Blog

Your blog category

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు. అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1966 సెప్టెంబర్‌ 21 నుండి 15 రోజుల పాటు పారిస్‌లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది. 'స్టేటస్‌ ఆఫ్‌ ది టీచర్స్‌' పత్రాన్ని ఆమోదించిన అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతిఏటా సమీక్షించాలని నిర్ణయించింది. ఈ రోజున ఒక విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు లేక పలు విద్యాసంస్థలలో పనిచేసే…
Read More
అక్టోబర్ 05 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 05 ప్రత్యేకతలు :⁠-

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము. 1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మరణించారు. 1929 : భారత లోక్‌సభ సభ్యుడు గుడిసెల వెంకటస్వామి జననం (మ.2014). 1932 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాధవ్ ఆప్టే జననం (మ.2019). 1946 : ప్రముఖ సినిమా నటి రమాప్రభ జననం. 1952 : సామాజిక కార్యకర్త, రచయిత కంచ ఐలయ్య జననం. 1975 : ప్రముఖ ఇంగ్లీషు నటి, గాయని కేట్ విన్‌స్లెట్ జననం. 1989 : దలైలామాకు నోబెల్‌ శాంతిబహుమతి వచ్చింది. 2001 : ప్రముఖ సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం (జ.1910). 2011 : యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌ చైర్మెన్, సీఈఓ స్టీవ్ జాబ్స్ మరణం (జ.1955). మాధవి కాళ్లసేకరణ
Read More
జ్యోతిర్మయం జ్ఞానం

జ్యోతిర్మయం జ్ఞానం

దీపంజ్యోతి కిరణాల వెలుగులలోమది ప్రజ్వలనాలు అక్షరాల జ్వాలలుతిమిరాలను చీల్చుకునిదీపశిఖలో దివ్య తేజస్సుఅక్షరజ్యోతి కిరణాల పసిడి పూవులు విజ్ఞాన గనులుఅక్షరాలు కాంతులు వెదజళ్ళుతూమూఢ మనస్కులలో నిఘోడంగారగిలే ఆత్మపరిశీలనలుఈ జ్ఞానజ్యోతి హృదయం వికసించేనుపుస్తక పఠనం, లిఖించే జ్ఞాన ప్రకాశినులుజీవితంలో నూతన అధ్యాయంఆత్మగూడులో చైతన్య ప్రజ్వలనలుఉప్పొంగే మెరుపుల అలలు అక్షర సంద్రంలోవికసించిన పూవులు విజ్ఞాన జ్యోతులుకారుచీకట్లలో సృజనలు జ్ఞానగ్రాహ్యాలుఆర్ద్ర ఉదయినులు అక్షరీకరణంలోఅక్షరోద్యమంతో తెరిపించే చీకటి మనస్సు పొరలుఅజ్ఞానాంతకములు దేదీప్యమానం స్వప్నాల తేజస్సులుఅద్భుత ప్రతిభలు లిఖించే జ్ఞానప్రభలుహృదయం గుహలో యశో విజ్ఞానజ్యోతిగమ్యం చేర్చును జీవితప్రస్థానంఒకో అక్షరం ఒకో దివ్వె ఒకో దివ్యగ్రంథంలిఖించే అక్షరాల జ్యోతి క్రింద శతకోటి సంపుటాలుకావ్యఖండాల నిండా తేజస్సులు అక్షర సత్యాలుఉత్తుంగ తరంగాలు జ్ఞానజ్యోతి క్రింద పఠనలు ,రచనలు కిరణాల వెలుగులలో సాలోచనలుదీపంజ్యోతి కిరణాలలో ఆత్మపరిశీలనలు ఆత్మజ్యోతి తంత్రులు జగత్తు నిండా తేజరిల్లే మౌని జ్ఞానవిప్లవాలు,,,,,,కళ్ళు వెలుగు వసంతాలలో జీవనయానం కొనసాగుతూ దివ్యగ్రంథాల ఆవిష్కరణలు ఆత్మతత్వం లోతుల్లోని తేజస్సులు పసిడిపూవులు అక్షరాలు జ్ఞానజ్యోతి వాడికిరణాలు,,,,,,,,,,,…
Read More
ఉ!మా!!💐💐💐

ఉ!మా!!💐💐💐

పద్యము నేర్చుచుండగను పండితులెల్లరు మెచ్చుచుండగన్!విద్యల నభ్యసించినను వేగిరమే గురుమూర్తి నచ్చగన్!గద్యము రాసినంత ఘన కార్యము గాంచుచు మెచ్చినంతలోమద్యము చేతబట్టగ కుమారునికేలని తండ్రి తిట్టెనే! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
చిత్రానికి వ్యాఖ్య

చిత్రానికి వ్యాఖ్య

ఊదరంగు ఉడుపులూరించు పెదవులుతగిన మేనికాంతి తళుకులీనకోరుకున్నవాని కోర్కెతీర్చెదనంటుపార్కునందు నిలిచె పర్సుచేత ! .......... కోట .
Read More
ఈ రోజు అంశంసమాజంలో జరుగుతున్న అకృత్యాలు ,వాటి పరిష్కారాలు*

ఈ రోజు అంశంసమాజంలో జరుగుతున్న అకృత్యాలు ,వాటి పరిష్కారాలు*

శీర్షికఅందరు పిల్లల్ని చదువించాలి మనమంతా సమాజంలోభాగమే. సమాజంలో కొన్నిఅకృత్యాలు జరుగుతున్నమాట నిజమే కానీ అవిజరగడానికి సమాజంలోఉన్న వారందరూ బాధ్యులుకారు. కొంత మంది తమస్వార్ధం కోసం ఆ అకృత్యాలుచేస్తున్నారు. అందులోబాల కార్మిక వ్యవస్థ ఒకటి.బాగా చదువుకోవాల్సిన వయసులో పిల్లలతో పనిచేయించటం సరి కాదు.చిన్న పిల్లలు కుటుంబఆర్ధిక సమస్యల వల్లచదువు మానేసి వేరేఇళ్ళలో, హోటళ్ళలో,పరిశ్రమల్లో పనిచేస్తూఉన్నారు. ఈ విషయంపట్ల ప్రభుత్వం సరైనశ్రద్ధ పెట్టి బాలలంతాచక్కగా చదువుకునేవిధంగా పరిస్ధితులుకల్పించాలి. ప్రభుత్వపాఠశాలలను అభివృద్ధి చేసి, పిల్లల్ని చక్కగాతీర్చిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. అలాగేవాలంటరీ సంస్ధలుపిల్లల చదువు పట్లఎక్కువ శ్రద్ధ పెట్టాలి.చిన్న పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు కూడానేర్పించాలి. చిన్న పిల్లల బాల్యాన్ని చిదిమేసి వారితోపని చేయించుకునే హక్కుఎవరికీ లేదు. చదువుకునేహక్కు పిల్లలకు ఉంది. ఆవిషయం సమాజం కూడాగుర్తించాలి. కొన్ని సార్లుప్రత్యేక పరిస్థితులలోపిల్లలు పని చెయ్యాల్సినఅవసరం వస్తుంది. అప్పుడుఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థమెరుగుపరిచేందుకు మనప్రభుత్వం గట్టి కృషి చెయ్యాలి. చదువుకున్నయువత సానుకూల దృక్పథంతో ఆలోచనచేస్తారు. అది దేశాన్నిఅభివృద్ధి పధంలోకితీసుకుని వెళుతుంది.రాజకీయ రంగంలోకూడా…
Read More
ఆ!వె!!💐💐💐💐

ఆ!వె!!💐💐💐💐

చక్కగాను సాగు సంసార మందునతిండి బోతులెల్ల తిట్టుకొనగచావు రాక వారు చచ్చిరి పలుమార్లుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! ముందునుండి జూడ మోకాలు ముందుడుమడమ వెనుక నుండు మరలి చూడఅడుగునుండి జూడ అరికాలు క్రిందుండుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
చదువు సంస్కారములు మనుష్యుల హృదయాలలో వెలిగే జీవనజ్యోతులు .మనిషి నడవడికలో మానవత్వం ఉట్టిపడే సౌందర్యంలో జీవనయానం కొనసాగిస్తూ, తను ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసే సౌమ్యత ,సౌశీళ్యం,జీవకారుణ్యం, సహజత్వం,మానవీయ విలువలను మేల్కొలిపే మనిషిని జీవితంలో మరచిపోలేని చైతన్యమూర్తి బహుదూరతీరాల దాకా కొనసాగును జీవన ప్రస్థానం .అపరాజిత్ ,సూర్యాపేట

చదువు సంస్కారములు మనుష్యుల హృదయాలలో వెలిగే జీవనజ్యోతులు .మనిషి నడవడికలో మానవత్వం ఉట్టిపడే సౌందర్యంలో జీవనయానం కొనసాగిస్తూ, తను ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసే సౌమ్యత ,సౌశీళ్యం,జీవకారుణ్యం, సహజత్వం,మానవీయ విలువలను మేల్కొలిపే మనిషిని జీవితంలో మరచిపోలేని చైతన్యమూర్తి బహుదూరతీరాల దాకా కొనసాగును జీవన ప్రస్థానం .అపరాజిత్ ,సూర్యాపేట

Read More
పోరుబాట

పోరుబాట

సృష్టిలో బడుగు మనిషి జీవితం ఆకలి మంటల సింహ ప్రస్థానంకొమ్మల ఆకుల్లోంచి సూరీడు విరజిమ్మే కాంతుల్లో అతనొక అవనీపుత్రుడుకదిలే పాదాలకు కూడా కళ్ళు పొడుచుకొచ్చాయేమోనింపాదిగా నడిచివెళ్లే తీరు కళ్ళు జిగేల్మనేలా ఏ పోరుబాటకో వెళ్తున్న గర్జించే అడవి సింహంలా,,,,,,,అతను వెళ్తున్నా కొలది పరుచుకుంటున్న నీడలే రహదారులుముళ్ల తుప్పలు రాలిపడుతున్న ఆకుల మధ్య మనోగవాక్షం నుండి రువ్వే ఆలోచనల తంత్రులలోంచి ఆవేశకావేశాలు,,,,,,,,,,యువకిషోరం ఉడుకు రక్తం పొంగులో సమసమాజ స్థాపనకై దుష్టదుర్మార్గుల గుండెల్లో నిద్రపోవాలని తపన,,,,,,,,,,ఈ దుష్టదుర్మార్గుల ప్రపంచాన్ని అవలీలగా జయించి ఆ మంటల సూరీడుకే వణుకు పుట్టించాలని ఉప్పొంగే నరాలు జివ్వుమంటుంటే జీవితం అగ్నిశిఖ,,,,,,,అర్థం పర్థం లేని చదువులు సృష్టించిన నిరుద్యోగం నిప్పుల మీద నడకలా కారుచీకట్లోంచి ఉరుముల మెరుపులతో వెలుగుల్లోకి ,,,,,,,,,,,ఎరుపెక్కిన యవ్వనం కళ్ళు ఉక్కు శరీరం కంటిమీద కునుకు లేక బలిసిన వాడి మేడలు గోడలు పీకేసేందుకు ఉవ్వెత్తున కెరటాలకు కెరటాలై సావాసగాళ్లతో ఎగిసిపడితే,,,,,,,,,పోరాడితే పోయేదేంలేదు బానిస సంకెళ్లు తప్పకాని…
Read More