Blog

Your blog category

ఆకాశం

ఆకాశం ఎందుకో ఎర్రబడ్డదిఎవరో గోంతేత్తి అరుస్తున్నట్టుశక్తి స్వరూపిణి తన నాలుకతోనరకాసురుణ్ణి వదిస్తున్నట్టుమరో అబలను హరిస్తున్నట్టుమరో పుట్టిన పసికందునుచెత్తబుట్టలో వేస్తున్నట్టుఅమ్మాయిని బుట్టలో వేస్తునట్టుపబ్బుల్లో రక్తాలు పారుతున్నట్టుడ్రగ్స్ ముఠాలు కత్తులు నూరుతున్నట్టుయువత నరాల్లో రక్తం ఎక్కిస్తున్నట్టుమరో ప్రపంచానికి తెరతీస్తున్నట్టుడబ్బులు లేక కుక్కిమంచంలోతాత రక్తం కక్కుతున్నట్టుఫ్యాక్టరీ పొగల్లో ఊపిరి ఆడని కార్మికులుమందు సీసాల్లో రక్తం మరుగుతున్నట్టుకట్టెల పొయ్యిలో ఊది ఊదిగుండెలు అవిసినట్టు అలసిపోయినట్టువేరిక్కిన యువత బట్టలు చింపుకున్నట్టువీడియో గేముల్లో బతుకును రక్తం చిందుతున్నట్టుఆప్యాయత, అనురాగాలు కనుమరుగయినట్టుకుటుంబాలు విచ్చిమైనట్టు, రక్త సంబంధాలుకనపడకుండా పోయినట్టుఆకాశం ఎందుకో ఎర్రబడ్డదిభవ్య చారు
Read More

కం!!💐💐💐💐

సింహముల వంచ వచ్చునుసంహారము జేయవచ్చు శౌర్యులనైనన్!సింహాసనముదిగుచు నాసింహతలము జేయమేలు శ్రీమతికిపుడే!! సింహతలము తలవంచుటరెండుచేతులు జోడించి మ్రొక్కుట. దారను గెలిచిన వీరునినేరుగ చూడంగ లేము నెప్పటికైనన్దారను ప్రేమించిన తాభారమ్మును మోయుచుండు బ్రతుకుచు కృష్ణా! తలవంచను రౌడీలకుతలవంచను రాజనీతి ధర్మమ్మునకున్తలవంచను సింహాలకుతలవంచక తప్ప లేదు దారకు కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More

ఉ!మా!!💐💐💐

వైద్యము తోడ రోగులవి బాధలు దీర్చిన దైవమందురేసేద్యము జేసి పంటలను చేర్చిన బీదలు నిన్ను మ్రొక్కురోవిద్యను గూర్చుచుండినను పేదలు విజ్ఞత చూపుచుందురోచోద్యము చేయనేల యిక శూరత జూపగ సాగు చుండరో!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More

అక్షర కొరకుఅంశం :⁠- సమాజంలో జరుగుతున్న అకృత్యాలు ,వాటి పరిష్కారాలుతేది:⁠- 03/10/2025

సమాజం నిత్యం మారుతూ ఉన్నా, కొన్ని అకృత్యాలు (సామాజిక రుగ్మతలు, అన్యాయాలు) మాత్రం విషవలయంలా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ అకృత్యాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి, ఆచరణీయమైన పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో నేడు వేళ్లూనుకుపోయిన కొన్ని ముఖ్యమైన అకృత్యాలు, అసమానతలు: పేద, ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా దక్కకపోవడం.కేంద్రీకృత సంపద, పాతకాలపు సామాజిక కట్టుబాట్లు, వివక్ష. ఆర్థిక అసమానతలే నేరాలు, లంచగొండితనం, అశాంతికి ప్రధాన కారణమవుతున్నాయి. మహిళలపై దాడులు, హింస: లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, మహిళా భ్రూణహత్యలు. సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలం, మహిళలను కేవలం వస్తువుగా చూడటం, చట్టాలపై భయం లేకపోవడం, శిక్ష పడడంలో ఆలస్యం. అవినీతి, లంచగొండితనం: ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత లోపించడం, చిన్న పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సి రావడం. వ్యక్తిగత అత్యాశ, నైతిక విలువలు…
Read More
ప్రపంచ నిగ్రహ దినోత్సవం

ప్రపంచ నిగ్రహ దినోత్సవం

ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న, ప్రపంచ నిగ్రహ దినోత్సవం ప్రజలు మద్యపానాన్ని మానేయమని ప్రోత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిగ్రహ ఉద్యమాల చరిత్ర గురించి తెలుసుకోవడానికి కూడా ఇది ఒక రోజు. పులియబెట్టిన పానీయాలు మరియు మద్య పానీయాలు వేల సంవత్సరాల నాటివి. ప్రాచీన ఈజిప్షియన్లు మరియు చైనీయులు మొదట మద్యం సేవించిన వారిలో కొందరు. 2700 BCలో బాబిలోనియన్లు వైన్ దేవతను పూజించేవారు. మీడ్ అనే మద్య పానీయం గ్రీస్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. బైబిల్ కూడా వైన్ తాగడం గురించి ప్రస్తావిస్తుంది. వాస్తవానికి, నీటిని వైన్‌గా మార్చడం యేసు చేసిన రెండవ నమోదు చేయబడిన అద్భుతం. మద్యం వేలాది సంవత్సరాలుగా సమాజం మరియు సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. అయితే, అందరూ మద్యం పట్ల సానుకూల దృక్పథంతో చూడలేదు. గ్రీకు సాహిత్యం అధిక మద్యపానం గురించి హెచ్చరికలతో నిండి ఉంది. 19వ శతాబ్దంలో, మద్యపాన నిగ్రహ ఉద్యమం మద్యపానాన్ని మితంగా ఉపయోగించడాన్ని…
Read More
జాతీయ బాయ్‌ఫ్రెండ్ దినోత్సవం

జాతీయ బాయ్‌ఫ్రెండ్ దినోత్సవం

జాతీయ బాయ్‌ఫ్రెండ్ దినోత్సవం అనేది అనేక దేశాలలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 3 న జరుపుకునే అనధికారిక కార్యక్రమం. ఇది బాయ్‌ఫ్రెండ్‌లకు అంకితం చేయబడిన రోజు మరియు సంబంధాలలో వారి పాత్రను అభినందిస్తుంది. మీ బాయ్‌ఫ్రెండ్ కోసం ఏదైనా మంచి చేయండి. అతనిని డేట్‌కి తీసుకెళ్లడం అనే ఆలోచన ఉంది, అది విందు అయినా లేదా సినిమా అయినా. మీరు అతన్ని గోల్ఫ్ ఆడటానికి లేదా చేపలు పట్టడానికి లేదా అతనికి ఇష్టమైన ఏదైనా హాబీకి తీసుకెళ్లవచ్చు. మీరు అతన్ని టీవీ చూడటానికి రిమోట్ కంట్రోల్‌ని కూడా నడపనివ్వవచ్చు. అబ్బాయి స్నేహితుల విషయానికొస్తే, ఈ రోజును ఇతర పురుషులతో మీ స్నేహాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోండి. అబ్బాయి స్నేహితులను కలిగి ఉండటం మరియు మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నారని మరియు వారు మీ జీవితంలో ముఖ్యమైనవారని వారికి తెలియజేయడం నిజంగా సరైందే, కాబట్టి ఫోన్ తీసుకొని మీ అబ్బాయిల ప్రాణ…
Read More

అక్టోబర్ 03 ప్రత్యేకతలు :⁠-

1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861). 1957 : ఆకాశవాణి విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం. 1990 : బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది. 1992 : చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దిగవల్లి వేంకటశివరావు మరణం.(జ.1898). 2006 : తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి ఇ.వి.సరోజ మరణం (జ.1935). మాధవి కాళ్లసేకరణ
Read More

అక్షర లిపికి “చతుర్థ వార్షికోత్సవ” శుభాకాంక్షలు

అక్షరలిపికి శుభములు అందుగాకవార్షికోత్సవ శుభవేళ వందనములుగాంధితాతకు,శాస్త్రికి వందనములుసంతసించాలి సాహితీ సభ్యులంతఆరుగాలము సేవలందమరు గాకవిజయదశమితో మొదలిడి విజయమందతెగువజూపుము దుర్గమ్మ తెలుగు వెలుగఆదుకొనుమమ్మ శారదా అండనుండిమరల వచ్చెడి వార్షిక వత్సరముకుసభ్యులందరు సౌభాగ్య శుభము లందిసత్కవితలను వినిపించు శక్తి నిమ్ము!! మరొక్క మారు మననము చేస్తూ… ............ కోట.
Read More

ఉ!!💐💐💐💐💐

అమ్మయె చేయిజార పర యమ్మని యమ్మగ బిల్వ సాధ్యమేకొమ్మయె కూలిపోవగను కూర్చగ పూలను కష్టమవ్వునేనమ్మిన నాన్నగారు నిల నమ్మక ద్రోహము చేయుటేలనోకమ్మని వంటకమ్ములను కాదని పోయిన కాలుచుండురో!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More

ఉ!!💐💐💐

పాఠకులైన నేమి గుణ పాఠము నేర్పిరి విద్య నేర్వగన్!పీఠములెక్కి నేతలిల భేదము జూపిరి ఓటరన్నపై!పాఠము నేర్చి శిష్యులిల పంతము బట్టుచు గేలిచేయగన్!శోఠము వోలె వేగిరమె చొచ్చుకు పోవలె కానలోపలన్!! శోఠము/ పావురము. గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More