అక్షర దీపావళి పోటీ కొరకుఅంశం :- సామాజిక దీపావళితేది:- 14/10/2025శీర్షిక:- హృదయంలో ఆశ అనే దీపం
రవి తన స్నేహితుడు విజయ్ ఇద్దరూ పట్టణంలో ఉద్యోగాలు చేసే యువకులు. దీపావళి అంటే వారికి కొత్త బట్టలు, పిండి వంటలు, ఖరీదైన టపాసులు మాత్రమే. కానీ , ఈసారి రవి తండ్రి ,"దీపావళి అంటే చీకటిని తరిమేయడం. నీ చుట్టూ ఉన్న చీకటిని కూడా తరిమేయాలి"అని చెప్పారు. ఆ మాట రవి మనసులో బలంగా నాటుకుంది."విజయ్! ఈసారి మనం దీపావళిని కొత్తగా జరుపుకుందాం. కేవలం మన ఇల్లు మెరిస్తే చాలదు, మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా వెలుగులు నిండాలి" అన్నాడు రవి.వారు మొదటగా తమ ఇంటికి దగ్గరలో ఉన్న మాతృఛాయ అనే వృద్ధాశ్రమానికి వెళ్లారు.అక్కడ ఉన్న వృద్ధులలో చాలా మందికి తమ కుటుంబ సభ్యులను కలుసుకోలేదనే బాధ, ఒంటరితనం వారి కళ్ళలో కనిపించాయి.రవి, విజయ్ ఆ రోజు ఉదయమంతా అక్కడే ఉన్నారు. వృద్ధులకు కొత్త బట్టలు అందించి , రుచికరమైన మిఠాయిలు తినిపించారు.వారితో కలిసి సరదాగా ముచ్చటించారు ,…