పగబట్టిన పడుచు !
కళ్ళు భగభగ మండే కాగడాలైజనం గుండెలవిసి పోయే మాటలకు కర్ణభేరి పేలి భగ్గుమనగాగుండెల్లో కణకన మండే మంటల సూరీడు వెర్రెక్కించగామగ మృగాళ్ల పైశాచిక కృత్యంలో ఓ మహిళ మాన ప్రాణాల రక్షణలేని సృజియించిన జన్మ ఆ సృష్టికర్త రాక్షసుడై ఉండాలిబ్రతకలేక చావలేక జీవశ్చవమైన ఆడదిపగిలి బీటలుపడి అగ్నిగోళాలు రగులుతున్న గుండెలతోఒక్కో మగపురుగును తెగనరికేందుకుకురులు వీరబోసుకుని జ్వాలాముఖియైవెర్రిది పిచ్చిది అనే లోకం నడిరేయి కన్నుమూసాకగండ్రగొడ్డలి చేతబూని మగ రాక్షసు లొక్కొక్కడిని కసితోఖండఖండాలు చేసి కాకులు గద్దలకు ఆహారంగా వేసేది ఆ స్త్రీయేనిప్పుల కాష్టంలో మృగాళ్లను సజీవ దహనం చేసేది ఆ అబలేతన నొసటి రాత రాసిన బ్రహ్మ దిమ్మతిరిగి కళ్ళుతిరిగి పడిపోవలసిందేతన చూపులిపుడు సురకత్తుల బాకులులోకంనుండి వెలివేసిన పడుచు పగబట్టిన పులి సంచారంలోకం మురికి కూపంలో దొర్లే పందులుసత్యవంతులు నూటికో కోటికోఅగ్నిశిఖయై నరకటమే తన మార్గమిపుడునిప్పులు రాజేసి మృగాళ్లపై గుమ్మరించడమే తన ధ్యేయమిపుడుఆడది అబల కాదు నీ పంచేంద్రియాలను కాల్చి బూడిద చేసే…