దీపావళి పండుగ భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ రోజు చీకట్లపై వెలుగు, చెడుపై మేలుకి జయాన్ని సూచిస్తుంది. ప్రజలు తమ ఇళ్ళను శుభ్రం చేసుకుని, వెలుగులు వెలిగించి, ఆనందాన్ని పంచుకుంటారు. అయితే ఇటీవల కాలంలో దీపావళి ఉత్సవం తన అసలు ఆధ్యాత్మికతను కోల్పోయి, పటాకులు పేల్చే శబ్దపూరిత పండుగగా మారింది. దీని వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, మన ఆరోగ్యానికీ ప్రమాదం ఏర్పడుతోంది. దీపావళి సందర్భంగా విపరీతంగా పేల్చే పటాకులు వలన వాయు కాలుష్యం పెరిగి వాతావరణం విషపూరితంగా మారుతుంది. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలై ఊపిరితిత్తుల వ్యాధులు, అలెర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక, శబ్ద కాలుష్యం వృద్ధులు, చిన్నపిల్లలు, జంతువులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మన ఆనందం ఇతరుల కష్టానికి కారణం కాకూడదు. అందువల్ల మనం పటాకుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ స్నేహిత మార్గాలను అవలంబించాలి.…
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు…
ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న, మేము అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము, ఈ సంప్రదాయాన్ని 2004లో దివంగత చెఫ్ డాక్టర్ బిల్ గల్లాఘర్ స్థాపించారు, మా పాక వృత్తిని గౌరవించడానికి మరియు తరువాతి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు ఇది ఒక సంప్రదాయం. నెస్లే ప్రొఫెషనల్‌తో భాగస్వామ్యంతో వరల్డ్‌చెఫ్స్ ఈ సంవత్సరం ఉత్తేజకరమైన ప్రచారాన్ని మీకు అందించడానికి ఉత్సాహంగా ఉంది: ఫుడ్ ఎక్స్‌ప్లోరర్స్. పిల్లలను వంటల సాహసయాత్రకు ఆహ్వానించి, వంటలోని ఆనందాలను, ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను మరియు స్థిరమైన పద్ధతుల విలువను కనుగొంటుంది. తాజా, స్థానిక మరియు కాలానుగుణ పదార్థాలను అన్వేషించడం ద్వారా, మనం యువ మనస్సులలో ఉత్సుకత మరియు సృజనాత్మకతను రేకెత్తించవచ్చు, ఆహారం మరియు గ్రహం పట్ల వారి ప్రేమను పెంపొందించవచ్చు. కలిసి, మనం శాశ్వత ప్రభావాన్ని చూపగలము! ఆకర్షణీయమైన వర్క్‌షాప్‌లను నిర్వహించడం, జ్ఞానాన్ని పంచుకోవడం మరియు మీ కమ్యూనిటీలోని పిల్లలకు చిరస్మరణీయ అనుభవాలను సృష్టించడంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చెఫ్‌లతో…