతికియున్న నాడు పాతబట్ట విసరిపట్టుబట్ట కట్టు ప్రాణముడుగ!మందుమటను బెట్టు మర్యాదలంచునుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! కడవనీరు ద్రావి కాలమ్ము గడుపుచుగతకబోకు పరుల గంజినీళ్ళు!చలనచిత్రము వలె సాగించి బ్రతికినజయము కలుగవచ్చు జగతి కృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
అవిసిపోయిన హృదయాలు!

అవిసిపోయిన హృదయాలు!

విషం నింపుకున్న కళ్ళుమనసు పాశానభూయిష్టమైఅడుగు అడుగుకు విష సర్పం చూపులైకడలి తరంగాల సునామీ రక్తాక్షరియైవిలువలు కొరవడి మలిన మస్తిశ్కమైఅంగడిబొమ్మ సినీ సితారయైమండే గుండెలవిసి పోయిన గద్గద కంఠమైపూరిగుడిసెలా అడ్రస్ లేని నివాసమైవిరిసిన గులాబీ యవ్వనం అందం పగిలిన చందం!నా పగిలిన హృదయం అద్దం నిండా నీ ప్రతిబింబాలైవిరిగి నలిగిన హృదయం నిండా రక్తధారలైపేలిపోయిన ముహం పడిగాపుల సంవేదనయిబొట్లుబొట్లుగా కారే రక్తం చిరునామా నేనై!పెద్దబండరాయి పగిలిముక్కలై కరిగి తరిగి ఇసుక రేణువులైపొంగివస్తున్న లావాచింతనిప్పుల అగ్నియైవేపుడు కాయల్లా కళ్ళు వేగి వేగి మంటలసూరీడైనిద్రరాని రేయి గది నిండా పరుచుకున్న రక్తవర్ణ నక్షత్రాలైజాలిలేని లోకం వేసే బానాలు గుండెలయలు అక్షరఘంటికలైచీల్చి చెండాడే విశ్వకుబేరుల రక్తదాహానికి పావునై!రక్తం పాలుగా మారి పసివాడి దాహం తీరిస్తేఅమ్మ అన్న పదం ఒకటి కళ్ళకు నివాళి వెలుగులవుతాయి! అపరాజిత్సూర్యాపేట
Read More
ఈ రోజు అంశంచిత్ర కధ

ఈ రోజు అంశంచిత్ర కధ

శీర్షికయువత డ్రగ్స్ జోలికి పోవద్దు ఒక కాలేజీలో డిగ్రీ చదివేపూజకు కొత్త స్నేహం ఏర్పడింది. అప్పటి వరకు చదువు పట్ల శ్రద్ధ చూపేఆమె సినిమాలు, షికార్లబాట పట్టింది. చెడు సావాసం అబ్బింది.చదువు పట్ల శ్రద్ధతగ్గింది. మత్తు మందులుకూడా ఆమెకు అలవాటుఅయ్యాయి. తల్లి తండ్రులగారాబం ఆమెను మరింతపాడు చేసింది. డ్రగ్స్ ఆమెపాలిటి శాపంగా మారాయి.ఆమె బలహీనత ఆసరాచేసుకుని తోటి విద్యార్థులుఆమెను మరింత డ్రగ్స్ కుబానిసగా చేసారు. విషయంతల్లిదండ్రులకు తెలిసే నాటికిఆమె ఆరోగ్యం క్షీణించడంతో,ఆమెను ఒక హాస్పిటల్లో చేర్చారు. డ్రగ్స్ అలవాటుమాన్పించి ఆమెను మళ్ళీమామూలు స్ధాయికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఆమె చనిపోయింది. ఎంత దారుణం. పూజబంగారు జీవితంబుగ్గి పాలు అయ్యింది.మత్తు మందులు పిల్లల్నినిర్వీర్యం చేస్తున్నాయి.ఇప్పుడు నగరంలో చాలాప్రాంతాల్లో ఈ డ్రగ్స్మహమ్మారి పిల్లలనుకబళిస్తోంది. ఎవరిపిల్లలను వారు కట్టడిచేసుకోవాలి. వారిబంగారు జీవితాన్నికాపాడుకోవాలి. ఈ రచన నా స్వీయ రచనవెంకట భాను ప్రసాద్ చలసాని
Read More
జాతీయ రంగుల దినోత్సవం

జాతీయ రంగుల దినోత్సవం

అక్టోబర్ 22న, జాతీయ రంగుల దినోత్సవం నాడు మన జీవితాల్లో రంగు పోషిస్తున్న శక్తివంతమైన మరియు శక్తివంతమైన పాత్రను మనం జరుపుకుంటాము! ఈ సరదా జాతీయ దినోత్సవం అనేది రంగు మన మనోభావాలను ఎలా ప్రభావితం చేస్తుందో, ఆలోచనలను ఎలా తెలియజేస్తుందో మరియు మన ప్రపంచానికి ఉత్కంఠభరితమైన అందాన్ని ఎలా జోడిస్తుందో అభినందించే సమయం. రంగు అనేది అందరికీ అర్థమయ్యే నిశ్శబ్ద భాష. మనకు పేర్లు రాకముందే, రంగులు ఒక ప్రయోజనాన్ని అందించాయి, మనలో ఇంకా లోతుగా పాతుకుపోయిన సంకేతాలను పంపాయి. వీధి దీపం ఆకుపచ్చ నుండి పసుపు రంగులోకి ఎరుపు రంగులోకి మారుతుంది, ఒక్క మాట కూడా చెప్పకుండా ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్దేశిస్తుంది. స్నేహితుడి బుగ్గల్లో రంగు వెలిగడం ఇబ్బందిని సూచిస్తుంది, అయితే రోగి చర్మం యొక్క రంగు వైద్యులకు వారి ఆరోగ్యం గురించి ఆధారాలు ఇస్తుంది. ప్రకృతి అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రంగులతో చిత్రించడానికి అత్యుత్తమ…
Read More
అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబరు 22న జరుపుకుంటారు. 1998, అక్టోబరు 22న 'ఇంటర్నేషనల్‌ ఫ్లూయెన్సీ అసోసియేషన్‌', 'ఇంటర్నేషనల్‌ స్టట్టెరింగ్‌ అసోసియేషన్‌', యూరోపియన్‌ లీగ్‌ ఆఫ్‌ స్టట్టెరింగ్‌ అసోసియేషన్‌' సంస్థలు సమావేశమై నత్తిపై ప్రజలకు అవగాహన కలిగించటం ద్వారా దానిని నివారించవచ్చని ఒక నిర్ధరణకు వచ్చాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అక్టోబరు 22న అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పలు దేశాలు, సంస్థలు "నత్తి" నివారణ పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నత్తి అనగా అసంకల్పిత పునరుక్తుల ద్వారా ప్రసంగ ప్రవహమునకు విఘాతం కలిగించే ప్రసంగ లోపం, దీనిలో శబ్దాలు, పదాంశాలు, పదాలు లేదా పదబంధాల యొక్క పొడిగింపు అలాగే అసంకల్పిత నిశ్శబ్ద అంతరాయాలు లేదా నిరోధాలు ఉంటాయి, అందువలన నత్తి ఉన్న వ్యక్తి ధ్వనులను స్పష్టంగా పలకడం సాధ్యం కాదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం…
Read More
అక్టోబర్ 22 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 22 ప్రత్యేకతలు :⁠-

1879: బ్రిటిషు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసింది. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి. 1894: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు జననం (మ.1970). 1900: భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జననం (మ.1927). 1934: పేదల పక్షపాతిగా, నిస్వార్థ సేవకునిగా పేరొందిన మాజీ ఐఎఎస్ అధికారి ఎస్‌.ఆర్‌.శంకరన్‌ జననం (మ.2010). 1901: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ జననం (మ.1940). 1963: భాక్రా నంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు. 1966: సోవియట్ యూనియన్ లూనా 12 అంతరిక్ష నౌక ను ప్రయోగించింది. మాధవి కాళ్లసేకరణ
Read More
ప్రేమాలయం,,,,, తాజ్ మహల్,,,,,!!

ప్రేమాలయం,,,,, తాజ్ మహల్,,,,,!!

ప్రేమించు ప్రేమించబడుప్రేమ హృదయాంతరాళం నుండి పొంగే ఇరుశ్వాసల లయంఆకాశంలో విహరించే పావురాల జంటల గోరువెచ్చని ఊసులు ,బాసలు ప్రేమానుభూతుల స్పర్శలు,,,,,,,,,,షాజహాన్ తన ప్రాణేశ్వరి ముంతాజ్ అపురూప సౌందర్యరాశి ప్రేమరూపసి దూరమైతే కుమిలి కుమిలి ఆమె కోసం భువిపై ఇంతటి చిరస్మరణీయమైన అద్భుత ప్రేమాలయం ఇకపై ఏ మానవమాత్రుడు నిర్మించలేడు కదా,,,,,,,,,,పౌర్ణమి చంద్రుడి వెన్నెల విరబూసినట్లు ఈ తాజ్ లో ప్రేమామృత ధారలు ఆకర్షణీయమైన కళారూపాన్ని వీక్షించే హృదయలలో అతిస్వచ్చమైన ప్రేమలు ప్రతిధ్వనిస్తాయి,,,,,,,,,,ప్రేమలు అంతరించిపోతూ ఆకర్షణలు,అభూతకల్పనల్లో ప్రేమలేల ! ?!ఎంతటి కఠిన హృదయాలైనా కరిగినీరై ప్రేమలు పుష్పించి ఫలియించును దర్శించినంతనే,,,,,,,,,,నీ హృదయంలో ప్రేమాంకురించి మొక్కయి వృక్షమై పుష్పించి ఫలియించును వీక్షణలోనే,,,,,,,,,ఈ భరత ఖండాన్ని ప్రేమగోపురంగా తీర్చిదిద్దిన శిల్పులు, కళాకారులు, శ్రామికులు షాజహాన్ హృదయంలోని ప్రేమామృతం శాశ్వత కలల కళారూపంగా వెలసిన తాజ్ ,,,,,,,,,,,,ప్రపంచ వింతగా ఎల్లకాలం నిలిచే వజ్రతుల్య ప్రేమాలయం,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
దయలేని పూవులు,,,, ,!!

దయలేని పూవులు,,,, ,!!

పుప్పొడి రేణువుల ఆకర్షణతోవికసించిన పూవులలోని మకరందాలనుఆస్వాదిస్తూ మౌన రాగాలు తీసే తుమ్మెదా,,,,,,ఎన్నెన్ని అందాలు చిందించే పూవులలోనివిరితేనీయలు జివ్వుమని తాగేశావో,,,,,,,!నింగిలోని చందమామ కంటే అందాలొలికే గుభాళించిన పూవులునిన్ను గమనించిగానే మైమరచి సోలిపోతూతమ తనువులోని అణువణువూ పులకరించిపోగావికసించి విప్పారిన పూవులన్నీనీకోసం తమ సోయగాలను అర్పించే మైకంలోతదుపరి ఎన్నెన్ని కష్టాలు పడాలో మరచిపోయిన వెర్రిలోకన్నెపూవులన్నీ నీ కోసం తపించి తనువులు అర్పిస్తూజీవన సోయగాలలోని తేనీయలు త్రాగితున్న తుమ్మెదా,,,,,,,నీ తనువు కురూపిగా ఉన్నప్పుడు అసహ్యించుకున్న వాళ్ళే రూపంమారిలోకం దృష్టిలో ఇప్పుడు బహు సుందరాంగుడవుఓ మన్మథ రూపుడా నీ అంతం అతిత్వరలోనేకాని పూవులు ఫలదీకరణం చెందిఅందించే ఫలాలు బహుమధురం సుమీ,,,,,,,,,!!ఓ సౌందర్య పిపాసకుడా నీవు సుఖించి సుఖపెట్టిన పూవులునీ గురించిన ధ్యాసే మరచిపోయే మాయావతులుఈ వన్నెచిన్నెల పూవులు బహు మోసకారులని మరువకుజాగ్రత్త సుమీ ఓ సీతాకోకచిలుకా,,,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
శీర్షిక:”అంతకు మించి”

శీర్షిక:”అంతకు మించి”

దీపావళి అంటేఅభ్యంగన స్నానాలుఆచరించటమేనా? సాయం సంధ్య వేళదివ్వెలు వెలిగించడమేనా!! "అంతకు మించి"దీపాల వెలుగులోఆశావాదాన్ని ప్రబోధించాలి…!! దీపావళి అంటేదిక్కులు మారుమోగేలాటపాసులు కాల్చటమేనా…. "అంతకుమించి"కొత్తగా మనలనుఆవిష్కరించుకోవాలి…. మనిషిలోనిరాక్షస ప్రవృత్తికినిదర్శనమైననరకాసురుని వధించటమే"దీపావళి సంకేతం"…!! ఇలా‌…ఎన్నో అంతరార్ధాలతో కూడినవెలుగు పువ్వుల పండుగ…! అంతకు మించిదీపం లక్ష్యంవిధ్వంసం కాదు వికాసం…దీపాన్నివెలిగించవలసినదిమన గుండె గుహల్లోఅదే ..విమల విజ్ఞాన దీపం….!! అధర్మంపై ధర్మం ,అన్యాయంపై న్యాయం ,మూర్ఖత్వం పై వివేకం ,చెడుపై మంచి పైచేయిసాధించటమేనిజమైన తిమిర సంహారం…!! పురాణ గాథల సందేశంప్రాచీన రుషులు,ఆధునిక శాస్త్రవేత్తలుకన్న కలలకు..పడే తపనలకు….మనిషి సమాధానంగామారటమే కాంతి పర్వం…!! "అంతకు మించి"మనలోని అజ్ఞానమనేకాళరాత్రిని దీప రాత్రిగామలుచుకోవటంలోనేఇమిడి ఉందిభారతీయ జ్ఞాన సంపద…..!! అంతర్గతశబ్ద కాలుష్యానికి దూరంగాదురాలోచనలకు అతీతంగాఅభ్యుదయ పథంలోమనిషి అడుగిడడమేజ్యోతి ప్రజ్వలనం…!! "అంతకు మించి"లోకమంతా ఒక్క ఇల్లే అన్నకవుల భావనలుఎప్పుడు నిజం అవుతాయోఅదే…"ఆనంద దీపావళి ఆగమనం"….!!ఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
అక్షరలిపి కొరకుఅంశం – ప్రయివేటు ఉపాధ్యాయుల బాధలురచన – ఉమాదేవి ఎర్రం

అక్షరలిపి కొరకుఅంశం – ప్రయివేటు ఉపాధ్యాయుల బాధలురచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక - పరుగు సమయం ఉదయం లేవాలంటేనేబద్దకంగా ఉంటుంది కనీలేవకపోతే సమయమేసరిపోదు! లేచి పరుగులు మెుదలైతేకానీ అందుకో లేని పరిస్థితిశ్రీవారిని ఆఫీసుకి పిల్లలనుస్కూలుకి ఆ తరువాత తను! తన కోసం గడియారంఆగదు కదా! అదే సమయంఅదే రొటీను టీచరే లేటుగావెళ్తే స్టూడెంటు పరిస్థితి! అని హెచ్ ఎమ్ తో చివాట్లుఉంటుందో! ఊడుతుందో!తెలియని ఉధ్యోగం చాలీచాలని జీతభత్యం! ప్రయివేటంటే ప్రయివేటేమరీ ఆడవాల్ల స్థితి ఇంట్లోభయపడడమే బయటాభయపడడమే! ఏమైనా బాధ చెప్తే మానేయమంటాడు భర్త చెప్పకపోతేనిద్రపోనంటుంది మనసుమానేయకంటుంది చదివిన చదువు! ఇది నా స్వంత రచన.
Read More