Blog

Your blog category

అక్షరలిపిరచయితలు🌷అంశం- ప్రైవేట్ ఉపాధ్యాయులుశీర్షిక- నిరంతర అక్షర శ్రామికులుడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం📒📒📒📒📒📒📒📒📒📒ప్రతీసారి గడియారమే చూస్తారు, నేర్పే మనసుకు జీతమేరా?లోనుంచి వెలుగులా రగిలేరు, వెలిగించేది మరొక భవిష్యత్తా!

అక్షరలిపిరచయితలు🌷అంశం- ప్రైవేట్ ఉపాధ్యాయులుశీర్షిక- నిరంతర అక్షర శ్రామికులుడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం📒📒📒📒📒📒📒📒📒📒ప్రతీసారి గడియారమే చూస్తారు, నేర్పే మనసుకు జీతమేరా?లోనుంచి వెలుగులా రగిలేరు, వెలిగించేది మరొక భవిష్యత్తా!

కాగితాల్లో కాదు వారి త్యాగం, కన్నుల్లో దాగిన బాధా,“నువ్వు సాధిస్తావు” అని పలికే, అపరిచితుడైనా ఆదారమా! జ్ఞానదీపం చేత పట్టి, దిక్కులేని దీపికవుతారు,స్వప్నాల గుమ్మానికి తాళం వేసి, తాళం తెరచి చూపిస్తారు! గంటలారా కడుపు నింపే, గుండెలారా గౌరవం కోరే,ఎవరి జీతమే కొలవగలదు, వారి శ్రమ ప్రేమ ఎదోనోనే! పలుకుల వెనక పల్చని నిట్టూర్పు, “నా మాట వినిపించిందా?”తెచ్చే ప్రతి మార్కులో దాగి, వారి గర్వం సంతృప్తి కదా! ఇంటి కిటికీలో ఆటురమైన, పుస్తకాల గూటి వెలుగులు,ఎన్నో పిల్లల కలలకు మారే, పాదరసం వంటి రోజులు! జీతపు చిట్టీలలో చిన్నవారైనా, జ్ఞానపు గడ్డిలో దివ్యవృక్షాలు,తమ ఊపిరితోరాసే పాఠాలు, కాలంతో నిలిచే చిరునామాలు! సర్టిఫికెట్ కాగితమైతే, మనసే నిజమైన పాఠ్యపుస్తకం,“మరచిపోకు గురువుని” అని, కర్మకి కట్టే సంకేతం!వందనం ప్రతి ప్రైవేటు గురువుకి,ఉచితం కాని సేవకూ,మాటల్లో కొలవలేని విలువకూ!📕📒📕📒📕📒📕📒📕📒ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం
Read More
అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం

గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పాత్ర మరియు పరిస్థితిని హైలైట్ చేసే లక్ష్యంతో, అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అమలు చేసింది మరియు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. మొదటి అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవాన్ని 1995 అక్టోబర్ 15న జరుపుకున్నారు మరియు దీనిని WWSF (మహిళల ప్రపంచ సమ్మిట్ ఫౌండేషన్) ప్రోత్సహించి నిర్వహించింది. పది సంవత్సరాల తరువాత, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 18, 2007న తీర్మానం 62/136పై సంతకం చేయడంతో అధికారికంగా తేదీని ఆమోదించింది. గ్రామీణ ప్రాంతంలో నివసించే మరియు పనిచేసే ఏ స్త్రీనైనా గ్రామీణ మహిళ అంటారు. వారిలో ఎక్కువ మంది జీవనోపాధి కోసం సహజ వనరులు మరియు వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు మరియు తరచుగా రైతులు, వ్యవస్థాపకులు లేదా అధికారిక లేదా అనధికారిక వ్యవసాయ కార్మికులు. ప్రపంచ జనాభాలో 25% మరియు ప్రపంచ వ్యవసాయ శ్రామిక శక్తిలో 43% ఉన్నప్పటికీ, భూ…
Read More
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 15న నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అతిసార, శ్వాస కోస వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించింది. తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయించడంచేతి శుభ్రతపై అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని చెప్పడం. ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా చేతులు - పరిశుభ్రత కార్యక్రమం అమలుప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 2015లో మధ్యప్రదేశ్‌ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది. అక్టోబర్‌ 15న రాష్ట్రంలోనే 51 జిల్లాల నుంచి…
Read More
అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. అంధుల జీవితంలో తెల్లటి చేతికర్ర ప్రాముఖ్యతను, అంధత్వ అవగాహనను పెంచడానికి ఈ రోజును ఐక్యరాజ్యసమితి 1981లో స్థాపించింది. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు . కంటిచూపుతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు . కనుసన్నల్తో ఆ ప్రపంచం లో బతికేయవచ్చు . అదే చూపు లోపిస్తే అంతా అంధకారమే . జీవితం చీకటిమయం అయిపోతుంది . రంగుల ప్రపంచము సుదూరతీరాలకు వెళ్ళిపోతుంది . ఆ కటిక చీకటిలో ఆ తీరము ఎప్పటికీ అందకుండానే మిగిలిపోతుంది. అందుకే ఆ చూపును ఎప్పుడూ పదిలం గా కాపాడుకోవాలి . అంధత్వము అంటే పూర్తిగా గాని పాక్షికం గా గాని చూడలేని స్థితి. కంటి చూపు పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును. దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు మరియు అంధత్వ…
Read More
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం

ప్రపంచ విద్యార్థుల దినోత్సవం

దేశానికి చేసిన సేవలకే కాకుండా, దేశ యువత పట్ల ఆయనకున్న అభిమానానికి కూడా ప్రసిద్ధి చెందిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికలపై భారతదేశం యొక్క ప్రతిష్టను విప్లవాత్మకంగా మార్చారు. తన జీవితకాలంలో వేలాది మందికి గురువుగా పనిచేసిన కలాం పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్ కలాం 79వ జన్మదినోత్సవం సందర్భంగా, ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 15వ తేదీని "ప్రపంచ విద్యార్థుల దినోత్సవం"గా ప్రకటించింది, ఎందుకంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రజలు ఒక గురువుగా గుర్తుంచుకోవాలని తన భావాలను వ్యక్తపరిచారు. పేద మరియు ముస్లిం నేపథ్యానికి చెందిన (కాలక్రమేణా అతని కుటుంబం వారి సంపద మరియు ఆస్తులను కోల్పోయింది) విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మరియు ప్రేరేపించే క్షణాలతో నిండిన ప్రయాణం ఆ దార్శనిక నాయకుడి జీవితం. కలాం తన పోరాటాలను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాష్ట్రపతి అయిన తర్వాత…
Read More
అక్టోబర్ 15 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 15 ప్రత్యేకతలు :⁠-

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం. 1542 : మొఘల్ చక్రవర్తి అక్బర్‌ సింధు ప్రాంతంలోని అమర్‌కోట్‌లో జన్మించాడు (మ.1605). 1908 : ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ జననం (మ.2006). 1918 : భారతీయ అధ్యాత్మిక గురువు, హిందూ, ముస్లిం ల ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా పరమపదించాడు (జననం తెలియదు). 1918 : సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయం ప్రకాశం జిల్లా వేటపాలెం లో ప్రారంభం. 1920 : ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత భూపతిరాజు విస్సంరాజు జననం (మ. జూన్ 8, 2002). 1929 : ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జననం.(మ.2012). 1931 : భారత దేశపు మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జననం.(మ.2015). 1937 : స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్ నెమిలి పట్టాభి రామారావు మరణం (జ.1862). 1964 : చైనాలో…
Read More
మహమ్మద్ రవూఫోద్దీన్ అంశం యుద్ధం ముగిసిందా

మహమ్మద్ రవూఫోద్దీన్ అంశం యుద్ధం ముగిసిందా

శీర్షిక: యుద్ధం- అద్దం యుద్ధం ముగిసిందిప్రపంచం మురిసిందిఇన్నాళ్లు మరిచిందిఇప్పుడు అచట ఏం మిగిలింది? మట్టి దిబ్బలుశవాలు గుట్టలుమూయలేము -మోయలేమురండి!కలిసి కన్నీరుతో ఖననం చేద్దాం నిలపలేము ఆపలేముఏమీ మలపలేమురండి!కలసి తలంపులలో నిలుపుదాం మాట పోదుమూటలేదురండి!కలిసి ముచ్చట పెడదాం శాంతి బాటలేదుజాలి ఊట లేదురండి!ప్రేమ తోట పువ్వులు పూయిసాదాం అచట నవ్వు లేదుపూచే పువ్వు లేదురండి!కలిసి శాంతి గువ్వలు ఎగిరేద్దాం అచట ఆబాది లేదుబర్బాదికి లెక్కలేదురండి!ఖదం మిలకే యాద్ చేద్దాం ముసలి కన్నీరు కార్చేఓ! అగ్రరాజ్యమా! గుండె గాయాలకుతీపి మాటలసాంత్వనా లేపనంఎన్నాళ్లు పూస్తావ్ బిక్కుబిక్కుగాభయం భయంగారాలిపోతున్న బతుకులకుకల్లబొల్లి కబుర్లు ధైర్యంఇంకెన్నాళ్లు నూరిపోస్తావ్ నిరాశ నిస్పృహలగుండె అలలు తన్నుకొస్తుంటేఆశల మట్టి ఆనకట్టలుఇంకెన్నాళ్లు కడతావు యుద్ధం ముగిసిందిప్రతిబింబం చూపే అద్దం అలిగింది ఇది నా స్వీయ రచన
Read More
ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం,,,,,,,,!!

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం,,,,,,,,!!

ప్రేమికులిరువురి స్వచ్ఛమైన ప్రేమవెన్నెలల్లిన హృదయాల కోవెలలలిత లలిత లాలిత్య కుసుమ కోమలం హృదయాలు,,,,,,,నిజమైన ప్రేమ గుభాళించే పూవుల్లా స్వచ్ఛమైనదిఆ ప్రేమ శారీరక సుఖాన్ని కోరదుఇరువురి హృదయాలు వికసించి పరిమళించే కమలంలా పవిత్రమైనది ప్రేమ,,,,,,శారీరక ఆకర్షణలు, కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల,,,,,,ప్రేమ హృదయంలో గూడుకట్టుకున్న మధురమైన స్వప్నాల కళానిలయం,,,,,,,,కొన్ని విషయాల పట్ల ఆకర్షణ త్యజిస్తేనే ప్రేమ అమృతం కురుస్తుంది,,,,,,,,,,హృదయంలో పన్నీటి జీవజలములు పారే సెలయేరు ప్రేమ,,,,,,,,,,హృదయంలో దివిలోని పారిజాతం పుష్పించి గుభాళించే మధురమైన భావన ప్రేమంటే,,,,,,,,,హృదయంలో కృష్ణవేణి తరంగాలలో సాగే మురళీరవం ప్రేమ,,,,,,,,,,హృదయంలో వీణుల కింపుగా కోయిలతీసే రాగం తేనీయలు ప్రేమంటే,,,,,,,,,సముద్రమంత లోతైన హృదయాలలో వీచే మలయమారుతాలలో ఎగిరే పక్షుల జంటల ఊసులు పక్వమైన ప్రేమ,,,,,,,,,,,ప్రేమ ఎప్పుడూ ఓటమి ఎరుగదు భువి నుండి దివిదాకా హృదయాలు పాడే సుమధుర గీతాంజలి,,,,,,,,,,ఆలోచనలకు అందని రూపంలో హృదయంలో నెలవైనది సిసలైన ప్రేమ,,,,,,,,,అందుకే నిజమైన ప్రేమ పెళ్ళికి చిరునామా కాదు,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!వె!!💐💐💐

ఆ!వె!!💐💐💐

దుష్ట తలపులున్న దూరమౌ విజయమ్ముప్రతిఘటించి చూడ ఫలితమందు!పడినచోటు నుండిపైకిలేవని యెడచేరలేము విజయ తీరమునకు!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
చిత్ర కవితా పోటీమహమ్మద్ రవూఫోద్దీన్≠===========స్త్రీ (సిరి)

చిత్ర కవితా పోటీమహమ్మద్ రవూఫోద్దీన్≠===========స్త్రీ (సిరి)

జననం నుండి మరణం వరకుఉయ్యాల నుండి పాడే వరకుతల్లిగా చెల్లిగాకూతురుగా భార్యగాలాలిత్యం మాతృత్వంమిత్రత్వం ప్రేమతత్వంరూపం ఏదైనాజీవన అర్థంమానవ జన్మ పరమార్థం నేర్పు ఓర్పుసంసార కూర్పుబాంధవ్య సఖ్యతమూర్తిసకల సౌఖ్యాల త్యాగమూర్తి దైవ సృష్టిలోఉత్కృష్టంతల్లి గర్భంలోనేఆమె శ్వాసను శాసించేఓ!మనిషి నీ ఆలోచన నికృష్టం ఇది నా స్వీయ రచన
Read More