Blog

Your blog category

ఉ!!మా!!🚩🚩🚩🚩🚩

ఉ!!మా!!🚩🚩🚩🚩🚩

మానస మందిరమ్మునయుమాపతి యీశ్వర నిన్ను నిల్పితిన్మానక నిత్యపూజలను మానితమంచును చేయుచుంటి నేమానక ధ్యానమంత్రముల మండల దీక్షను పూనియుండగన్మానితి వేమయా శివుడ మమ్ముల గావర యంబరీషుడా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
అక్షర లిపి

అక్షర లిపి

తేదీ: 11/10/2024 అంశం : మహిళల అభివృద్ధి ఎటువైపు శీర్షిక : తరతరాలలో మహిళలు (వ్యాసం) రచన : విత్తనాల విజయకుమార్హైదరాబాద్9985117789 ఈ వ్యాస రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను •••••••••••••~• ఆటవిక రోజులలో ఎలా ఉండేదో చదివాము. పురాణేతిహాసాలలో ఏమున్నదో విన్నాము - వింటున్నాము - వింటూనే ఉంటాము. నాగరికత వివిధ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి చెందిందో చూసాము - చూస్తున్నాము - మరింత ఊహిస్తాము. ఆటవిక రోజులు పూర్తిగా అవసరాలపై ఆధారపడిన రోజులు. బలవంతులు బలహీనులపై పెత్తనం చలాయించిన రోజులు. అక్కడ ఎక్కడ చూచినా అధికంగా అన్యాయం జరిగింది మహిళకే. అయితే మహిళలు అంతరించిపోలేదు. అలా జరిగే అవకాశమే లేదు. మహిళలు అవసరం చాలా ఎక్కువ. మహిళలను వాడుకున్నారు. అవసరాలకు వాడుకున్నారు. బలహీనులు బలవంతులకు దాసులయ్యారు. అది ఆటవిక సమాజం. అందులో అసహజత్వం ఏమున్నది! దానినే అసహజంగా చూపడానికి ఓ కల్పిత దృశ్యాన్ని ఆలోచించి చూడండి.…
Read More
సీ!!🚩🚩🚩💐

సీ!!🚩🚩🚩💐

నీదివ్య నామమ్ము నే స్మరించిన యెడనాజన్మ తరియించు నాగభూష!!నీ పాద పద్మాలు నే మ్రొక్కినంతనేనాపాపములు బోవు నాదిదేవ!!నీ చుట్టు తిరుగుచు నేపూజ జేసిననా కర్మ కడతీరు నాగచూడ!!నీలింగ రూపాలు నే ప్రతిష్టించుచునేపొంగి పోయెద నీలకంఠ!! ఆ!వె!!🚩🚩🚩 చావుపుట్టుకలను శాసించు నటరాజబుద్ధిబలమునొసగు భూతనాథ!రేయిపవలు గావు రేపాల పురవరనిన్నుదలవ మాన నిజము శివుడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
తీయని స్వప్నం

తీయని స్వప్నం

రాత్రి నాకు నిద్రలోవచ్చిన స్వప్నంలోనా కవితల అక్షరాలన్నీగాలిలో తేలియాడుతూసన్నని కన్నీటి చినుకులు కురుస్తూనా కవితలన్నీ ఆత్మ జ్యోతులైఅప్సరసలు ఆత్మతత్వరసరమ్య గీతాలు ఆలపిస్తున్నాయివినీల గగనం శోభిళ్ళుతోందినీ దుఃఖిత జీవితాన్నంతాఅంతర్ముఖునివై ఆత్మీయంగాఆత్మజ్యోతి వెలుగులోసౌందర్య గీతాలు లిఖించివినీల గగనం నిండాగాలిపటాల్లో ఎగరేయిఆలపించడానికి మేము సిద్ధంఅందుకే ఆత్మ జ్యోతిలా వెలగనీనిరాశ ఎల్లప్పుడూ నీడలానే మిగలాలిఅని ప్రభోదించిన అనంతకోటినక్షత్రాలలో అంతర్థానమైనాయి,,,,,అప్సరసలు,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
ఆడపిల్ల కామాంధులకు పెట్టే చితి

ఆడపిల్ల కామాంధులకు పెట్టే చితి

అమాయక ఆడపిల్లలచుట్టూ మృగరాక్షసులుముళ్ళ పొదలపై నడక నేటి ఆడపిల్లలుఅక్షర జ్ఞానంలేని మూఢులుకామపిశాచాలు తలలో తిరుగుతూచదువులలో మేటైనసున్నిత మనస్కులు ఆడపిల్లలపైఒంటరినిచేసి అకృత్యాలకు పాల్పడే జులాయిలుమదమాత్సర్యాలతో మూసుకుపోయిన కళ్ళుఆడపిల్లల మాణప్రాణాలకురక్షణలేని సామాజంనీచనికృష్ట సంస్కృతిలోసంప్రదాయ కుటుంబాలలోనిఅమాయక ఆడపిల్లలు మణలేని దుస్థితిఈ ఆడపిల్లలు విజ్ఞాన గనులునైతికవిలువల మధ్య పెరిగినచదువుల సరస్వతులులోకంలో ఇలాంటి నీచులుపుట్టగానే ఉగ్గుపాల బదులుగాడిదపాలు తాగిన మొరటు మృగాలుతాగుడు ,తిండి తైతక్కలు తప్పచదువుల విలువలు,జ్ఞానం లోతులు తెలియనినికృష్ట కలియుగ దుశ్శాసనులుచదువుల కోవెల చుట్టూవెర్రిగంతులు వేసే పిశాచాలుఅంతవరకు ఏమీ తెలియని అమాయక అమ్మాయిల పాలిటయమకింకరులు ఈ దున్నపోతులుఈ క్రూరమృగాలను ఎక్కడికక్కడఏరిపారేయడమే తక్షణ కర్తవ్యంఅయితే ఎన్ కౌంటర్ చేయడంతోనేఈ అకృత్యాలు సమసిపోవుఓ పదేళ్ళపాటు నీతి ,నియమాలుసామాజిక విలువలు, కట్టుబాట్లు గలనీవు మనిషివి సమాజంలో నివాసిస్తున్నావుక్రూరమృగాలు సంచరించే దండకారణ్యంలో కాదుఇలాంటి చిత్రాలను ప్రదర్శిస్తూమానవత్వం ప్రభోధించే జీవనవిధానంప్రభోదించాలి చెరసాలలో వేసిజీవనశైలి రుచిచూపించాలిలేనిదే సమసమాజం ఎన్నాళ్లకు మారదు,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రపంచ గంజి దినోత్సవం

ప్రపంచ గంజి దినోత్సవం

ధాన్యాలు లేదా చిక్కుళ్ళు నీటిలో లేదా పాలలో ఉడకబెట్టడం ద్వారా తయారు చేయబడిన ఒక సాధారణ వంటకం గంజి, శతాబ్దాలుగా ఆహార ప్రధానమైనది. దీని మూలాన్ని పురాతన ఆఫ్రికా మరియు ఆసియాలో గుర్తించవచ్చు మరియు కాలక్రమేణా, ఇది వివిధ రకాల ధాన్యాలు మరియు ప్రాంతీయ రుచులను చేర్చడానికి పరిణామం చెందింది. అక్టోబర్ 10న జరుపుకునే ప్రపంచ గంజి దినోత్సవం 2009 నుండి గంజి అనే ప్రత్యేకమైన మరియు రుచికరమైన వంటకానికి అంకితం చేయబడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు ఆహారం అందించడంలో సహాయపడే స్కాట్లాండ్‌లోని ఆర్గిల్‌లో ఉన్న మేరీస్ మీల్స్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం నిధులను సేకరించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రపంచ గంజి దినోత్సవం 2023 నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 7 అత్యంత ప్రసిద్ధ గంజిల మా క్యూరేటెడ్ జాబితాను అన్వేషించండి. కయు, ఓకయు రైస్ గంజి అని కూడా పిలుస్తారు, ఇది జపాన్‌లో…
Read More
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (అక్టోబర్ 10) అనేది ప్రపంచ మానసిక ఆరోగ్య విద్య, అవగాహన మరియు సామాజిక కళంకానికి వ్యతిరేకంగా వాదించడానికి ఒక అంతర్జాతీయ దినోత్సవం. దీనిని మొదటిసారిగా 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చొరవతో జరుపుకున్నారు , ఇది 150 కంటే ఎక్కువ దేశాలలో సభ్యులు మరియు పరిచయాలతో కూడిన ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ. ఈ రోజు, ప్రతి అక్టోబర్‌లో, వేలాది మంది మద్దతుదారులు ఈ వార్షిక అవగాహన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వస్తారు , ఇది మానసిక అనారోగ్యం మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై దాని ప్రధాన ప్రభావాలపై దృష్టిని ఆకర్షించడానికి వస్తుంది. అదనంగా, ఈ రోజు మానసిక ఆరోగ్య నిపుణులు తమ పనిపై చర్చించడానికి మరియు వెలుగు నింపడానికి అవకాశాన్ని అందిస్తుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యతనిస్తుంది. కొన్ని దేశాలలో ఈ రోజు ఆస్ట్రేలియాలో మానసిక ఆరోగ్య వారం వంటి అవగాహన…
Read More
అక్టోబర్ 10 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 10 ప్రత్యేకతలు :⁠-

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. 680: ముహమ్మద్ ప్రవక్త మనుమడు హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ మరణం (జ.626). 1731: బ్రిటిష్ తత్వవేత్త, శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ జననం (మ.1810). 1906: భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ జననం (మ.2001). 1908: అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు ముదిగొండ లింగమూర్తి జననం (మ.1980). 1960: తెలుగు సినిమా ప్రతినాయకుడు, హాస్యనటుడు రఘు బాబు జననం. 1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు. 2011: భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ మరణం (జ.1941). మాధవి కాళ్లసేకరణ
Read More
ఒక ఆర్థికశాస్త్రం (Economics) ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,నేను పనిచేసే కాలేజీలో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,కానీ ఈమధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది…!!ఎలా అని అడిగారు మిగతా వాళ్లు…!!

ఒక ఆర్థికశాస్త్రం (Economics) ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,నేను పనిచేసే కాలేజీలో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,కానీ ఈమధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది…!!ఎలా అని అడిగారు మిగతా వాళ్లు…!!

ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,క్లాస్ లో ఒకరికి టాప్ ర్యాంక్, ఇంకొకరికి లీస్ట్ ర్యాంక్ కాకుండా అందరికీ ఒకటే సమానమైన ర్యాంక్ ఇవ్వండి అన్నారు, OK అన్నాను…మీ అందరి మార్కులు కలిపి average తీసి క్లాసు మొత్తానికి ఒకే రాంక్ ఇస్తా అన్నాను. మొదటి సెమిస్టర్లో average ర్యాంక్ "B" వచ్చింది అందరికి, 2 nd సెమిస్టర్లో అందరికి "D" ర్యాంక్ వచ్చింది, 3rd సెమిస్టర్ లో అందరికి "F" వచ్చింది, ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,స్టూడెంట్స్ అందరూ అవాక్కయ్యారు, బాగా కష్టపడి చదివేవాళ్ళు… ఎవరికోసమో మేము చదవడమెందుకు అని చదవటం మానేశారు, చదువు మీద శ్రద్ధ లేనివాళ్ళు… ఎలాగూ తెలివికల వాళ్ళు చదువుతారు కదా, ఇక మేమెందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు, ఈ ప్రయోగంలో నాలుగు విషయాలు తేటతెల్లమవుతున్నాయి. చట్టం ద్వారా పేదవాడిని సంపన్నుడిగా చేయలేము,కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా…
Read More
నా హృదయ సంద్రం ఘోష,,,,,!!

నా హృదయ సంద్రం ఘోష,,,,,!!

ఉదయ సంద్రం తీరందాటి ఉబికి వస్తున్న కెరటాల ఘోషనా కన్నీళ్ళు అక్షరాలలో ఉప్పొంగే హృదయ సముద్రం పాడే గీతాలు,,,,,హృదయం లోతుల్లో గెలికితే లక్షల అక్షరాలు నీకోసం ప్రళయ గీతాలు లిఖిస్తాయి,,,,,,,,సముద్రమంతా అల్లకల్లోలం నా గుండె లయల ఢమరుకంలో,,,,,,,దుఃఖిత కళ్ళల్లో ఊపిరులూదే శ్వాసాలు నా అక్షరాలు జీవం పోసుకుని రక్తం సిరాతో లిఖిస్తాయి,,,,,,,,,నా హృదయ సముద్రం నిండా స్వప్నాల కెరటాలలో ఊగిసలాడే జాగృత కళా చిత్రాలే,,,,,,,,,,,నా గళం పాడే విషాద గీతాలు హృదయ సంద్రం నిండా అక్షరాలలో పరుచుకున్నాయి,,,,,,,,,నా మనస్సులో మెదిలే భావాలు గతితప్పిన జీవితాల గుండె కోతలను అక్షరీకరించలేని హృదయం ఘోషలు,,,,,,,,సాగరమంత లోతైన అఘాదాలు నా ప్రాణాలను తోడేసే భావనలు నైరాశ్యంలో మగ్గిమగ్గి పెల్లుబికి వస్తూ అక్షరీకరించమని వేడుకుంటున్నాయి,,,,,,,,,,ఈ జీవితం మీద మమకారం తగ్గని ఈ శరీరం నన్ను విడువకని నేను వ్రాసే అక్షరాలకు సంకెళ్ళు వేస్తూ ఆరోగ్యం కోసం కొన్ని వదులుకోక తప్పదని గుండె కోతలకు లేపనాలు పూస్తోంది,,,,,,,,,,అక్షరాలే లక్షలని…
Read More