Blog

Your blog category

ఉ!!మా!!💐💐💐💐💐

మీసము దిప్పినంత మన మేలును గాంచరు చూడరోదొరాగ్రాసము గోరినంత ఘన కాసుల నీయక బంధువుల్మరీకూసములెల్ల యూడినను కూర్చరు గూడును మిత్రులెల్లరున్రాసుల కొద్దిగాను ధన రాసులు జూసియు నవ్విరందరున్!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More

ప్రపంచంలో గాంధీజీ విగ్రహం లేని దేశం లేదు.

'నా జీవితమే ఒక సందేశం' అన్న మాట చాలు ఆయన విశ్వ మానవుడని చెప్పడానికి. ఆ మాట చెప్పడానికి ఒక వ్యక్తికి ఎంత ధైర్యం, సాహసం కావాలో కదా..! ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం నిజాల కోసం వెతికిండు. గాంధీని పొగడడం తేలిక. కానీ, ఆయన్ను అనుసరించడం కత్తిమీద సాము లాంటిది. అందుకే గాంధీయిజం ఎవర్స్! గాంధీజీ మనసులో కొన్ని విలువలు ఉండేవి. ఏ విలువల్ని, ఏ సిద్ధాంతాల్ని ఆయన నమ్మేవాడో… వాటిని ఖచ్చితంగా ఆచరించేవాడు. ఇతరులకు ఏదైనా ఉపదేశించాలంటే ముందు దాన్ని ఆయన సాధన చేసేవాడు. 'చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది కాదు" అని ఒక పిల్లవాడికి చెప్పడానికి.. అంతకు రెండు వారాల ముందే ఆయన చక్కెర తినడం మానేశాడు. ఇలా ఏ పని చేసినా సాధన చేశాకే.. ఇతరులకు చెప్పేవారు. ఒక మనిషి తన విలువలకు కట్టుబడి జీవించాలనుకున్నప్పుడు.. కాలం, ప్రదేశం, పరిస్థితులు ఆ విలువలకు పరీక్షలు పెడుతుంటాయి. ఆ…
Read More

అక్షరాల అగ్నిపూవులు

బ్రతుకు పుటలలోదుఃఖిత లోగిళ్ళనులిఖించుకున్న అక్షరాలనుఎన్నిమార్లు మళ్ళీమళ్ళీ చదువుకున్నానోకన్నీళ్ళను కళ్ళ బావిలోంచితోడుకుని నాలోనేను కుమిలి కుమిలిలౌక్యం తెలియని అమాయకత్వంలోఎన్నెన్ని మార్లు మోసపోయానోఎన్నిమార్లు చావు తలంపులతోపిశాచి కళ్ళల్లో తేలియాడానోబాల్యం నుండి మనో సంఘర్షణలలోఎడారి మంటల ఇసుకలోజీవితమంతా ఎండమావుల్లో నీటికై పరుగులుఎక్కడా ఆసరాగా ఒయాసిస్సు అగుపించలేదుఓటముల మీద ఓటములతోజీవితమంతా గుండె మంటలేస్నేహితులే నా ప్రతిభకు సవాళ్ళైనారునేను అనేవాన్ని చిరునామా లేకుండానా ప్రగతి పడగొట్టి నాపైనుండి అందలాలెక్కారుఅగమ్యగోచరంగా ప్రయాణం సాగించానుమనస్సు నిండా అగ్గిపుష్పించితిమిరాల నుండి సన్నని కాంతి కిరణాలుఎక్కడినుండో చిన్నిచిన్ని ఆశలుజీవితంలో చిగుళ్ళు తొడిగాయిచిన్న బడిపంతులు ఉద్యోగంఅక్షరాలు రాసుకునేందుకు కలంఅగుపించిన కాగితాల నిండా సిరా మరకలేఅక్షరాల తొలిపొద్దు ఆరాధ్యందైవ కృపవల్ల మీ ముందుకుమీ అనుంగు సోదరుడు అక్షరాలలోనా జీవుతానుభవాలే నా కవితలునాకు కళ్ళల్లోని అక్షరాలు ఆ దైవం,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More

నీ గొంతు పిల్లికూతలు,,,,,!!

నీ గానం పిశాచాల గోలనీ రాతలు నిప్పుల సెగలునీ ఆలోచనలు అగ్ని శ్వాసాలునీ పాటలు కర్ణకఠోరంనీ భాష బూతు పురాణంనీ మాటలు గుండెల్లో గుబులునీ నాట్యం కోతి గెంతులునీ హృదయం రక్తపుటేరులునీ మనస్సు దయ్యాల కొంపనీ ఊహలు బూతు చిత్రాలునీ ఆశలు ఆశ్చర్యంవేసే అడియాశలునీ ముఖం పగిలిన గాజుబొమ్మనీ కలలు పట్టపగలు వెన్నెలలునీ కళలు ఆత్మహత్యకై పోరునీ నటన మూగసైగల అడవిమనుషుల జీవనంనీ రచనలు మూర్ఖుల భావాలునీ ప్రేమలు మితిమీరిన బెల్లం ముద్దలునీ శ్రమల వెల దొంగనోట్లతో చెరసాలనీ తిండి గేదెలు మేసే గడ్డినీ తాగుడు పేగులు తెగుతున్న చప్పుడునీ సోమరి చమట లిక్కర్ దుర్వాసననీ ఆకలికి చీల్చుకుతినే పచ్చిమాసంనీ జీవితం ఎండమావుల్లో ఈదటం అపరాజిత్సూర్యాపేట
Read More

విజయదశమి

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటదసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు…
Read More

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటారు. 15 జూన్ 2007 వ తేదీన ఐక్య రాజ్య సమితి జనరల్ శాసనసభ అక్టోబరు 2 రోజును అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా జరుపుకోడానికి నిర్ణయించింది. ఈ రోజున సభ్యదేశాలను తగురీతిగా సత్యాగ్రహం నినాదాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా చెప్పింది." సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. మహాత్మా గాంధీ సెప్టెంబరు 11, 1906 న దక్షిణ ఆఫ్రికా లో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్ లూథర్ కింగ్ ను కూడా ఈ ఉద్యమం…
Read More

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

లాల్ బహదూర్ శాస్త్రి(1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో…
Read More

గాంధీ జయంతి(అంతర్జాతీయ అహింసా దినం)

అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 2 , మహాత్మా గాంధీ జన్మదినం రోజున జరుపుకుంటారు . ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం A/RES/61/271 ప్రకారం ఇది జూన్ 15, 2007న స్థాపించబడింది. ఈ రోజు "విద్య మరియు ప్రజా అవగాహన ద్వారా అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి … మరియు శాంతి, సహనం, అవగాహన మరియు అహింస సంస్కృతి కోసం కోరికను పునరుద్ఘాటించడానికి" ఒక సందర్భం. ఇది ప్రభుత్వ సెలవుదినం కాదు , కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్గాల్లో జరుపుకుంటారు, తరచుగా ప్రపంచ సమస్యలపై దృష్టిని ఆకర్షించడానికి. దీని తేదీ మరియు ఉద్దేశ్యం గాంధీ జయంతి యొక్క భారత జాతీయ ప్రభుత్వ సెలవుదినంతో సమానంగా ఉంటుంది. జనవరి 2004లో, ఇరానియన్ నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాది పారిస్‌లోని ముంబైలోని వరల్డ్ సోషల్ ఫోరమ్‌కు అంతర్జాతీయ విద్యార్థులకు బోధిస్తున్న ఒక హిందీ ఉపాధ్యాయుడి నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవ ప్రతిపాదనను తీసుకున్నారు .…
Read More

అక్టోబర్ 02 ప్రత్యేకతలు :⁠-

1.1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు. 1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు. 1845: భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది. 1934: భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది. 1951: శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. 1952: సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది. 1954: ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది. 1955: చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది. 1961: బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. 1966: భారతదేశం లోని 16…
Read More

నిద్రలు కరువైన మనుష్యులు,,,,,,,!!

ఉదయం నుండి పడుకునేదాకరణగొణధ్వనుల మధ్య బిజీబిజీగా వత్తిడిలో గడిచిపోయే రోజులుముసురుకుంటున్న వడివడిగా ఆలోచనల పరంపరనిద్రలేక ఎండిపోయి ఆకులు రాలిన వృక్షంలా ఆందోళనల ఈదురుగాలులునిద్రలేని గుబులు మనస్సు పొరలు విచ్చుకుని ఆలోచనల అలజడులుఎంత ప్రయత్నించినా కునుకుపట్టని రాత్రులన్నీఅగ్నిపునీత కళ్ళల్లో అగ్నికీలలుతెల్లవార్లు కళ్ళుబైర్లు కమ్ముతూ కళ్ళల్లో మెరుపులురాత్రుళ్ళు నిద్రపట్టని అభాగ్యురాలి ఆక్రందనలలా రక్తసిరలు మసలే కళ్ళుకునుకు పట్టని నిశీధిలో నీడలు నీడలుగా కదులుతూ కళ్ళుశారీరం అలసిపోతే నిద్రనింపుకున్న కళ్ళు ఒళ్ళుతెలవని ఘాటైన ఘాడనిద్రలో కళ్ళుపునీతలు మనస్సు తనువుఆయురారోగ్యాలు సిద్దించును జీవిత రథచక్రాలు వడివడిగా సాగిపోతూ,,,,,మత్తుమందులు,బీరు,విస్కీలకు వచ్చేది నిద్రకాదు మరణానికి చేరువచేసే మత్తులో ,,,,,,చిత్తు,,,చిత్తు,,,,!కష్టజీవికి అలసిసొలసి అలా పడుకోగానే ఘాడనిద్రలోకి జారుకుంటాడుచమట పట్టని వైట్ కాలర్ మనస్సు ,నోటిని మాత్రమే ఉపయోగించే వాళ్ళు అలా ఆరుబయట నడక, రోజంతా హుషారుగా ఉంచుతుంది, రాత్రి త్వరగా నిద్రపడుతుంది,,,,,,, !! అపరాజిత్సూర్యాపేట
Read More