హృదయసఖీ
అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :- చిత్రంతేది:- 03/02/2026శీర్షిక:- హృదయసఖీ… ప్రియమైన నా హృదయసఖీ… ఈ చిత్రం చూసిన క్షణమే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది? నీలిరంగు ఆకాశంలా నిశ్శబ్దంగా ఉన్న నీ రూపం, చేతుల్లో నూలుదారాలతో నువ్వు అల్లుకుంటున్న ఆ సున్నితమైన క్షణం , ఇవన్నీ నా గుండెలో ఒక మధురమైన అలజడిని రేపాయి. నువ్వు అలా శాంతంగా కూర్చుని ఏదో నేసుకుంటూ ఉన్నావు కదా! అది బహుశా నా జీవితం కావచ్చేమో అనిపించింది. ప్రతి దారంతో నువ్వు అల్లేది నా కలలని, నా భావాలని, నా ప్రేమని అనిపించింది. నీ ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత నాకు ఎప్పుడూ కావాలి? జీవితపు తుపానుల్లో చిక్కుకున్నప్పుడు నీ జ్ఞాపకం ఒక నీడలా నన్ను చల్లబరుస్తుంది. ఈ చిత్రంలో నీ చుట్టూ తిరుగుతున్న గాలిలా నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతుంటాయి? నువ్వు వేసే ప్రతి కుట్టు నా గుండె మీద…